సంక్షిప్త శీర్షిక మరియు పరిధి
(THE CONTEMPT OF COURTS ACT 1971]
DT.24.12.1971 కోర్టుల ధిక్కారములను శిక్షించుటలో కొన్ని న్యాయస్థానముల యొక్క అధికారములను నిర్వచించుటకు మరియు పరిమితము చేయుటకు మరియు దానికి సంబంధించిన కార్య విధానమును క్రమబద్ధీకరించుటకు ఒక చట్టము.
ఉద్దేశ్యములు మరియు కారణముల ప్రకటన
(STATEMENT OF OBJECTS AND REASONS)
కోర్టుల ధిక్కారమునకు సంబంధించిన ప్రస్తుతము గల శాసనము, కొంతవరకు అనిశ్చితముగా నిర్వచించబడనిదిగా, మరియు అసంతృప్తికరముగా ఉన్నదని సాధారణముగా భావించబడుచున్నది. ధిక్కారమునకు శిక్షించుటకు గల అధికార పరిధి ఒక పౌరుని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు హక్కు మరియు భావప్రకటన స్వాతంత్ర్యము | అను రెండు ముఖ్యమయిన ప్రాధమిక హక్కులను ప్రస్తావించును. అందువలన ఈ విషయము మీద గల సంపూర్ణ శాసనమును ఒక ప్రత్యేకమయిన కమిటీ పరిశీలించుట, ఆవశ్యకముని భావించబడుచున్నది. దీనిని అనుసరించి 1961 లో అప్పటి అధనపు | సొలిసిటర్ జనరల్ హెచ్.ఎన్.సన్యాల్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడెను. ఆ కమిటీ, కోర్టు ధిక్కారమునకు సంబంధించి మన దేశములో మరియు వివిధ దేశములలో ఉన్న పరిస్థితులు మరియు సమస్యలపై సమగ్రమయిన పరీక్షను నిర్వహించినది. ఆ కమిటీ తను చేసిన సిఫారసులలో, రాజ్యాంగములో భావ ప్రకటన స్వేచ్ఛకు ఇవ్వబవిన ప్రాముఖ్యతను గుర్తించినది మరియు న్యాయస్థానముల యొక్క గౌరవము మరియు హెూదాను రక్షించవలసిన అవసరమును మరియు న్యాయ పరిపాలన యొక్క ప్రయోజనములను రక్షించుటకు గల అవసరమును పరిగణలోనికి తీసుకొనెను.
ఈ కమిటీ యొక్క సిఫారసులు, కేంద్ర ప్రభుత్వము చేత, ఆ సిఫారసుల మీద. రాష్ట్ర ప్రభుత్వములు, కేంద్రపాలిత ప్రాంతములు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, మరియు న్యాయ నిర్ణయ కమీషనరుల అభిప్రాయములను విచారించిన పిదప సాధరణముగా ఆమోదించబడినవి. ఈ బిల్లు, సన్యాల్ కమిటి యొక్క ఆమోదించబడిన సిఫారసులను అమలు చేయుటకు ఉద్దేశించుచున్నది.............
సంక్షిప్త శీర్షిక మరియు పరిధి (THE CONTEMPT OF COURTS ACT 1971] DT.24.12.1971 కోర్టుల ధిక్కారములను శిక్షించుటలో కొన్ని న్యాయస్థానముల యొక్క అధికారములను నిర్వచించుటకు మరియు పరిమితము చేయుటకు మరియు దానికి సంబంధించిన కార్య విధానమును క్రమబద్ధీకరించుటకు ఒక చట్టము. ఉద్దేశ్యములు మరియు కారణముల ప్రకటన (STATEMENT OF OBJECTS AND REASONS) కోర్టుల ధిక్కారమునకు సంబంధించిన ప్రస్తుతము గల శాసనము, కొంతవరకు అనిశ్చితముగా నిర్వచించబడనిదిగా, మరియు అసంతృప్తికరముగా ఉన్నదని సాధారణముగా భావించబడుచున్నది. ధిక్కారమునకు శిక్షించుటకు గల అధికార పరిధి ఒక పౌరుని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు హక్కు మరియు భావప్రకటన స్వాతంత్ర్యము | అను రెండు ముఖ్యమయిన ప్రాధమిక హక్కులను ప్రస్తావించును. అందువలన ఈ విషయము మీద గల సంపూర్ణ శాసనమును ఒక ప్రత్యేకమయిన కమిటీ పరిశీలించుట, ఆవశ్యకముని భావించబడుచున్నది. దీనిని అనుసరించి 1961 లో అప్పటి అధనపు | సొలిసిటర్ జనరల్ హెచ్.ఎన్.సన్యాల్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడెను. ఆ కమిటీ, కోర్టు ధిక్కారమునకు సంబంధించి మన దేశములో మరియు వివిధ దేశములలో ఉన్న పరిస్థితులు మరియు సమస్యలపై సమగ్రమయిన పరీక్షను నిర్వహించినది. ఆ కమిటీ తను చేసిన సిఫారసులలో, రాజ్యాంగములో భావ ప్రకటన స్వేచ్ఛకు ఇవ్వబవిన ప్రాముఖ్యతను గుర్తించినది మరియు న్యాయస్థానముల యొక్క గౌరవము మరియు హెూదాను రక్షించవలసిన అవసరమును మరియు న్యాయ పరిపాలన యొక్క ప్రయోజనములను రక్షించుటకు గల అవసరమును పరిగణలోనికి తీసుకొనెను. ఈ కమిటీ యొక్క సిఫారసులు, కేంద్ర ప్రభుత్వము చేత, ఆ సిఫారసుల మీద. రాష్ట్ర ప్రభుత్వములు, కేంద్రపాలిత ప్రాంతములు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, మరియు న్యాయ నిర్ణయ కమీషనరుల అభిప్రాయములను విచారించిన పిదప సాధరణముగా ఆమోదించబడినవి. ఈ బిల్లు, సన్యాల్ కమిటి యొక్క ఆమోదించబడిన సిఫారసులను అమలు చేయుటకు ఉద్దేశించుచున్నది.............© 2017,www.logili.com All Rights Reserved.