భదంతాచార్య బుద్ధఘోషుడు
విసుద్ధిమగ్గ రచయిత ఆచార్య బుద్ధఘోషుడు థేరవాద బౌద్ధదార్శనికులలో అగ్రగణ్యుడు. ఆయన తన జీవితాన్నంతా పాలీసాహిత్య అభివృద్ధికే వినియోగించాడు. అతని నిరంతర ప్రయత్నం వలన బుద్ధ భగవానుని బోధనలు, పాలీసాహిత్య సిద్ధాంతాలు నశించకుండా నిలిచి ఉన్నాయి. ఒకవేళ బుద్ధఘోషుడు త్రిపిటకాలన్నింటి మీదా అన్వేషణాపూర్వకమైన తన అట్టకథలను రచించకపోతే పాలిసాహిత్యం సులభగ్రాహ్యమయ్యేది కాదు. ఆయన తన అట్టకథల్లో బుద్ధవచనానికి ప్రామాణికమైన అర్థాన్ని ఇవ్వటం మాత్రమే కాక తన ముందు కాలానివీ, తన కాలంలో ఉన్నవీ అయిన దర్శనాలు, రాజనీతి, ఇతిహాసం, అర్థనీతి, సమాజనీతి మొదలైన విషయాల గురించి కూడా సందర్భాన్ని బట్టి, సమీక్షాత్మకంగా వివరించాడు. అందువలన చరిత్రకారులు ఏకకంఠంతో ఆచార్య బుద్ధఘోషుని పాలీసాహిత్య యుగనిర్ణేతగా గౌరవిస్తారు. ఇటువంటి మహాపురుషుల జీవితాన్ని గురించి తెలుసుకోవటం పుణ్యప్రదంగా, సామాన్య ప్రజలకు ఉత్సాహాన్ని పెంచేదిగా ఉంటుంది.
కాని మనదేశానికి చెందిన ఇతర ప్రాచీన మహనీయుల్లాగే బుద్ధఘోషుడు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎక్కువగా చెప్పలేదు. తన అటకథల ఆరంభంలోనూ, ముగింపులోనూ రాసిన దానివలన అతని రచనల గురించి, అతడు ఏ ఉద్దేశ్యంతో రాశాడో, లేదా ఎవరి ప్రేరణతో రాశాడో కొంత తెలియవస్తుంది. అంతేకాని ఆయన జీవితాన్ని గురించి విశేషమైన సమాచారమేమీ అందులో లేదు.
బుద్ధఘోషుని జీవితం గురించి తెలుసుకోవటానికి ఆయన వ్రాసిన అట్టకథలతో పాటు ఈ క్రింది మూలాలనుండి అదనపు సమాచారం లభిస్తుంది - 1. చూళవంస (మహావంసలోని రెండవ | భాగం) లోని 37వ పరిచ్చేదంలోని 215-246 గాథలు, 2. బుద్ధఘోసోప్పత్తి, 3. గంధవంస, 4. సాసనవంస, సద్దమ్మ సంగహ.
చూళవంస ధర్మకీర్తి అనే భిక్షువు యొక్క రచన. అతని కాలం పదమూడవ శతాబ్ది మధ్యభాగం. బుద్ధఘోషుని కాలం క్రీ.శ. నాలుగు - ఐదు శతాబ్దాలుగా భావింపబడుతుంది. బుద్ధఘోషుని తర్వాత ఎనిమిది - తొమ్మిది వందల సంవత్సరాలకు రాయబడిన గ్రంథాన్ని పూర్తిగా ప్రామాణికమని తలంచలేము. అయినప్పటికీ బుద్ధఘోషుని జీవితాన్ని గురించిన అనేక విషయాలు మనకు ఇందులోనే | దొరుకుతాయి. ఇక పందొమ్మిదవ శతాబ్దంలో రాయబడిన గంధవంస, సాసనవంసల ఉపయోగం | అంతంత మాత్రమే.
ధమ్మకీతి మహాసామి 'బుద్ధఘోసోప్పతి' రచనా కాలం పదునాలుగవ శతాబ్దం కనుక అది, చూళవంస కు తర్వాత, గంధవంస, సాసనవంసలకు ముందూ వ్రాయబడింది. ఈ రచనలో ఎన్ని అతిశయోక్తులు ఉండటం వలన, దీనినికూడా పూర్తిగా ప్రామాణికమని తలంచలేము. కనుక, చూళవంసలోని పైన చెప్పబడిన భాగమే ఈ విషయంలో అధిక ప్రామాణికమని తలంపబడింది. దాని ప్రకారం ఆచార్య బుద్ధఘోషుని జీవితం ఇలా ఉంది.........
భదంతాచార్య బుద్ధఘోషుడు విసుద్ధిమగ్గ రచయిత ఆచార్య బుద్ధఘోషుడు థేరవాద బౌద్ధదార్శనికులలో అగ్రగణ్యుడు. ఆయన తన జీవితాన్నంతా పాలీసాహిత్య అభివృద్ధికే వినియోగించాడు. అతని నిరంతర ప్రయత్నం వలన బుద్ధ భగవానుని బోధనలు, పాలీసాహిత్య సిద్ధాంతాలు నశించకుండా నిలిచి ఉన్నాయి. ఒకవేళ బుద్ధఘోషుడు త్రిపిటకాలన్నింటి మీదా అన్వేషణాపూర్వకమైన తన అట్టకథలను రచించకపోతే పాలిసాహిత్యం సులభగ్రాహ్యమయ్యేది కాదు. ఆయన తన అట్టకథల్లో బుద్ధవచనానికి ప్రామాణికమైన అర్థాన్ని ఇవ్వటం మాత్రమే కాక తన ముందు కాలానివీ, తన కాలంలో ఉన్నవీ అయిన దర్శనాలు, రాజనీతి, ఇతిహాసం, అర్థనీతి, సమాజనీతి మొదలైన విషయాల గురించి కూడా సందర్భాన్ని బట్టి, సమీక్షాత్మకంగా వివరించాడు. అందువలన చరిత్రకారులు ఏకకంఠంతో ఆచార్య బుద్ధఘోషుని పాలీసాహిత్య యుగనిర్ణేతగా గౌరవిస్తారు. ఇటువంటి మహాపురుషుల జీవితాన్ని గురించి తెలుసుకోవటం పుణ్యప్రదంగా, సామాన్య ప్రజలకు ఉత్సాహాన్ని పెంచేదిగా ఉంటుంది. కాని మనదేశానికి చెందిన ఇతర ప్రాచీన మహనీయుల్లాగే బుద్ధఘోషుడు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎక్కువగా చెప్పలేదు. తన అటకథల ఆరంభంలోనూ, ముగింపులోనూ రాసిన దానివలన అతని రచనల గురించి, అతడు ఏ ఉద్దేశ్యంతో రాశాడో, లేదా ఎవరి ప్రేరణతో రాశాడో కొంత తెలియవస్తుంది. అంతేకాని ఆయన జీవితాన్ని గురించి విశేషమైన సమాచారమేమీ అందులో లేదు. బుద్ధఘోషుని జీవితం గురించి తెలుసుకోవటానికి ఆయన వ్రాసిన అట్టకథలతో పాటు ఈ క్రింది మూలాలనుండి అదనపు సమాచారం లభిస్తుంది - 1. చూళవంస (మహావంసలోని రెండవ | భాగం) లోని 37వ పరిచ్చేదంలోని 215-246 గాథలు, 2. బుద్ధఘోసోప్పత్తి, 3. గంధవంస, 4. సాసనవంస, సద్దమ్మ సంగహ. చూళవంస ధర్మకీర్తి అనే భిక్షువు యొక్క రచన. అతని కాలం పదమూడవ శతాబ్ది మధ్యభాగం. బుద్ధఘోషుని కాలం క్రీ.శ. నాలుగు - ఐదు శతాబ్దాలుగా భావింపబడుతుంది. బుద్ధఘోషుని తర్వాత ఎనిమిది - తొమ్మిది వందల సంవత్సరాలకు రాయబడిన గ్రంథాన్ని పూర్తిగా ప్రామాణికమని తలంచలేము. అయినప్పటికీ బుద్ధఘోషుని జీవితాన్ని గురించిన అనేక విషయాలు మనకు ఇందులోనే | దొరుకుతాయి. ఇక పందొమ్మిదవ శతాబ్దంలో రాయబడిన గంధవంస, సాసనవంసల ఉపయోగం | అంతంత మాత్రమే. ధమ్మకీతి మహాసామి 'బుద్ధఘోసోప్పతి' రచనా కాలం పదునాలుగవ శతాబ్దం కనుక అది, చూళవంస కు తర్వాత, గంధవంస, సాసనవంసలకు ముందూ వ్రాయబడింది. ఈ రచనలో ఎన్ని అతిశయోక్తులు ఉండటం వలన, దీనినికూడా పూర్తిగా ప్రామాణికమని తలంచలేము. కనుక, చూళవంసలోని పైన చెప్పబడిన భాగమే ఈ విషయంలో అధిక ప్రామాణికమని తలంపబడింది. దాని ప్రకారం ఆచార్య బుద్ధఘోషుని జీవితం ఇలా ఉంది.........© 2017,www.logili.com All Rights Reserved.