సాహితీ ఉత్సవాల సంరంభం 'హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్'!
ఆ రోజు మూడోరోజు, జీ. వి. కె. మాల్ ఎదురుగా పచ్చని చెట్లతో అలరారుతున్న కల్పా స్కూల్ అద్భుతంగా అలంకరించబడి ఉంది. నిత్యం ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద భావంతులూ, భారీ గేట్లతో మానవ సంచారం లేకుండా గంభీరంగా ఉంటుంది. అటువెళ్ళే సామాన్యులెవరికైనా ఇది మనం ఉండాల్సిన ప్రాంతం కాదు అన్న పరాయి భావన కలుగుతుంది.
కానీ ఈ రోజు మాత్రం ఈ ప్రదేశం మనదే అన్నట్లుగా ఆత్మీయ అలంకరణలతో నిండి ఉంది. పండుగ కళతో శోభాయమానంగా ఉంది. ఆ పక్కనే ఉన్న కల్పా స్కూల్ లో పిల్లలు పావురాళ్ళ గుంపుల్లా కువకువ లాడుతున్నారు. వాళ్ళ మధ్య రామచిలుకలు వచ్చిచేరినట్టు ఆకుపచ్చని మొక్కలున్న కుండీలు తెచ్చిపెట్టారు. నెమళ్ళు వాటి మధ్య తిరుగుతూ వయ్యారాలు ఒలకపోస్తున్నాయి.
- అల్లూరి గౌరీ లక్ష్మి
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్...
అక్కడ..