కలకతా నగరానికి ఈశాన్యంగా ఇప్పటికీ వసంతవనం అన్న పేరుతో వ్యవహరి బదుతున్న తోటని గురించి ఆ చుట్టు ప్రక్కల నివసిస్తున్న వాళ్ళు ఒక విచిత్రమైన కడ చెప్పుకుంటారు. ఆ కథ అక్షరాలా యదార్ధమని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు గాని వాళ్లు సంఖ్యలో బహుకొద్ది మంది. ఎప్పుడో నూరేళ్ళకు ముందు జరిగిపోయింది కావడం చేతనూ, కథకు సంబంధించిన వ్యక్తులందరూ కాలగర్భంలో కలిసిపోవడం చేతనూ, ఆ కథ నిజంగా జరిగిందని నిరూపించడానికి యిప్పుడాధారాలు బొత్తిగా లేవు. అందుకు తోడుగా బుర్ర ఖాళీగా లేని మనుషులందరూ కూర్పులతోనూ మార్పులతోనూ అసలు కథకు, నేటి కథకు పోలికలు లేకుండా చేసేందుకు ఏదో తమ శక్తి కొలది ప్రయత్నిస్తూ వచ్చారు. అందుచేత నేడు మనకు లభ్యమైన కథలో నిజమెంత, అబద్దమెంత అన్న మీమాంసకు దిగడ మేమంత ప్రయోజనకరమైన విషయం కాదు.
ఈనాడు వసంతవనంగా కలకత్తా పౌరులచేత పిలువబడుతున్న తోట ఏదైతే వుందో అది పూల తోట కాదు. అక్కడ పూలచెట్లకు బదులు ముండ్ల పొదలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మల్లెతీగలు మొలచి పందిరి పైకి అల్లుకొని ముచ్చటగా పువ్వులు పూచినచోట యిప్పుడు బాకుల్లాంటి ఆకులతో ఈతచెట్లున్నాయి. నందివర్తనం పువ్వులు నవ్వినచోట నల్ల తుమ్మచెట్లు ముండ్లతో ఇకిలిస్తున్నాయి. గులాబీల కమ్మని వాసనలు గాలితో కలిసి అక్కడ నడయాడే వారికి మత్తు కలిగించేవట ఆరోజుల్లో! ఈ
రోజుల్లో చండ్రకంపలు అక్కడ రెపరెప లాడుతుంటాయి.
ముండ్ల పొదల మధ్యన త్రోవ చేసుకొని జాగ్రత్తగా తోటమధ్యకు వెళ్ళినట్లయితే ఒక శిథిలమందిరం చూపరులకు దృగ్గోచరమౌతుంది. నందనవనం మూడు పువ్వులు ఆరు కాయలతో శోభించిన ఆరోజుల్లోనే ఆ మందిరాన్ని సమీపించడానికి ఎవరూ సాహసించలేక పోయేవాళ్ళట! ఇప్పుడాపాడుగోడల్లో గబ్బిలాలు, గుడ్లగూబలు మాత్రం నివసిస్తాయి. లేదంటే అప్పుడప్పుడూ అపరాధ పరిశోధక నవలలు వ్రాసే రచయితలు చోరనాయకుల నివాసాల్ని వర్ణించడానికి ముందొకసారి అక్కడికి పోయి వస్తుంటారు.
ఈనాటి నందనవనం పరిస్థితి యిది!..............
కలకతా నగరానికి ఈశాన్యంగా ఇప్పటికీ వసంతవనం అన్న పేరుతో వ్యవహరి బదుతున్న తోటని గురించి ఆ చుట్టు ప్రక్కల నివసిస్తున్న వాళ్ళు ఒక విచిత్రమైన కడ చెప్పుకుంటారు. ఆ కథ అక్షరాలా యదార్ధమని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు గాని వాళ్లు సంఖ్యలో బహుకొద్ది మంది. ఎప్పుడో నూరేళ్ళకు ముందు జరిగిపోయింది కావడం చేతనూ, కథకు సంబంధించిన వ్యక్తులందరూ కాలగర్భంలో కలిసిపోవడం చేతనూ, ఆ కథ నిజంగా జరిగిందని నిరూపించడానికి యిప్పుడాధారాలు బొత్తిగా లేవు. అందుకు తోడుగా బుర్ర ఖాళీగా లేని మనుషులందరూ కూర్పులతోనూ మార్పులతోనూ అసలు కథకు, నేటి కథకు పోలికలు లేకుండా చేసేందుకు ఏదో తమ శక్తి కొలది ప్రయత్నిస్తూ వచ్చారు. అందుచేత నేడు మనకు లభ్యమైన కథలో నిజమెంత, అబద్దమెంత అన్న మీమాంసకు దిగడ మేమంత ప్రయోజనకరమైన విషయం కాదు. ఈనాడు వసంతవనంగా కలకత్తా పౌరులచేత పిలువబడుతున్న తోట ఏదైతే వుందో అది పూల తోట కాదు. అక్కడ పూలచెట్లకు బదులు ముండ్ల పొదలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మల్లెతీగలు మొలచి పందిరి పైకి అల్లుకొని ముచ్చటగా పువ్వులు పూచినచోట యిప్పుడు బాకుల్లాంటి ఆకులతో ఈతచెట్లున్నాయి. నందివర్తనం పువ్వులు నవ్వినచోట నల్ల తుమ్మచెట్లు ముండ్లతో ఇకిలిస్తున్నాయి. గులాబీల కమ్మని వాసనలు గాలితో కలిసి అక్కడ నడయాడే వారికి మత్తు కలిగించేవట ఆరోజుల్లో! ఈ రోజుల్లో చండ్రకంపలు అక్కడ రెపరెప లాడుతుంటాయి. ముండ్ల పొదల మధ్యన త్రోవ చేసుకొని జాగ్రత్తగా తోటమధ్యకు వెళ్ళినట్లయితే ఒక శిథిలమందిరం చూపరులకు దృగ్గోచరమౌతుంది. నందనవనం మూడు పువ్వులు ఆరు కాయలతో శోభించిన ఆరోజుల్లోనే ఆ మందిరాన్ని సమీపించడానికి ఎవరూ సాహసించలేక పోయేవాళ్ళట! ఇప్పుడాపాడుగోడల్లో గబ్బిలాలు, గుడ్లగూబలు మాత్రం నివసిస్తాయి. లేదంటే అప్పుడప్పుడూ అపరాధ పరిశోధక నవలలు వ్రాసే రచయితలు చోరనాయకుల నివాసాల్ని వర్ణించడానికి ముందొకసారి అక్కడికి పోయి వస్తుంటారు. ఈనాటి నందనవనం పరిస్థితి యిది!..............© 2017,www.logili.com All Rights Reserved.