ముందుమాట
రీడబిలిటీ తక్కువ అనే ముందుమాటతో పుస్తకం ఆరంభమవ్వడం వింతగా ఉండొచ్చు. రచయిత సమాజంలో ఆలోచనాపరులంటూ 90-10 విభజన చేశారు. ఆ పదిశాతాన్ని ఉద్దేశించిన పుస్తకం. పదిశాతం మీద కూడా రచయిత అనుమానంగానే అన్నారు. ఆ అనుమానమే పునాది. మీమాంసే పునాది. అది విలువైన మీమాంస. ఆ పదిమందో లేక అంతకంటే తక్కువమందో కనెక్ట్ కాగలిగిన విషయాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే భావజాలాల పట్ల నడిచిన, నడుస్తున్న దారి పట్ల తిరుగులేని విశ్వాసం మీకున్నట్టయితే ఇది మీ పుస్తకం కాదు. సమాజం ఇలా ఎందుకుంది, అలా ఎందుకులేదు లాంటి ఆలోచనలు, నడిచొచ్చిన తొవ్వ గురించి నడవాల్సిన తొవ్వ గురించి కొన్ని ప్రశ్నలు, మీమాంస, విచికిత్స మీకున్నట్టయితే ఇది మీ కోసమే.
ప్రశ్నకు చర్చకు దూరంగా ఉంచేదేదైనా నిలువనీరు అవుతుంది. ప్రశ్నను అనుమానంగా చూడడం నిలువనీరుగా మారుతున్నదనడానికి సూచిక. ప్రశ్న అంటేనే వెనక్కు లాగడం అనే భావన నమ్మకాన్ని కాదు, నమ్మకలేమిని సూచిస్తుంది. ప్రశ్నమార్గాన్ని మరింత విశాలం చేస్తుంది. 'ముందు పనిచెయ్యి. తరువాత చూద్దాం. ఆచరణ పరిష్కరిస్తుంది. ఆలోచన సమస్యని పెద్దది చేస్తుంది' అని జ్వోతి పాత్ర చేత చెప్పించిన మాట కొన్ని పరిస్థితులలో కొందరికి అవసరం కావచ్చేమో. కానీ ఉద్యమాల్లో కూడా అందరికీ కాదు. అందరూ అదే భాష మాట్లాడడం అభాస.
మనిషి, సమాజం, ఆస్తి, పెళ్లి, రాజ్యం, చట్టం, జాతి, మతం, కులం, ఆధిక్యత, న్యూనత వంటి మౌలికమైన అంశాలన్నింటినో ఈ పుస్తకం చర్చిస్తుంది. వాటి మధ్య ఉండే అంతఃసంబంధాలను చర్చిస్తుంది. ఒక్కొక్కటే అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదేమో అనిపించే భావనలను ఒక్కచోట చర్చించడం వల్ల ఇంతకీ ఏం తేల్చదల్చు కున్నారీ పెద్దాయన అనిపించొచ్చు. కొన్ని చోట్ల ఏం చెప్పదల్చుకున్నారు అని కూడా అనిపించొచ్చు. మనుషుల గురించే కాకుండా మనిషి గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలెడతామో అప్పుడు మొదలవుతుంది ఒక అంతర్బహహిర్ యుద్ధారావం. అదొక నిప్పుల గుండం. తెలిసే మనిషి లోపలికి ప్రయాణించే ప్రయత్నం కొంతమంది రచయితలు.......................
ముందుమాట రీడబిలిటీ తక్కువ అనే ముందుమాటతో పుస్తకం ఆరంభమవ్వడం వింతగా ఉండొచ్చు. రచయిత సమాజంలో ఆలోచనాపరులంటూ 90-10 విభజన చేశారు. ఆ పదిశాతాన్ని ఉద్దేశించిన పుస్తకం. పదిశాతం మీద కూడా రచయిత అనుమానంగానే అన్నారు. ఆ అనుమానమే పునాది. మీమాంసే పునాది. అది విలువైన మీమాంస. ఆ పదిమందో లేక అంతకంటే తక్కువమందో కనెక్ట్ కాగలిగిన విషయాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే భావజాలాల పట్ల నడిచిన, నడుస్తున్న దారి పట్ల తిరుగులేని విశ్వాసం మీకున్నట్టయితే ఇది మీ పుస్తకం కాదు. సమాజం ఇలా ఎందుకుంది, అలా ఎందుకులేదు లాంటి ఆలోచనలు, నడిచొచ్చిన తొవ్వ గురించి నడవాల్సిన తొవ్వ గురించి కొన్ని ప్రశ్నలు, మీమాంస, విచికిత్స మీకున్నట్టయితే ఇది మీ కోసమే. ప్రశ్నకు చర్చకు దూరంగా ఉంచేదేదైనా నిలువనీరు అవుతుంది. ప్రశ్నను అనుమానంగా చూడడం నిలువనీరుగా మారుతున్నదనడానికి సూచిక. ప్రశ్న అంటేనే వెనక్కు లాగడం అనే భావన నమ్మకాన్ని కాదు, నమ్మకలేమిని సూచిస్తుంది. ప్రశ్నమార్గాన్ని మరింత విశాలం చేస్తుంది. 'ముందు పనిచెయ్యి. తరువాత చూద్దాం. ఆచరణ పరిష్కరిస్తుంది. ఆలోచన సమస్యని పెద్దది చేస్తుంది' అని జ్వోతి పాత్ర చేత చెప్పించిన మాట కొన్ని పరిస్థితులలో కొందరికి అవసరం కావచ్చేమో. కానీ ఉద్యమాల్లో కూడా అందరికీ కాదు. అందరూ అదే భాష మాట్లాడడం అభాస. మనిషి, సమాజం, ఆస్తి, పెళ్లి, రాజ్యం, చట్టం, జాతి, మతం, కులం, ఆధిక్యత, న్యూనత వంటి మౌలికమైన అంశాలన్నింటినో ఈ పుస్తకం చర్చిస్తుంది. వాటి మధ్య ఉండే అంతఃసంబంధాలను చర్చిస్తుంది. ఒక్కొక్కటే అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదేమో అనిపించే భావనలను ఒక్కచోట చర్చించడం వల్ల ఇంతకీ ఏం తేల్చదల్చు కున్నారీ పెద్దాయన అనిపించొచ్చు. కొన్ని చోట్ల ఏం చెప్పదల్చుకున్నారు అని కూడా అనిపించొచ్చు. మనుషుల గురించే కాకుండా మనిషి గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలెడతామో అప్పుడు మొదలవుతుంది ఒక అంతర్బహహిర్ యుద్ధారావం. అదొక నిప్పుల గుండం. తెలిసే మనిషి లోపలికి ప్రయాణించే ప్రయత్నం కొంతమంది రచయితలు.......................© 2017,www.logili.com All Rights Reserved.