కన్నుల పండుగ
అవుట్ పేషెంట్లని చూస్తూ బిజీగా ఉన్నాడు డాక్టర్ రవీంద్ర. అతడు నగరంలోని ప్రముఖ ఆప్తమాలజిస్ట్. వయస్సు మూడున్నర పదులే అయినా అతడి హస్తవాసి మంచిదన్న ఖ్యాతి గాంచాడు.
అతడి జూనియర్లు రోగుల్ని ప్రాథమికంగా పరీక్షించి, వివరాలు కార్డులో నమోదు చేసి అతడి దగ్గరకు పంపిస్తున్నారు. అతడి పక్కనే వున్న ఐ టెస్టింగ్ మెషీన్ ద్వారా రోగి కళ్ళను చెక్ చేస్తున్నాడు. అవసరమైన మందులు, కళ్ళజోడు ప్రెస్క్రైబ్ చేస్తున్నాడు. కొందరికి కేటరాక్ట్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తున్నాడు.
ఒకమ్మాయి లోపలికి వచ్చింది. సుమారు 20,21 ఏళ్ళుంటాయి. ఎంతో ఆకర్షణీయంగా వుంది. అంతకు మించి చలాకీగా వుంది. ముఖ్యంగా ఆమె విశాలమైన నేత్రాలు చేప పిల్లల్లా ఎగిరెగిరి పడుతున్నాయి.
కొన్ని క్షణాల పాటు తను డాక్టర్నన్న సంగతి మర్చిపోయి ఆసక్తిగా చూశాడు. ఆమె కళ్ళలోనే కాదు నవ్వులోనూ ముఖంలోనూ ఏదో ప్రత్యేకత, మరేదో ధీమా, ఇంకేదో ఆకర్షణ వుందనుకున్నాడు.
"హాయ్ డాక్టర్..." చిర్నవ్వులు వరమిస్తున్నట్టుగా నవ్వింది.
వెన్నెల వానలో స్నానించినట్టు అనుభూతించాడు. ఇహానికొచ్చి కూర్చోమని సైగ చేసి కార్డు చూశాడు. ఆమె కళ్ళల్లో ఎలాంటి లోపమూ లేదు!
తలెత్తి ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు. కళ్ళతో గిలిగింతలు పెడుతున్నట్టుగా నవ్వుతోంది. తడబడ్డాడు.
"ఏమిటి ప్రోబ్లం?” చిన్నగా నుదురు చిట్లించి అడిగాడు రవీంద్ర. "ప్రోబ్లం నాది కాదు. మా ఊరి పేదసాదలది”
నిటారుగా అయ్యాడు. "నేనెవరో తెలిసే వచ్చారా?”
"తెలుసుకుని వచ్చాను. మీరు ప్రముఖ నేత్ర వైద్యులు. కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయడంలో మీది అందె వేసిన చేయి. అందుకనే ఎందరో మంత్రులు, సినీనటులు, వ్యాపారవేత్తలు ప్రత్యేకంగా మీ ఆసుపత్రికి వస్తుంటారు” "ఇది చెప్పడానికేనా కన్సల్టేషన్ ఫీ చెల్లించి మరీ వచ్చింది?”
"మీరు పది నిమిషాలకు 500 చార్జీ చేస్తారు. అంటే నిమిషానికి యాభై...” “అది కన్సల్టేషన్కి మాత్రమే. సర్జరీకైతే నిమిషం రేటు వేలల్లో వుంటుంది”.....................
కన్నుల పండుగ అవుట్ పేషెంట్లని చూస్తూ బిజీగా ఉన్నాడు డాక్టర్ రవీంద్ర. అతడు నగరంలోని ప్రముఖ ఆప్తమాలజిస్ట్. వయస్సు మూడున్నర పదులే అయినా అతడి హస్తవాసి మంచిదన్న ఖ్యాతి గాంచాడు. అతడి జూనియర్లు రోగుల్ని ప్రాథమికంగా పరీక్షించి, వివరాలు కార్డులో నమోదు చేసి అతడి దగ్గరకు పంపిస్తున్నారు. అతడి పక్కనే వున్న ఐ టెస్టింగ్ మెషీన్ ద్వారా రోగి కళ్ళను చెక్ చేస్తున్నాడు. అవసరమైన మందులు, కళ్ళజోడు ప్రెస్క్రైబ్ చేస్తున్నాడు. కొందరికి కేటరాక్ట్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తున్నాడు. ఒకమ్మాయి లోపలికి వచ్చింది. సుమారు 20,21 ఏళ్ళుంటాయి. ఎంతో ఆకర్షణీయంగా వుంది. అంతకు మించి చలాకీగా వుంది. ముఖ్యంగా ఆమె విశాలమైన నేత్రాలు చేప పిల్లల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని క్షణాల పాటు తను డాక్టర్నన్న సంగతి మర్చిపోయి ఆసక్తిగా చూశాడు. ఆమె కళ్ళలోనే కాదు నవ్వులోనూ ముఖంలోనూ ఏదో ప్రత్యేకత, మరేదో ధీమా, ఇంకేదో ఆకర్షణ వుందనుకున్నాడు. "హాయ్ డాక్టర్..." చిర్నవ్వులు వరమిస్తున్నట్టుగా నవ్వింది. వెన్నెల వానలో స్నానించినట్టు అనుభూతించాడు. ఇహానికొచ్చి కూర్చోమని సైగ చేసి కార్డు చూశాడు. ఆమె కళ్ళల్లో ఎలాంటి లోపమూ లేదు! తలెత్తి ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు. కళ్ళతో గిలిగింతలు పెడుతున్నట్టుగా నవ్వుతోంది. తడబడ్డాడు. "ఏమిటి ప్రోబ్లం?” చిన్నగా నుదురు చిట్లించి అడిగాడు రవీంద్ర. "ప్రోబ్లం నాది కాదు. మా ఊరి పేదసాదలది” నిటారుగా అయ్యాడు. "నేనెవరో తెలిసే వచ్చారా?” "తెలుసుకుని వచ్చాను. మీరు ప్రముఖ నేత్ర వైద్యులు. కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయడంలో మీది అందె వేసిన చేయి. అందుకనే ఎందరో మంత్రులు, సినీనటులు, వ్యాపారవేత్తలు ప్రత్యేకంగా మీ ఆసుపత్రికి వస్తుంటారు” "ఇది చెప్పడానికేనా కన్సల్టేషన్ ఫీ చెల్లించి మరీ వచ్చింది?” "మీరు పది నిమిషాలకు 500 చార్జీ చేస్తారు. అంటే నిమిషానికి యాభై...” “అది కన్సల్టేషన్కి మాత్రమే. సర్జరీకైతే నిమిషం రేటు వేలల్లో వుంటుంది”.....................© 2017,www.logili.com All Rights Reserved.