పదేళ్ళ తరువాత ఇట్లా, సిటీకి రావటం నిరంజనకు అనీజీగా
ఉంది. కాలపు పెనువత్తిడికి అతని జ్ఞాపకాలు సాగదీయ బడినట్లయి, ప్రాంతమో, రోడ్లో, దృశ్యమో, మనిషో అన్నీ డైమన్షన్కు అతీతంగా పెరిగి అంతా జిగ్ జాగ్ పజిల్లా ఉంది.
సౌందర్యాన్ని వివరించలేని నగరమిది. అంతా ధ్వంసం అయిపోయిన జాడలే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నగరానికి మళ్ళీ రావటం, వచ్చి, ఎప్పటివో దుఃఖాల్ని వెలికి తీసి, భాషగా అనువదించా లనుకొవటం - ఇన్నేళ్ళ తరువాత సత్యప్రకాశాన్ని ఇట్లా కలుసుకోవటం కూడా ఇష్టంగా లేదు నిరంజనకు.
ఈ సత్యప్రకాశం మొత్తం హైదరాబాద్ నగరాన్నే ధ్వంసం చెయ్యగల అరాచక శక్తి. అయితే అతను తన శక్తియుక్తులు చూపే లోపల, నగరమే అతన్ని ధ్వంసం చేసింది.
సత్య ప్రకాశం చాన్నాళ్ళు కవిత్వం రాశాడు. తరువాత వార్తా పత్రికల్లో దూరి హెడ్డింగులు పెట్టటం, వ్యాసాలను సెన్సార్ చెయ్యటం, వార్తలను ముక్కలు ముక్కలుగా చెయ్యటం - సబ్ ఎడిటర్ అని పిలిచే వాళ్ళు. ఇప్పుడదీ లేదు. మందుల షాపు నడుపుతున్నాడు. ఇంగ్లీషు మందులు కాదు. హెర్బల్ మందులు. కొండ వాళ్ళు, కోయవాళ్ళు వందల యేళ్ళుగా వాడుతున్న మందులు..................
పదేళ్ళ తరువాత ఇట్లా, సిటీకి రావటం నిరంజనకు అనీజీగా ఉంది. కాలపు పెనువత్తిడికి అతని జ్ఞాపకాలు సాగదీయ బడినట్లయి, ప్రాంతమో, రోడ్లో, దృశ్యమో, మనిషో అన్నీ డైమన్షన్కు అతీతంగా పెరిగి అంతా జిగ్ జాగ్ పజిల్లా ఉంది. సౌందర్యాన్ని వివరించలేని నగరమిది. అంతా ధ్వంసం అయిపోయిన జాడలే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నగరానికి మళ్ళీ రావటం, వచ్చి, ఎప్పటివో దుఃఖాల్ని వెలికి తీసి, భాషగా అనువదించా లనుకొవటం - ఇన్నేళ్ళ తరువాత సత్యప్రకాశాన్ని ఇట్లా కలుసుకోవటం కూడా ఇష్టంగా లేదు నిరంజనకు. ఈ సత్యప్రకాశం మొత్తం హైదరాబాద్ నగరాన్నే ధ్వంసం చెయ్యగల అరాచక శక్తి. అయితే అతను తన శక్తియుక్తులు చూపే లోపల, నగరమే అతన్ని ధ్వంసం చేసింది. సత్య ప్రకాశం చాన్నాళ్ళు కవిత్వం రాశాడు. తరువాత వార్తా పత్రికల్లో దూరి హెడ్డింగులు పెట్టటం, వ్యాసాలను సెన్సార్ చెయ్యటం, వార్తలను ముక్కలు ముక్కలుగా చెయ్యటం - సబ్ ఎడిటర్ అని పిలిచే వాళ్ళు. ఇప్పుడదీ లేదు. మందుల షాపు నడుపుతున్నాడు. ఇంగ్లీషు మందులు కాదు. హెర్బల్ మందులు. కొండ వాళ్ళు, కోయవాళ్ళు వందల యేళ్ళుగా వాడుతున్న మందులు..................© 2017,www.logili.com All Rights Reserved.