ముందుమాట
భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని కేటాయింప చేసుకున్న ప్రతిభావంతులైన నటులు, విశ్వ నటచక్రవర్తిగా విఖ్యాతులు స్వర్గీయ యస్వీ రంగారావు గారు మా మేనమామ అని చెప్పుకోవడం మాకు గర్వకారణం కాక మరేమిటి? అటువంటి మహోన్నత నటునికి మేనల్లునిగా పుట్టడం... వారి చేతులమీదుగా పెరగడం నా పూర్వ జన్మ సుకృతం. వెండితెరపై వెలుగులు నింపి తన అసమాన నటనా పటిమతో ప్రేక్షక జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు కాబట్టి వారు మరణించి 44 సంవత్సరాలు అయినా ప్రేక్షకుల మనో ఫలకాలలో ఇప్పటికీ ఎప్పటికీ తెరస్మరణీయులే. అయితే మా మామయ్యలో మరో కోణంను ఇప్పుడు నేను మీ ముందు ఆవిష్కరించబోతున్నాను.
ఇది కేవలం ఆయనతో సన్నిహితులైన కొందరికి మాత్రమే తెలిసిన విషయం. ఆయనలో ఒక కథా రచయిత కూడా ఉన్నాడన్న సంగతి ఇంచుమించు ఎవరికీ తెలియని విషయం. తరచూ మావయ్య షూటింగ్ విరామ సమయాల్లో ఒక్కరే ఇంటి వద్ద లాన్ లో కూర్చుని ఏదో రాసుకుంటూ ఉండడం... అప్పుడప్పుడు ఆకాశం వైపు చూసి తలాడించి మళ్ళీ వ్రాసుకోవడం లీలగా గుర్తు వస్తుంది. ఈ సంవత్సరం మావయ్య శతజయంతి కావడం, వారి అశేష అభిమానులకు పండుగ సంవత్సరం. ఆయనను ! విపరీతంగా అభిమానించే తిరుపతికి చెందిన కిరణ్ గారు ఫోన్ చేసి చెప్తే తెలిసింది. మావయ్య మంచి కథా రచయిత అని. వారు నాటి ప్రముఖ మాసపత్రికలు యువ, విపులలను క్షుణంగా జల్లెడపట్టి మావయ్య రాసిన ప్రచురితమైన ఏడు కథలను సేకరించి నాకు పంపుతూ ఆ కథాసంకలనం ప్రచురించుటకు ముందుకొచ్చి, నన్ను పుస్తక సమీక్ష చేసి ముందుమాట వ్రాయమని కోరారు. నాకు అంతగా సాహిత్య పరిజ్ఞానము లేకపోయినా, పూర్తి పాఠకుడిని కాకపోయినా... కేవలం రంగారావు గారి మేనల్లున్ని అనే ఒక్క అంశమే నా అర్హతగా భావించి ఆ కథల్నీ క్షుణంగా చదివి ఆకళింపు చేసుకుని నా అభిప్రాయాన్ని మీతో పంచుకునే సాహసం చేస్తున్నాను...............
ముందుమాట భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని కేటాయింప చేసుకున్న ప్రతిభావంతులైన నటులు, విశ్వ నటచక్రవర్తిగా విఖ్యాతులు స్వర్గీయ యస్వీ రంగారావు గారు మా మేనమామ అని చెప్పుకోవడం మాకు గర్వకారణం కాక మరేమిటి? అటువంటి మహోన్నత నటునికి మేనల్లునిగా పుట్టడం... వారి చేతులమీదుగా పెరగడం నా పూర్వ జన్మ సుకృతం. వెండితెరపై వెలుగులు నింపి తన అసమాన నటనా పటిమతో ప్రేక్షక జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు కాబట్టి వారు మరణించి 44 సంవత్సరాలు అయినా ప్రేక్షకుల మనో ఫలకాలలో ఇప్పటికీ ఎప్పటికీ తెరస్మరణీయులే. అయితే మా మామయ్యలో మరో కోణంను ఇప్పుడు నేను మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఇది కేవలం ఆయనతో సన్నిహితులైన కొందరికి మాత్రమే తెలిసిన విషయం. ఆయనలో ఒక కథా రచయిత కూడా ఉన్నాడన్న సంగతి ఇంచుమించు ఎవరికీ తెలియని విషయం. తరచూ మావయ్య షూటింగ్ విరామ సమయాల్లో ఒక్కరే ఇంటి వద్ద లాన్ లో కూర్చుని ఏదో రాసుకుంటూ ఉండడం... అప్పుడప్పుడు ఆకాశం వైపు చూసి తలాడించి మళ్ళీ వ్రాసుకోవడం లీలగా గుర్తు వస్తుంది. ఈ సంవత్సరం మావయ్య శతజయంతి కావడం, వారి అశేష అభిమానులకు పండుగ సంవత్సరం. ఆయనను ! విపరీతంగా అభిమానించే తిరుపతికి చెందిన కిరణ్ గారు ఫోన్ చేసి చెప్తే తెలిసింది. మావయ్య మంచి కథా రచయిత అని. వారు నాటి ప్రముఖ మాసపత్రికలు యువ, విపులలను క్షుణంగా జల్లెడపట్టి మావయ్య రాసిన ప్రచురితమైన ఏడు కథలను సేకరించి నాకు పంపుతూ ఆ కథాసంకలనం ప్రచురించుటకు ముందుకొచ్చి, నన్ను పుస్తక సమీక్ష చేసి ముందుమాట వ్రాయమని కోరారు. నాకు అంతగా సాహిత్య పరిజ్ఞానము లేకపోయినా, పూర్తి పాఠకుడిని కాకపోయినా... కేవలం రంగారావు గారి మేనల్లున్ని అనే ఒక్క అంశమే నా అర్హతగా భావించి ఆ కథల్నీ క్షుణంగా చదివి ఆకళింపు చేసుకుని నా అభిప్రాయాన్ని మీతో పంచుకునే సాహసం చేస్తున్నాను...............© 2017,www.logili.com All Rights Reserved.