"వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది". "సత్యాన్ని పొందగలమే కానీ సృష్టించుకోలేము". "ప్రకృతిలో శాశ్వత సామ్యతను కోరటం అంటే ప్రకృతిని ఆత్మహత్య చేసుకోమని అడగటమే". గుణాత్మక పరివర్తన అర్థం ఏమిటంటే దానినుంచే కాని అది మాత్రం కాదు". పారమార్ధిక, దివ్య, శాశ్వత విలువలు గతిశూన్యమైన మృత జగత్తులో ఉండవచ్చేమో గాని నిరంతర గతిశీలమైన ఈ ప్రకృతిలో వాటికి స్థానం లేదు. పదార్థానికి, స్థలానికి ఉన్న సంబంధాన్ని రాహుల్జీ "దారంతో ముడివేసిన అతిపెద్ద శూన్య ఆకాశము" అని చెప్పడం మనలను అబ్బుర పరుస్తుంది. దారాన్ని పదార్థాన్ని వదిలి ఆకాశమహత్యం చెప్పటం ఏమిటని ప్రశ్నిస్తారు. ఇలాంటి తాత్విక విషయాలను సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా, మేధావులను సైతం మెప్పించేలా రాశారు. చదవండి! చదివించండి!
"వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది". "సత్యాన్ని పొందగలమే కానీ సృష్టించుకోలేము". "ప్రకృతిలో శాశ్వత సామ్యతను కోరటం అంటే ప్రకృతిని ఆత్మహత్య చేసుకోమని అడగటమే". గుణాత్మక పరివర్తన అర్థం ఏమిటంటే దానినుంచే కాని అది మాత్రం కాదు". పారమార్ధిక, దివ్య, శాశ్వత విలువలు గతిశూన్యమైన మృత జగత్తులో ఉండవచ్చేమో గాని నిరంతర గతిశీలమైన ఈ ప్రకృతిలో వాటికి స్థానం లేదు. పదార్థానికి, స్థలానికి ఉన్న సంబంధాన్ని రాహుల్జీ "దారంతో ముడివేసిన అతిపెద్ద శూన్య ఆకాశము" అని చెప్పడం మనలను అబ్బుర పరుస్తుంది. దారాన్ని పదార్థాన్ని వదిలి ఆకాశమహత్యం చెప్పటం ఏమిటని ప్రశ్నిస్తారు. ఇలాంటి తాత్విక విషయాలను సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా, మేధావులను సైతం మెప్పించేలా రాశారు. చదవండి! చదివించండి!© 2017,www.logili.com All Rights Reserved.