అనగా.....అనగా....అంటూ కథ చెప్పే దశ నుండి ఈనాటి ఆధునిక కథ వరకు ఎన్నో దశలు దాటి వచ్చిన కథలను ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇవన్ని జీవితాల నుండి, జీవన విధానం నుండి పుట్టినవే. నిజజీవతంలోని సంఘటనలు, పాత్రలతో రచయిత జరిపే సంభాషనే కథ. ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియ అయిన అంతే. ఈ క్రమంలో అనేక ఆలోచనా పూరిత సృజనాత్మక విషయాలు ఆ సంభాషణలో భాగమవుతాయి. మనకు రోజూ కనిపించే మనుషులనే పాత్రలుగా మార్చి వారి అంతరంగాల్లోని ఆలోచనలనూ, ఆలోచనా సరళిని, సామజిక జీవనంలో వారు నిర్వహించే పాత్రను వివిధ కోణాల నుండి దర్శించి, రచయిత పాఠకుల ముందుంచుతారు. దీంతో వాస్తవ జీవితానికి, పాత్రలకు, రచయితకు, పాఠకునికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ఆ కథలు చదివినా పాఠకునికి తన జ్ఞానచక్షువేదో తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో పాఠకునికి అది తన కథే అనిపించవచ్చు కూడా. అందుకే అతను దానిలో లీనమై తాదాత్మ్యం చెంది కథతో మమేకం అవుతాడు. అలా మమేకం చెందే అనేక కథల సమాహారమే ఈ పుస్తకం.
-వాసిరెడ్డి నవీన్.
అనగా.....అనగా....అంటూ కథ చెప్పే దశ నుండి ఈనాటి ఆధునిక కథ వరకు ఎన్నో దశలు దాటి వచ్చిన కథలను ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇవన్ని జీవితాల నుండి, జీవన విధానం నుండి పుట్టినవే. నిజజీవతంలోని సంఘటనలు, పాత్రలతో రచయిత జరిపే సంభాషనే కథ. ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియ అయిన అంతే. ఈ క్రమంలో అనేక ఆలోచనా పూరిత సృజనాత్మక విషయాలు ఆ సంభాషణలో భాగమవుతాయి. మనకు రోజూ కనిపించే మనుషులనే పాత్రలుగా మార్చి వారి అంతరంగాల్లోని ఆలోచనలనూ, ఆలోచనా సరళిని, సామజిక జీవనంలో వారు నిర్వహించే పాత్రను వివిధ కోణాల నుండి దర్శించి, రచయిత పాఠకుల ముందుంచుతారు. దీంతో వాస్తవ జీవితానికి, పాత్రలకు, రచయితకు, పాఠకునికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది. ఆ కథలు చదివినా పాఠకునికి తన జ్ఞానచక్షువేదో తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో పాఠకునికి అది తన కథే అనిపించవచ్చు కూడా. అందుకే అతను దానిలో లీనమై తాదాత్మ్యం చెంది కథతో మమేకం అవుతాడు. అలా మమేకం చెందే అనేక కథల సమాహారమే ఈ పుస్తకం. -వాసిరెడ్డి నవీన్.© 2017,www.logili.com All Rights Reserved.