తెలుగుభాష గురించి ఎంతోమంది కవులు ఎంతగా చెప్పినా తనివి తీరని మాధుర్యం ఈ భాష స్వంతం. ముందుగా ఆ భాషకు జేజేలు పలుకుతూ నా ఈ విన్నపం. పశువైద్యునిగా, ఆచార్యునిగా నిత్యం ఎంతోమందిని కలుస్తూ వారి మనోగతాలను పరికించే అవకాశం దొరికింది. సమాజమో, కుటుంబమో, మనిషి ప్రవర్తనో, విద్యార్థి దృక్పథమో భిన్నంగా ఉన్నప్పుడు నాలో అలజడి మొదలై ఆ బాధలోనో, ఆక్రోశంలోనో, ఆనందంలోనో భావాలు రచనల రూపంలో వ్యక్తమవుతుంటాయి. చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తుల భావాలు భావాలు, పతనమవుతున్న కుటుంబ విలువలు, మాయమవుతున్న మానవీయ సంబంధాలు, మనిషిలో కోరవడుతున్న నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రపంచీకరణ నేపథ్యం మొదలగు అంశాలు ఈ రచనకు ముడిసరుకు.
తెలుగుభాష గురించి ఎంతోమంది కవులు ఎంతగా చెప్పినా తనివి తీరని మాధుర్యం ఈ భాష స్వంతం. ముందుగా ఆ భాషకు జేజేలు పలుకుతూ నా ఈ విన్నపం. పశువైద్యునిగా, ఆచార్యునిగా నిత్యం ఎంతోమందిని కలుస్తూ వారి మనోగతాలను పరికించే అవకాశం దొరికింది. సమాజమో, కుటుంబమో, మనిషి ప్రవర్తనో, విద్యార్థి దృక్పథమో భిన్నంగా ఉన్నప్పుడు నాలో అలజడి మొదలై ఆ బాధలోనో, ఆక్రోశంలోనో, ఆనందంలోనో భావాలు రచనల రూపంలో వ్యక్తమవుతుంటాయి. చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తుల భావాలు భావాలు, పతనమవుతున్న కుటుంబ విలువలు, మాయమవుతున్న మానవీయ సంబంధాలు, మనిషిలో కోరవడుతున్న నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రపంచీకరణ నేపథ్యం మొదలగు అంశాలు ఈ రచనకు ముడిసరుకు.© 2017,www.logili.com All Rights Reserved.