పెరుగుతూ పోతున్న జనాభాకు తగినంత ఆహారం ఉత్పత్తి కావటం అసంభవమని సూత్రీకరించిన మాల్దస్ వంటి 18వ శతాబ్ద శాస్త్రవేత్తల్ని వెనక్కినెట్టి, వ్యవసాయ రంగ అభివృద్ధి ద్వారా తగినంత ఆహారలబ్ది సాధ్యమని 20వ శతాబ్ది శాస్త్ర - సాంకేతికాలు నిరూపించాయి. అధిక జనాభా గల భారతదేశం వంటివి కూడా చాలావరకు ఆహార కొరత నుండి బయట పడగలిగాయి. 2013 నాటికి దేశం 'ఆహార భద్రతా చట్టం' స్థాయికి చేరటమే దానికి నిదర్శనం. కానీ అభివృద్ధి చేయబడిన ఈ వ్యవసాయరంగమే నేడు సంక్షోభాన్ని ముంచుకు తెచ్చింది. సమాజంలోని సింహభాగాన్ని ఇముడ్చుకున్న ఈ రంగం, నేడొక కీలక మలుపులోకి నెట్టబడింది. ఆహార ఉత్పత్తిదారులను 'మాకొద్దీ నష్టకరమైన వృత్తి' అనే స్థితికి తెచ్చింది.
సమాంతరంగా వాతావరణ మార్పులకు, పర్యావరణ పతనానికి ఈ వ్యవసాయ రంగం కూడా కారణమనే స్థితి వచ్చింది. ముఖ్యంగా భూ, జల వనరులపై అనేక ప్రతికూలతల్ని సృష్టించింది. విత్తనం వంటి పంటసాగు ముఖ్య ఉపకరణాలపై సంచలనాత్మక మార్పుల్ని కలిగిస్తున్నది. మన ఆహార అలవాట్లను, ఆరోగ్య రక్షణను ప్రభావితం చేస్తున్నది. పరోక్షంగా వివిధ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిణామాలకు కారణమౌతుంది.
పెరుగుతూ పోతున్న జనాభాకు తగినంత ఆహారం ఉత్పత్తి కావటం అసంభవమని సూత్రీకరించిన మాల్దస్ వంటి 18వ శతాబ్ద శాస్త్రవేత్తల్ని వెనక్కినెట్టి, వ్యవసాయ రంగ అభివృద్ధి ద్వారా తగినంత ఆహారలబ్ది సాధ్యమని 20వ శతాబ్ది శాస్త్ర - సాంకేతికాలు నిరూపించాయి. అధిక జనాభా గల భారతదేశం వంటివి కూడా చాలావరకు ఆహార కొరత నుండి బయట పడగలిగాయి. 2013 నాటికి దేశం 'ఆహార భద్రతా చట్టం' స్థాయికి చేరటమే దానికి నిదర్శనం. కానీ అభివృద్ధి చేయబడిన ఈ వ్యవసాయరంగమే నేడు సంక్షోభాన్ని ముంచుకు తెచ్చింది. సమాజంలోని సింహభాగాన్ని ఇముడ్చుకున్న ఈ రంగం, నేడొక కీలక మలుపులోకి నెట్టబడింది. ఆహార ఉత్పత్తిదారులను 'మాకొద్దీ నష్టకరమైన వృత్తి' అనే స్థితికి తెచ్చింది. సమాంతరంగా వాతావరణ మార్పులకు, పర్యావరణ పతనానికి ఈ వ్యవసాయ రంగం కూడా కారణమనే స్థితి వచ్చింది. ముఖ్యంగా భూ, జల వనరులపై అనేక ప్రతికూలతల్ని సృష్టించింది. విత్తనం వంటి పంటసాగు ముఖ్య ఉపకరణాలపై సంచలనాత్మక మార్పుల్ని కలిగిస్తున్నది. మన ఆహార అలవాట్లను, ఆరోగ్య రక్షణను ప్రభావితం చేస్తున్నది. పరోక్షంగా వివిధ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిణామాలకు కారణమౌతుంది.© 2017,www.logili.com All Rights Reserved.