నా మాట
ఎన్నాళ్ళనుంచో వ్రాయాలని అనుకుంటున్న ఈ పుస్తకాన్ని ఇప్పటికి పూర్తి చేయగలిగాను. ఒక పుస్తకాన్ని వ్రాయడమంటే ఎంతో సమయం, సహనం. శ్రద్ధతో పాటు ఎందరో సహాయ సహకారాలు లభించాలి. ఇందుకోసం నేను నా స్వీయ అనుభవాలతో పాటు ఎందరో మహనీయులు వ్రాసిన పుస్తకాల లోని వివిధ అంశాలతో పాటు పలువురు గొప్ప వక్తలు వివిధ సందర్భాలలో వారు ప్రవచించిన ఉపన్యాసాలలోని స్ఫూర్తిదాయక అంశాలను క్రోడీకరించి ఒక సంకలనంగా రూపొందించాను. ఈ కథలు, సందేశాలను ప్రత్యేకంగా సేకరించి, వాటన్నిటినీ “దివిటీలు" అనే పేరుతో ఒక పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాను. వీటిలో కొన్ని కథలను పాఠకులకు సుల భంగా అర్థమయ్యేందుకు కొంత మార్పు చేయడంతో పాటు మరికొన్నింటిని యథాతథంగా ఉంచడం జరిగింది. వీటికి తోడు ప్రతి కథకూ ఓ నీతి వాక్యాన్ని, మరో అద్భుతమైన సందేశాన్ని పొందుపర్చడం వల్ల చదివే వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ కథలు అన్నీ కూడా చదువరులకు స్ఫూర్తిని అందించి మార్గదర్శనం చే సేవిధంగా ఈ "దివిటీలు"లోని అంశాలు, కథనాలు దిక్సూచిలా ఎంతో ప్రేరణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆశిస్తున్నాను. అయితే నేను ముద్రణ కోసం సిద్ధం చేస్తున్నప్పుడు వీటిలో ప్రతి కథనూ మళ్లీ మళ్లీ చదివాను. ఒక బంగారు గని మీ చేతుల్లో ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాను.
నా మాట ఎన్నాళ్ళనుంచో వ్రాయాలని అనుకుంటున్న ఈ పుస్తకాన్ని ఇప్పటికి పూర్తి చేయగలిగాను. ఒక పుస్తకాన్ని వ్రాయడమంటే ఎంతో సమయం, సహనం. శ్రద్ధతో పాటు ఎందరో సహాయ సహకారాలు లభించాలి. ఇందుకోసం నేను నా స్వీయ అనుభవాలతో పాటు ఎందరో మహనీయులు వ్రాసిన పుస్తకాల లోని వివిధ అంశాలతో పాటు పలువురు గొప్ప వక్తలు వివిధ సందర్భాలలో వారు ప్రవచించిన ఉపన్యాసాలలోని స్ఫూర్తిదాయక అంశాలను క్రోడీకరించి ఒక సంకలనంగా రూపొందించాను. ఈ కథలు, సందేశాలను ప్రత్యేకంగా సేకరించి, వాటన్నిటినీ “దివిటీలు" అనే పేరుతో ఒక పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాను. వీటిలో కొన్ని కథలను పాఠకులకు సుల భంగా అర్థమయ్యేందుకు కొంత మార్పు చేయడంతో పాటు మరికొన్నింటిని యథాతథంగా ఉంచడం జరిగింది. వీటికి తోడు ప్రతి కథకూ ఓ నీతి వాక్యాన్ని, మరో అద్భుతమైన సందేశాన్ని పొందుపర్చడం వల్ల చదివే వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ కథలు అన్నీ కూడా చదువరులకు స్ఫూర్తిని అందించి మార్గదర్శనం చే సేవిధంగా ఈ "దివిటీలు"లోని అంశాలు, కథనాలు దిక్సూచిలా ఎంతో ప్రేరణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆశిస్తున్నాను. అయితే నేను ముద్రణ కోసం సిద్ధం చేస్తున్నప్పుడు వీటిలో ప్రతి కథనూ మళ్లీ మళ్లీ చదివాను. ఒక బంగారు గని మీ చేతుల్లో ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.