శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం రవిచంద్రన్ గారి బృహద్గ్రంథం. తమిళ, తెలుగు రచనల్లో శ్రీవారి ఉత్సవకాంతుల్ని వెదజల్లిన వజ్రాలహారమది. కాశీఖండం 'అయఃపిండం' అన్నారు. అట్లాంటి రచనను సరళమైన తెలుగులో అందించాడు. ఆంద్రజ్యోతిలో రవిచంద్రన్ నిర్వహించిన 'జ్ఞాపకాలు', 'వెండితెర బంగారం', 'అనగనగా ఒకపాట' శీర్షికలు అశేష పాఠకాదరణ పొందాయి. రవిచంద్రన్ రాసిన 'కరిగిపోయిన కర్పూరకాళిక సావిత్రి' మహానటి సావిత్రిని తెలుగు సినిమా ప్రేమికులకు కొత్తకోణంలో చూపింది. ఈయన రాసిన అనేక వ్యాసాలు తమిళం, కన్నడం, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలోకి తర్జుమా అయ్యాయి.
నలభై దాటని వయసులో ప్రాచీన, అర్వాచీన గ్రంథాల్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసి వాటి అంతఃసారాన్ని మనకు అందించడం ఆయన రచనాశైలి. పురాణ, కావ్య, ప్రబంధరీతుల్ని అపూర్వంగా విశ్లేషిస్తాడు. తెలుగుభాష అంటే ఆయనకు వ్యామోహం. నన్నయ మొదలు తెలుగుభాష సోయగాలు, వొయ్యారాలు అరటిపండు వొలిచినట్లు మనకు అందిస్తారు. "సప్తగిరి" మాసపత్రికలో రవిచంద్రన్ ధారావాహికగా రాస్తున్న 'కైంకర్యమే తనువుదాల్చితే...' విశేషపాఠకాదరణ పొందుతున్నది. ప్రస్తుతం భద్రాచల రామదాసు కీర్తనలకు భావ వ్యాఖ్యతో రవిచంద్రన్ కలం నుండి వెలువడిన అద్భుత రచన 'అంతా రామమయం'.
శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం రవిచంద్రన్ గారి బృహద్గ్రంథం. తమిళ, తెలుగు రచనల్లో శ్రీవారి ఉత్సవకాంతుల్ని వెదజల్లిన వజ్రాలహారమది. కాశీఖండం 'అయఃపిండం' అన్నారు. అట్లాంటి రచనను సరళమైన తెలుగులో అందించాడు. ఆంద్రజ్యోతిలో రవిచంద్రన్ నిర్వహించిన 'జ్ఞాపకాలు', 'వెండితెర బంగారం', 'అనగనగా ఒకపాట' శీర్షికలు అశేష పాఠకాదరణ పొందాయి. రవిచంద్రన్ రాసిన 'కరిగిపోయిన కర్పూరకాళిక సావిత్రి' మహానటి సావిత్రిని తెలుగు సినిమా ప్రేమికులకు కొత్తకోణంలో చూపింది. ఈయన రాసిన అనేక వ్యాసాలు తమిళం, కన్నడం, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలోకి తర్జుమా అయ్యాయి. నలభై దాటని వయసులో ప్రాచీన, అర్వాచీన గ్రంథాల్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసి వాటి అంతఃసారాన్ని మనకు అందించడం ఆయన రచనాశైలి. పురాణ, కావ్య, ప్రబంధరీతుల్ని అపూర్వంగా విశ్లేషిస్తాడు. తెలుగుభాష అంటే ఆయనకు వ్యామోహం. నన్నయ మొదలు తెలుగుభాష సోయగాలు, వొయ్యారాలు అరటిపండు వొలిచినట్లు మనకు అందిస్తారు. "సప్తగిరి" మాసపత్రికలో రవిచంద్రన్ ధారావాహికగా రాస్తున్న 'కైంకర్యమే తనువుదాల్చితే...' విశేషపాఠకాదరణ పొందుతున్నది. ప్రస్తుతం భద్రాచల రామదాసు కీర్తనలకు భావ వ్యాఖ్యతో రవిచంద్రన్ కలం నుండి వెలువడిన అద్భుత రచన 'అంతా రామమయం'.© 2017,www.logili.com All Rights Reserved.