ఓ గంటసేపటి నుంచి ఏమండీగారు చాలా దీర్ఘాలోచనతో, చేతులు వెనక్కి పెట్టుకొని కాసేపు, పక్కన పెట్టుకొని కాసేపు, గడ్డం రాసుకుంటూ కాసేపు అటూ ఇటూ అచార్లూ పచార్లు చేస్తున్నారు. నేను ఏమండీగారి వెనక ఆ కవాతు చేయలేక, కొత్త కావటంతో మొహమాటంతో ఏమి చెప్పలేక అలాగే నీరసంగా తిరుగుతున్నాను. అప్పటికి మా పెళ్ళై పది రోజులైంది. తిరుపతిలో స్వామివారికి వైభవంగా కళ్యాణం చేయించి, బెంగుళూర్ వెళుదామనుకున్నాము. కళ్యాణం ఐతే వైభవంగానే జరిపించాము కాని స్వామివారు, 'ఫాగ్ బాగా పడుతోంది, బెంగుళూర్ కు బస్ లు వెళ్ళటం లేదు, మద్రాస్ వెళ్ళండి' అని ఆదేశించటంతో ఇదో ఇలా మద్రాస్ లో నాలుగురోజులుగా తిరుగుతున్నాము. ఇంతకీ ఈ అచార్లూ పచార్లూ ఎందుకయ్యా అంటే, ఏమండీగారు నన్ను ఏమని పిలవాలి అని అన్నమాట. కమలను నానా విధాలుగా తిప్పారు. కొన్ని ఏమండీకి నచ్చలేదు. కొన్ని మొహమాటంగా ఊ అని బుర్రుపినా నాకు నచ్చలేదని ఏమండీకి తెలిసిపోతోంది. సమస్య పది రోజులైనా..............
ప్రభాతకమలం 1968 డిసెంబర్ 31 స్థలం: మద్రాసు మెరీనా బీచ్ ఓ గంటసేపటి నుంచి ఏమండీగారు చాలా దీర్ఘాలోచనతో, చేతులు వెనక్కి పెట్టుకొని కాసేపు, పక్కన పెట్టుకొని కాసేపు, గడ్డం రాసుకుంటూ కాసేపు అటూ ఇటూ అచార్లూ పచార్లు చేస్తున్నారు. నేను ఏమండీగారి వెనక ఆ కవాతు చేయలేక, కొత్త కావటంతో మొహమాటంతో ఏమి చెప్పలేక అలాగే నీరసంగా తిరుగుతున్నాను. అప్పటికి మా పెళ్ళై పది రోజులైంది. తిరుపతిలో స్వామివారికి వైభవంగా కళ్యాణం చేయించి, బెంగుళూర్ వెళుదామనుకున్నాము. కళ్యాణం ఐతే వైభవంగానే జరిపించాము కాని స్వామివారు, 'ఫాగ్ బాగా పడుతోంది, బెంగుళూర్ కు బస్ లు వెళ్ళటం లేదు, మద్రాస్ వెళ్ళండి' అని ఆదేశించటంతో ఇదో ఇలా మద్రాస్ లో నాలుగురోజులుగా తిరుగుతున్నాము. ఇంతకీ ఈ అచార్లూ పచార్లూ ఎందుకయ్యా అంటే, ఏమండీగారు నన్ను ఏమని పిలవాలి అని అన్నమాట. కమలను నానా విధాలుగా తిప్పారు. కొన్ని ఏమండీకి నచ్చలేదు. కొన్ని మొహమాటంగా ఊ అని బుర్రుపినా నాకు నచ్చలేదని ఏమండీకి తెలిసిపోతోంది. సమస్య పది రోజులైనా..............© 2017,www.logili.com All Rights Reserved.