కుటుంబరావు గారి "కొల్లేటి జాడలు" నవల చదువుతున్నంత సేపూ, ముగించిన తరువాతా కూడా కళ్ళనిండా అవే దృశ్యాలు. చదివి మనం ఊహించుకునేవి కావు. రచయిత దర్శకుడు ప్రతీ దృశ్యాన్ని తన ఏంగిల్ లో కెమెరా నిలబెట్టి చిత్రానువాదాన్ని మనకి చూపిస్తున్నారు. ఈ నవలలో కనిపించే పిక్టోరియల్ క్వాలిటీ ప్రధాన ఆకర్షణ. అందుకే దోనేలో కూచుని కొల్లేటిలో తిరుగుతున్న అనుభూతి ని కలగచేస్తుంది. ఈ నవల ముగించిన కొన్ని రోజుల వరకు కొల్లేటి దృశ్యాలు మనసుని కమ్ముకుంటాయి. కమ్ముకోవడం ఎందుకంటే కొల్లేరు ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం ఇప్పుడు.
- తల్లావఝల పతంజలి శాస్త్రి
కుటుంబరావు గారి "కొల్లేటి జాడలు" నవల చదువుతున్నంత సేపూ, ముగించిన తరువాతా కూడా కళ్ళనిండా అవే దృశ్యాలు. చదివి మనం ఊహించుకునేవి కావు. రచయిత దర్శకుడు ప్రతీ దృశ్యాన్ని తన ఏంగిల్ లో కెమెరా నిలబెట్టి చిత్రానువాదాన్ని మనకి చూపిస్తున్నారు. ఈ నవలలో కనిపించే పిక్టోరియల్ క్వాలిటీ ప్రధాన ఆకర్షణ. అందుకే దోనేలో కూచుని కొల్లేటిలో తిరుగుతున్న అనుభూతి ని కలగచేస్తుంది. ఈ నవల ముగించిన కొన్ని రోజుల వరకు కొల్లేటి దృశ్యాలు మనసుని కమ్ముకుంటాయి. కమ్ముకోవడం ఎందుకంటే కొల్లేరు ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం ఇప్పుడు. - తల్లావఝల పతంజలి శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.