ఆంధ్రప్రదేశ్ జూద (క్రీడల) చట్టము 1974 (THE ANDHRA PRADESH GAMING ACT1974) (ACT NO: 27 OF 1974) జూద క్రీడలను శిక్షించుటకు సంబంధించిన శాసనమును క్రోడీకరించుటకు మరియు సవరించుటకుమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని సర్వజన జూద క్రీడల గుహములను సక్రమముగా ఉంచుటకు ఒకచట్టము. 1.సంక్షిప్తశీర్షిక, పరిధి మరియు ప్రారంభము :(SHORT TITLE, EXTENT AND COMMENCEMENT) :
(1) ఈ చట్టము “ఆంధ్రప్రదేశ్ జూద క్రీడల చట్టము 1974” అని పిలువబడ వచ్చును.
(2) ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంతటికి వర్తించును.
(3) ఇది ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో నోటిఫికేషను చేత నిర్ణయించు అటువంటి తేది నుండి అమలులోనికి వచ్చును. (ఈ చట్టము 1-11-1974 నుండి అమలులోనికి వచ్చినట్లు 28-10-1974న ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో (NO.344) ప్రచురించబడినది) 2. నిర్వచనములు - (DEFINITIONS) :
ఈ చట్టములో సందర్భము వేరువిధముగా కోరినపుడు తప్ప :(1) “సాధారణ క్రీడా గృహము”(COMMON GAMING HOUSE) అనగా:(1) జూద క్రీడ విషయములో :
(A) క్లాజు (2) లో ఏర్పాటు చేయబడిన పద్ధతిలో మినహాయించబడి, ఒక గుఱ్ఱపు రేసు మీద; లేదా
(B) ప్రత్తి, బంగారము లేదా ఇతర పదార్ధము (COMMODITY) యొక్క మార్కెటు ధర మీద లేదా అటువంటి ధరను ప్రకటించుటకు వినియోగించబడిన సంఖ్య యొక్క అంకెల మీద; లేదా
(C) పై ఐటం (B) లో నిర్దిష్టపరచబడిన ఏదేని సరుకు యొక్క మార్కెటు ధరలో బేధము యొక్క ఆధారము మీద; లేదా అటువంటి బేధమును ప్రకటించు మొత్తము కొరకు వినియోగించబడిన సంఖ్య యొక్క అంకెల మీద; లేదా
(D) అటువంటి ధరను ప్రకటించుట కొరకు ఉపయోగించబడిన సంఖ్య యొక్క అంకెల మీద లేదా స్టాకు లేదా షేరు యొక్క మార్కెటు ధర మీద; లేదా
|
ఆంధ్రప్రదేశ్ జూద (క్రీడల) చట్టము 1974 (THE ANDHRA PRADESH GAMING ACT1974) (ACT NO: 27 OF 1974) జూద క్రీడలను శిక్షించుటకు సంబంధించిన శాసనమును క్రోడీకరించుటకు మరియు సవరించుటకుమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని సర్వజన జూద క్రీడల గుహములను సక్రమముగా ఉంచుటకు ఒకచట్టము. 1.సంక్షిప్తశీర్షిక, పరిధి మరియు ప్రారంభము :(SHORT TITLE, EXTENT AND COMMENCEMENT) : (1) ఈ చట్టము “ఆంధ్రప్రదేశ్ జూద క్రీడల చట్టము 1974” అని పిలువబడ వచ్చును. (2) ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంతటికి వర్తించును. (3) ఇది ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో నోటిఫికేషను చేత నిర్ణయించు అటువంటి తేది నుండి అమలులోనికి వచ్చును. (ఈ చట్టము 1-11-1974 నుండి అమలులోనికి వచ్చినట్లు 28-10-1974న ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో (NO.344) ప్రచురించబడినది) 2. నిర్వచనములు - (DEFINITIONS) : ఈ చట్టములో సందర్భము వేరువిధముగా కోరినపుడు తప్ప :(1) “సాధారణ క్రీడా గృహము”(COMMON GAMING HOUSE) అనగా:(1) జూద క్రీడ విషయములో : (A) క్లాజు (2) లో ఏర్పాటు చేయబడిన పద్ధతిలో మినహాయించబడి, ఒక గుఱ్ఱపు రేసు మీద; లేదా (B) ప్రత్తి, బంగారము లేదా ఇతర పదార్ధము (COMMODITY) యొక్క మార్కెటు ధర మీద లేదా అటువంటి ధరను ప్రకటించుటకు వినియోగించబడిన సంఖ్య యొక్క అంకెల మీద; లేదా (C) పై ఐటం (B) లో నిర్దిష్టపరచబడిన ఏదేని సరుకు యొక్క మార్కెటు ధరలో బేధము యొక్క ఆధారము మీద; లేదా అటువంటి బేధమును ప్రకటించు మొత్తము కొరకు వినియోగించబడిన సంఖ్య యొక్క అంకెల మీద; లేదా (D) అటువంటి ధరను ప్రకటించుట కొరకు ఉపయోగించబడిన సంఖ్య యొక్క అంకెల మీద లేదా స్టాకు లేదా షేరు యొక్క మార్కెటు ధర మీద; లేదా |© 2017,www.logili.com All Rights Reserved.