పనిమంతుడు
నిర్మలమైన ఆకాశంలో సహస్ర కిరణుడి స్వర్ణ కాంతులు సింగిడి రంగుల్లో మిళితమై అప్పుడే పుట్టిన పసిబిడ్డ స్పర్శించినట్టు మృదువుగా ప్రకృతిని తాకింది.
పాపిటలా తీసిన దారికి ఇరువైపులా శిగర చెట్ల నుండి తెలతెల్లని పూత నేల రాలుతున్నది. కూర్చిన ముత్యాలదండ తెగి పూసలు కిందపడినంత వయ్యారంగా,
ఆ దారినే అనుసరిస్తూ పలుగు పార, చుట్టజేసి చుట్టపై పెట్టుకుంది. కుడి భుజానికి చిక్కం, నడుముకు పక్కగా వక్కాకు తిత్తి, ఎడమ పక్కన చంకలో బిడ్డను ఎత్తుకొని అవలీలగా అంతే కులుగా నడుస్తూ ముం.దుకెళ్లిపోతున్నది రంగి.
తలకు తుండుగుడ్డ, కుడి భుజం మీద గునపం, ఎడమచేతిలో చిక్కగా అల్లిన బుట్ట, ఆ బుట్ట లోపల మట్టి కుండ, ఆ కుండలోపు పచ్చి ఆకులు, పిడకలు, పైకెత్తి కట్టిన లుంగీతో ఎంతో హుందాగా అంతే సునాయాసంగా నడిచేస్తున్నాడు రంగడు. పనిమంతులు పొద్దు పొద్దున్నే యాడ్నోయలబారిండారే?" ఆప్యాయమైన
పిలుపు వారి చెవిని తాకింది.
రంగడు ఠక్కున తిరిగి చూసి “అన్నోవ్! పనిమంతుడి లెక్కన నీ వుండావు. మేమేడ పనిమంతులం” అన్నాడు.
బదులుగా ఆనందయ్య నవ్వాడు.
“మనిసి కరువైపోనావు శ్యానా దినాలికి కనపడిండావు!? ఎట్లుండావు? ఎల్లమ్మ , బాగుండాదా!?” రంగడు అన్నాడు అంతే ఆప్యాయతగా.
రంగి కాస్త దూరంలో నిలబడింది కానీ మాట్లాడించే ప్రయత్నమైతే చేయలేదు..............
పనిమంతుడు నిర్మలమైన ఆకాశంలో సహస్ర కిరణుడి స్వర్ణ కాంతులు సింగిడి రంగుల్లో మిళితమై అప్పుడే పుట్టిన పసిబిడ్డ స్పర్శించినట్టు మృదువుగా ప్రకృతిని తాకింది. పాపిటలా తీసిన దారికి ఇరువైపులా శిగర చెట్ల నుండి తెలతెల్లని పూత నేల రాలుతున్నది. కూర్చిన ముత్యాలదండ తెగి పూసలు కిందపడినంత వయ్యారంగా, ఆ దారినే అనుసరిస్తూ పలుగు పార, చుట్టజేసి చుట్టపై పెట్టుకుంది. కుడి భుజానికి చిక్కం, నడుముకు పక్కగా వక్కాకు తిత్తి, ఎడమ పక్కన చంకలో బిడ్డను ఎత్తుకొని అవలీలగా అంతే కులుగా నడుస్తూ ముం.దుకెళ్లిపోతున్నది రంగి. తలకు తుండుగుడ్డ, కుడి భుజం మీద గునపం, ఎడమచేతిలో చిక్కగా అల్లిన బుట్ట, ఆ బుట్ట లోపల మట్టి కుండ, ఆ కుండలోపు పచ్చి ఆకులు, పిడకలు, పైకెత్తి కట్టిన లుంగీతో ఎంతో హుందాగా అంతే సునాయాసంగా నడిచేస్తున్నాడు రంగడు. పనిమంతులు పొద్దు పొద్దున్నే యాడ్నోయలబారిండారే?" ఆప్యాయమైన పిలుపు వారి చెవిని తాకింది. రంగడు ఠక్కున తిరిగి చూసి “అన్నోవ్! పనిమంతుడి లెక్కన నీ వుండావు. మేమేడ పనిమంతులం” అన్నాడు. బదులుగా ఆనందయ్య నవ్వాడు. “మనిసి కరువైపోనావు శ్యానా దినాలికి కనపడిండావు!? ఎట్లుండావు? ఎల్లమ్మ , బాగుండాదా!?” రంగడు అన్నాడు అంతే ఆప్యాయతగా. రంగి కాస్త దూరంలో నిలబడింది కానీ మాట్లాడించే ప్రయత్నమైతే చేయలేదు..............© 2017,www.logili.com All Rights Reserved.