చిన్నమ్మి దొమ్మదాయికాలు..!
తెలుగు నాట అస్తిత్వ ఉద్యమాలు అందించిన చైతన్యం మామూలుది కాదు. ఆధిపత్య కుటుంబాల కనుసన్నల్లోంచి అట్టడుగు బతుకుల్లోకి, అవమానాల వీధుల్లోకి, ఆత్మగౌరవపు వాకిట్లోకి సాహిత్య సృజన విరివిగా సాగింది.
ఆ చైతన్యంతో ఎవరి జీవితాలను వారు, ఎవరి గాథల్ని వారు రాసుకోవడం ఒక ఎత్తు అయితే, అట్టడుగు బతుకులు పట్ల సానుకూల వైఖరితో, సానుభూతి, సహానుభూతితో రాసిన సాహిత్యం మరో చేర్పు. అనాదిగా అభివృద్ధికి దూరమైన ఆదివాసీల, గిరిజన జీవితాల నేపథ్యంలో ఆదివాసీలు, గిరిజనులు రాసిన సాహిత్యం రావాల్సినంత విరివిగా రాలేదు. ఇక గిరిజనేతరులు గిరిజనుల గురించి రాసిన సాహిత్య కృషి కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. అయితే ఇటీవల సాహిత్యంలో ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేస్తున్న యువతరంలో చిత్తూరు జిల్లా, పలమనేరు తాలూకా, కాలువపల్లెకి చెందిన కె.వి. మేఘనాథ్ రెడ్డి తనదైన అవగాహనతో స్పష్టతతో రచనలు చేస్తున్నారు...................
చిన్నమ్మి దొమ్మదాయికాలు..! తెలుగు నాట అస్తిత్వ ఉద్యమాలు అందించిన చైతన్యం మామూలుది కాదు. ఆధిపత్య కుటుంబాల కనుసన్నల్లోంచి అట్టడుగు బతుకుల్లోకి, అవమానాల వీధుల్లోకి, ఆత్మగౌరవపు వాకిట్లోకి సాహిత్య సృజన విరివిగా సాగింది. ఆ చైతన్యంతో ఎవరి జీవితాలను వారు, ఎవరి గాథల్ని వారు రాసుకోవడం ఒక ఎత్తు అయితే, అట్టడుగు బతుకులు పట్ల సానుకూల వైఖరితో, సానుభూతి, సహానుభూతితో రాసిన సాహిత్యం మరో చేర్పు. అనాదిగా అభివృద్ధికి దూరమైన ఆదివాసీల, గిరిజన జీవితాల నేపథ్యంలో ఆదివాసీలు, గిరిజనులు రాసిన సాహిత్యం రావాల్సినంత విరివిగా రాలేదు. ఇక గిరిజనేతరులు గిరిజనుల గురించి రాసిన సాహిత్య కృషి కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. అయితే ఇటీవల సాహిత్యంలో ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేస్తున్న యువతరంలో చిత్తూరు జిల్లా, పలమనేరు తాలూకా, కాలువపల్లెకి చెందిన కె.వి. మేఘనాథ్ రెడ్డి తనదైన అవగాహనతో స్పష్టతతో రచనలు చేస్తున్నారు...................© 2017,www.logili.com All Rights Reserved.