శాస్త్రీయ సత్యపు పునాది. సామాజిక ఆవసరాలను తీర్చే కాల్పనికత కలగలిసిన సృజనాత్మక రూపం - వైజ్ఞానిక కథ. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వంటి వారికే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యం స్ఫూర్తినిచ్చింది, అనేక ఆవిష్కరణలకు దారి చూపింది. అంతర్జాతీయంగా సైన్స్ ఫిక్షన్ అనే భావన నిర్వచింపబడిన మరుసటి సంవత్సరం (1927) లో తెలుగులో తొలి వైజ్ఞానిక కథ వెలువడింది. ప్రసిద్ధ శాస్త్రవేత్త సి. వి. రామన్ వద్ద పరిశోధన చేసి, భారత స్వాంతంత్ర్య పోరాటం మీద ఎంతో ప్రేమ, గౌరవం గల సిరిగూరి జయరావు రాసిన ఈ కథే 'పరమాణులో మేజువాని'. తొలి ఎనిమిది దశాబ్దాలలో సుమారు 50 మంది 25 పత్రిలలో 125 కు మించి తెలుగు వైజ్ఞానిక కథలు రచించారని మా సంపాదకుల అంచనా. ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, కొడవటిగంటి కుటుంబరావు, ఎన్. ఆర్. నంది, బి. శశి, కె. ఆర్. కె. మోహన్, కొమ్మూరి వేణుగోపాలరావు, పురాణపండరంగనాథ్, వాకాటి పాండురంగారావు... మొదలైన 27 మంది రచయితల సంకలనమే ఇది. ఇటువంటి ప్రయత్నం తెలుగుకు సంబంధించి ఇదే ప్రథమం.
- నాగసూరి వేణుగోపాల్, నామిని సుధాకర్ నాయుడు