అందాలుచిందే రూపం...! అలచందమామ రూపం!!
హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు అప్పల వేంకటరామహరనాథరాజు. ఈయన జీవిత చరిత్ర గురించి సవివరంగా చెప్పగలవారు నేడు ఆంధ్రదేశంలో కనుమరుగైపోయారు. 'యూ ట్యూబ్' వంటి వాటిల్లో చాలామంది హరనాథ్ గురించి 'పలు గాలి కబుర్లను పోగేసి చెప్పినా, వాటిలో సత్యాసత్యాలను విడదీసి తెలుసుకోవాలంటే, హంసలా క్షీరనీరాలను వేరు చేసే విచక్షణాజ్ఞానం అవసరం! హరనాథ్ జీవితవిశేషాలు, ఆయన తండ్రి వరహాలరాజు రచించిన 'శ్రీ ఆంధ్రక్షత్రియ వంశరత్నాకరము' అనే గ్రంథంలో కొద్దిగా లభిస్తున్నాయి. సత్యం మాత్రమే తెలుసుకోదలచిన విజ్ఞులకు వరహాలరాజు రాసిన జీవితవిశేషాలే ఆధారం.
హరనాథ్ మాతామహులు సాగిరాజు సుబ్బరాజు, వీరి శ్రీమతి సుభద్రయ్యమ్మ. ఈ దంపతుల కుమార్తె రామయ్యమ్మ. ఈవిడను కూడా సుభద్రయ్యమ్మ అనే అందరూ అనేవారు. సుబ్బరాజు తమ కుమార్తెను వరహాలరాజుకిచ్చి వివాహంచేశారు. వరహాలరాజు మంచి రచయిత మాత్రమే కాదు, రంగస్థల నటుడు కూడా! ఈయన 1945వ సం||లో, మద్రాసులోని వి.పి.హాలులో ప్రదర్శించబడ్డ 'ఖిల్జీరాజ్యపతనం' నాటకంలో కథానాయకుడి పాత్ర.............
అందాలుచిందే రూపం...! అలచందమామ రూపం!! హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు అప్పల వేంకటరామహరనాథరాజు. ఈయన జీవిత చరిత్ర గురించి సవివరంగా చెప్పగలవారు నేడు ఆంధ్రదేశంలో కనుమరుగైపోయారు. 'యూ ట్యూబ్' వంటి వాటిల్లో చాలామంది హరనాథ్ గురించి 'పలు గాలి కబుర్లను పోగేసి చెప్పినా, వాటిలో సత్యాసత్యాలను విడదీసి తెలుసుకోవాలంటే, హంసలా క్షీరనీరాలను వేరు చేసే విచక్షణాజ్ఞానం అవసరం! హరనాథ్ జీవితవిశేషాలు, ఆయన తండ్రి వరహాలరాజు రచించిన 'శ్రీ ఆంధ్రక్షత్రియ వంశరత్నాకరము' అనే గ్రంథంలో కొద్దిగా లభిస్తున్నాయి. సత్యం మాత్రమే తెలుసుకోదలచిన విజ్ఞులకు వరహాలరాజు రాసిన జీవితవిశేషాలే ఆధారం. హరనాథ్ మాతామహులు సాగిరాజు సుబ్బరాజు, వీరి శ్రీమతి సుభద్రయ్యమ్మ. ఈ దంపతుల కుమార్తె రామయ్యమ్మ. ఈవిడను కూడా సుభద్రయ్యమ్మ అనే అందరూ అనేవారు. సుబ్బరాజు తమ కుమార్తెను వరహాలరాజుకిచ్చి వివాహంచేశారు. వరహాలరాజు మంచి రచయిత మాత్రమే కాదు, రంగస్థల నటుడు కూడా! ఈయన 1945వ సం||లో, మద్రాసులోని వి.పి.హాలులో ప్రదర్శించబడ్డ 'ఖిల్జీరాజ్యపతనం' నాటకంలో కథానాయకుడి పాత్ర.............© 2017,www.logili.com All Rights Reserved.