ఎందుకూ పనికిరానివంటే ప్రకృతి తల్లికి ఇష్టం ఉండదు. ఒక చెట్టు మనిషి అవసరాలను తీరుస్తుంది. మరొకటి అడవిలో భాగమై ప్రకృతిని కాపాడుతుంది. మరికొన్ని రకరకాల పురుగులకు ఆవాసంగా ఉంటాయి. పుట్టకొక్కులు పెరగటానికి, జంతువులు బతకటానికి ఈ చెట్లే ఆధారం. "గొడ్డలితో ఏదైనా చెట్టు కొట్టబోయేముందు మనం చాలా ఆలోచించాలి."
ప్రకృతిలో ప్రతిదానికీ తనదైన స్థాయి ఒకటి ఉంటుంది. తోకూపుడు పిట్ట నేలమీద మాత్రమే తిరుగుతూ ఉంటుంది, గద్ద ఆకాశంలో చాలా పైన విహరిస్తుంది. ప్రతి ఒక్క దానికీ దాని ప్రత్యేకమైన స్థాయి కేటాయించింది ప్రకృతి, అందుకే ఏ గొడవా లేదు, ఎక్కడా పరిమితికి మించిన సంఖ్య లేదు. ప్రతి జీవికి తమ సొంత పని ఉంటుంది, ప్రతి జీవికి ప్రత్యేకించిన బతుకుతెరువు ఉంది. ప్రకృతి తల్లి ఎవ్వరినీ తక్కువ చెయ్యదు, ఆమె కళ్లల్లో ప్రతి ఒక్కరూ సమానమే. "ప్రకృతి తల్లిలాగా మనం ఉండలేమా?" "ఎందుకని?"
ఒకవైపున ప్రకృతి మన ఇల్లు అని నేర్పుతారు. కానీ ఇంకొకవైపు ఏమవుతోంది? ప్రకృతి తల్లిని మనం అణచివేస్తున్నాం. అయితే ప్రకృతి తల్లి దాన్నంతటినీ భరిస్తోంది. ఆమె మెల్లమెల్లగా చనిపోతూ ఉంది. అయితే ఏ మనిషీ ఆమెకి ప్రభువు కాదు. తనని తాను ప్రభువని చెప్పుకోవటం హానికరం. మనిషి ఆమెకు బిడ్డ మాత్రమే, ఆమె పెద్ద బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. "అమ్మని కాటికి పంపవద్దు".
ఎందుకూ పనికిరానివంటే ప్రకృతి తల్లికి ఇష్టం ఉండదు. ఒక చెట్టు మనిషి అవసరాలను తీరుస్తుంది. మరొకటి అడవిలో భాగమై ప్రకృతిని కాపాడుతుంది. మరికొన్ని రకరకాల పురుగులకు ఆవాసంగా ఉంటాయి. పుట్టకొక్కులు పెరగటానికి, జంతువులు బతకటానికి ఈ చెట్లే ఆధారం. "గొడ్డలితో ఏదైనా చెట్టు కొట్టబోయేముందు మనం చాలా ఆలోచించాలి." ప్రకృతిలో ప్రతిదానికీ తనదైన స్థాయి ఒకటి ఉంటుంది. తోకూపుడు పిట్ట నేలమీద మాత్రమే తిరుగుతూ ఉంటుంది, గద్ద ఆకాశంలో చాలా పైన విహరిస్తుంది. ప్రతి ఒక్క దానికీ దాని ప్రత్యేకమైన స్థాయి కేటాయించింది ప్రకృతి, అందుకే ఏ గొడవా లేదు, ఎక్కడా పరిమితికి మించిన సంఖ్య లేదు. ప్రతి జీవికి తమ సొంత పని ఉంటుంది, ప్రతి జీవికి ప్రత్యేకించిన బతుకుతెరువు ఉంది. ప్రకృతి తల్లి ఎవ్వరినీ తక్కువ చెయ్యదు, ఆమె కళ్లల్లో ప్రతి ఒక్కరూ సమానమే. "ప్రకృతి తల్లిలాగా మనం ఉండలేమా?" "ఎందుకని?" ఒకవైపున ప్రకృతి మన ఇల్లు అని నేర్పుతారు. కానీ ఇంకొకవైపు ఏమవుతోంది? ప్రకృతి తల్లిని మనం అణచివేస్తున్నాం. అయితే ప్రకృతి తల్లి దాన్నంతటినీ భరిస్తోంది. ఆమె మెల్లమెల్లగా చనిపోతూ ఉంది. అయితే ఏ మనిషీ ఆమెకి ప్రభువు కాదు. తనని తాను ప్రభువని చెప్పుకోవటం హానికరం. మనిషి ఆమెకు బిడ్డ మాత్రమే, ఆమె పెద్ద బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. "అమ్మని కాటికి పంపవద్దు".© 2017,www.logili.com All Rights Reserved.