ఈ గ్రంథములో "మున్సిపల్ కార్పొరేషనుల చట్టము 1955 " అను శాసనము అనువదించబడినది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో, రాజధాని అయిన హైదరాబాదు నగరము మునిసిపల్ కార్పొరేషను అయినందున, దాని పరిపాలన, కార్యనిర్వహణ సేవల వితరణకు సంబంధించిన వ్యవహారములకు "గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1955 " అను శాసనము చేయబడెను. తదుపరి కాలములో "విశాఖపట్నము మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1979 " "విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1981 " మరియు "ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషనుల చట్టము 1994 " అను శాసనములు చేయబడెను. ఈ శాసనములో కూడా "గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషనుల చట్టము 1955 " యొక్క నిబంధనలను, వర్తింపచేయుటకు ఏర్పాట్లు చేయబడెను.