రాజపుత్రులెంత ఉన్నతపదవిని పొందినా గాని తండ్రి మాటలను తిరస్కరిస్తే పదవిపోయి సేవకులుగా మారుతారు. తండ్రిమాట తిరస్కరించటంచేతనే యయాతి పుత్రులు, విశ్వామిత్రుని కుమారులు ఆపదలపాలయ్యారు. యయాతి పుత్రులు తండ్రి మాట వినకపోవడం చేత రాజ్యభ్రష్టులయ్యారు. విశ్వామిత్రుని పుత్రులు హీనకులాలలో జన్మించారు. మనోవాక్కాయలలో త్రికరణశుద్ధిగా తండ్రని సేవించేవాడే నిజమైన పుత్రడనబడతాడు. తండ్రికిష్టమైన పనిచే కుమారుడు చెయ్యాలి. తండ్రికి దుఃఖం కలిగించే పనిని పుత్రుడేంత మాత్రం చెయ్యకూడదు.