ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ముందుగా ఒక మాట *
మొట్టమొదట మూడు సంపుటములుగా ముద్రితములైన యీ 'సంభాషణలు' ఇప్పుడు ఒకే సంపుటముగా ప్రచురితమై వెలువడినది. ఈ ప్రచురణ కూడ ముందటి ప్రచురణవలెనే జిజ్ఞాసువులందరి గౌరవాభిమానములకు పాత్రమగు ననుటలో సందేహము లేదు. ఇది కాలక్షేపమునకు చదివి ప్రక్కన పడవేయదగిన పుస్తకము కాదు. అనంతజ్యోతి సందర్శనమునకై అంతకంతకు అధిక సంఖ్యాకులగుచున్న యాత్రికులను తప్పక దరిజేర్చు మార్గదర్శిగా తన్ను తాను నిరూపించుకోగల గ్రంథమిది.
1935 నుండి 1939 వరకు నాలుగు సంవత్సరములలో జరిగిన సంభాషణములను పదిలపరిచినందుకు శ్రీమునగాల యస్. వెంకటరామయ్య (శ్రీరమణానంద సరస్వతి) గారికి మనము మాత్రమే కృతజ్ఞులము కాము. ఆ దినములలో భగవాన్ శ్రీ రమణుని సందర్శించుటకు నోచుకొనని భక్తులు ఈ సంభాషణములను జదివిన వెంటనే వారు సహజముగనే తమ మనస్సులలో నిద్రాణముగనున్న శ్రీరమణ సద్గురువుల వాక్కులను స్ఫురణకు తెచ్చుకొని సంతోషింతురు. అరుణాచల మహర్షి తరుచుగా మౌనముగనే బోధించినను వారు శ్రోతల మనస్సులను కలవరపరచని విధముగ విస్పష్టముగను, ధారాళముగను వాగ్రూపమున గూడ ప్రబోధించిరి. వారు ఉచ్చరించిన ప్రతి పదమును భావితరములవారికి భద్రపరిచియుంచిన బాగుగా నుండి యుండెడిదని అందరును భావింతురు. స్వల్ప సంఖ్యాకములైన యీ సల్లాపములను గ్రంథస్థము చేసినందుకే మనము కృతజ్ఞులముగా నుండదగును. ఈ సల్లాపములు శ్రీభగవానుని రచనలను మరింత విశదపరుచునట్లుండును. అందుచే అనువాదములు లభ్యముగుగానున్న వారి రచనలతో వీనిని సమన్వయించుకొనుచు అధ్యయనము చేయుట యుక్తమేమో !
శ్రీరమణుని బోధనలు జనసామాన్యమును ఉద్దేశించినవి కావు. వాస్తవమునకు ఉపన్యాసములును, ప్రసంగములును ప్రయోజనకరములగునని మహర్షి భావించలేదు. వారి పలుకులు ఆధ్యాత్మిక సాధనలో కష్టముల నెదుర్కొన్న జిజ్ఞాసువు వానిని తొలగించు కొనగోరినప్పుడు వానినే ప్రధానముగ ఉద్దేశించి పలికినవి. అయినను ఆత్మాన్వేషణములో ఎల్లరకును కలుగు కష్టములన్నియు నొకే విధమైనవి యైనందునను, వానిని పరిష్కార మార్గములును ఒకే విధమైనవి యైనందునను మహర్షి జిజ్ఞాసువుల కిచ్చిన సమాధానములు సార్వత్రికతను సంతరించుకొన్నవి.
సరియైన ప్రశ్నల నడుగుటగాని, ఆ ప్రశ్నలను సరిగా రూపొందించుకొనుటగాని అందరికిని సాధ్యము కాదు. అందువల్ల సద్గురువుల సల్లాపములు పరీక్షా పత్రములోని ప్రశ్నల కిచ్చునట్లు సూటిగా నిచ్చు సమాధానములుగానుండవు. వారు తరుచుగా ప్రశ్నలోని ....................
ఓం నమో భగవతే శ్రీ రమణాయ ముందుగా ఒక మాట * మొట్టమొదట మూడు సంపుటములుగా ముద్రితములైన యీ 'సంభాషణలు' ఇప్పుడు ఒకే సంపుటముగా ప్రచురితమై వెలువడినది. ఈ ప్రచురణ కూడ ముందటి ప్రచురణవలెనే జిజ్ఞాసువులందరి గౌరవాభిమానములకు పాత్రమగు ననుటలో సందేహము లేదు. ఇది కాలక్షేపమునకు చదివి ప్రక్కన పడవేయదగిన పుస్తకము కాదు. అనంతజ్యోతి సందర్శనమునకై అంతకంతకు అధిక సంఖ్యాకులగుచున్న యాత్రికులను తప్పక దరిజేర్చు మార్గదర్శిగా తన్ను తాను నిరూపించుకోగల గ్రంథమిది. 1935 నుండి 1939 వరకు నాలుగు సంవత్సరములలో జరిగిన సంభాషణములను పదిలపరిచినందుకు శ్రీమునగాల యస్. వెంకటరామయ్య (శ్రీరమణానంద సరస్వతి) గారికి మనము మాత్రమే కృతజ్ఞులము కాము. ఆ దినములలో భగవాన్ శ్రీ రమణుని సందర్శించుటకు నోచుకొనని భక్తులు ఈ సంభాషణములను జదివిన వెంటనే వారు సహజముగనే తమ మనస్సులలో నిద్రాణముగనున్న శ్రీరమణ సద్గురువుల వాక్కులను స్ఫురణకు తెచ్చుకొని సంతోషింతురు. అరుణాచల మహర్షి తరుచుగా మౌనముగనే బోధించినను వారు శ్రోతల మనస్సులను కలవరపరచని విధముగ విస్పష్టముగను, ధారాళముగను వాగ్రూపమున గూడ ప్రబోధించిరి. వారు ఉచ్చరించిన ప్రతి పదమును భావితరములవారికి భద్రపరిచియుంచిన బాగుగా నుండి యుండెడిదని అందరును భావింతురు. స్వల్ప సంఖ్యాకములైన యీ సల్లాపములను గ్రంథస్థము చేసినందుకే మనము కృతజ్ఞులముగా నుండదగును. ఈ సల్లాపములు శ్రీభగవానుని రచనలను మరింత విశదపరుచునట్లుండును. అందుచే అనువాదములు లభ్యముగుగానున్న వారి రచనలతో వీనిని సమన్వయించుకొనుచు అధ్యయనము చేయుట యుక్తమేమో ! శ్రీరమణుని బోధనలు జనసామాన్యమును ఉద్దేశించినవి కావు. వాస్తవమునకు ఉపన్యాసములును, ప్రసంగములును ప్రయోజనకరములగునని మహర్షి భావించలేదు. వారి పలుకులు ఆధ్యాత్మిక సాధనలో కష్టముల నెదుర్కొన్న జిజ్ఞాసువు వానిని తొలగించు కొనగోరినప్పుడు వానినే ప్రధానముగ ఉద్దేశించి పలికినవి. అయినను ఆత్మాన్వేషణములో ఎల్లరకును కలుగు కష్టములన్నియు నొకే విధమైనవి యైనందునను, వానిని పరిష్కార మార్గములును ఒకే విధమైనవి యైనందునను మహర్షి జిజ్ఞాసువుల కిచ్చిన సమాధానములు సార్వత్రికతను సంతరించుకొన్నవి. సరియైన ప్రశ్నల నడుగుటగాని, ఆ ప్రశ్నలను సరిగా రూపొందించుకొనుటగాని అందరికిని సాధ్యము కాదు. అందువల్ల సద్గురువుల సల్లాపములు పరీక్షా పత్రములోని ప్రశ్నల కిచ్చునట్లు సూటిగా నిచ్చు సమాధానములుగానుండవు. వారు తరుచుగా ప్రశ్నలోని ....................© 2017,www.logili.com All Rights Reserved.