'మానసిక రోగాలు స్త్రీలల్లోనే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ మనస్సు చాలా సున్నితం,' అనుకునే వాళ్ళు మనలో ఎందరో వున్నారు. "ఆడవాళ్ళు కదా వాళ్ళకు భావోద్వేగం ఎక్కువ. మనకు తుమ్ము, దగ్గు వచ్చినంత సులువుగా వాళ్ళకు ఉన్మాదం వస్తుంది." అనుకునే మగవాళ్ళ సంఖ్య తక్కువకాదు. ఎంతో పాపం చేసుకుంటే కాని ఆడ జన్మరాదు. కష్టాలు అనుభవించడానికే పుట్టాము అని వాపోతూ వుంటారు కొందరు స్త్రీలు. స్త్రీ మనస్సు చంచలం. "నీటిమీది వ్రాతనైనా చదవొచ్చు కాని స్త్రీ ఆలోచనలను చదవలేము" అంటూ రకరకాల అపవాదులతో స్త్రీ మనస్సుపైన తెర వేసింది ఈ సమాజం. స్వంత వ్యక్తిత్వం లేక మగవాడి నీడగా, అతని కోర్కెలకు బలయి పోతోంది స్త్రీ. తన తల్లి స్త్రీ, తన చెల్లి స్త్రీ అని తెలిసినా ఆమెను అర్థం చేసుకోక, ఆమె సమస్యల పట్ల జాలిచూపక తొక్కి పట్టేస్తున్న సమాజంలో మహిళల మానసిక సమస్యలను పరిశీలించి వాటికి పరిహారం చూపడానికి... ఈ ప్రయత్నం.
- డా సి ఆర్ చంద్రశేఖర్
'మానసిక రోగాలు స్త్రీలల్లోనే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ మనస్సు చాలా సున్నితం,' అనుకునే వాళ్ళు మనలో ఎందరో వున్నారు. "ఆడవాళ్ళు కదా వాళ్ళకు భావోద్వేగం ఎక్కువ. మనకు తుమ్ము, దగ్గు వచ్చినంత సులువుగా వాళ్ళకు ఉన్మాదం వస్తుంది." అనుకునే మగవాళ్ళ సంఖ్య తక్కువకాదు. ఎంతో పాపం చేసుకుంటే కాని ఆడ జన్మరాదు. కష్టాలు అనుభవించడానికే పుట్టాము అని వాపోతూ వుంటారు కొందరు స్త్రీలు. స్త్రీ మనస్సు చంచలం. "నీటిమీది వ్రాతనైనా చదవొచ్చు కాని స్త్రీ ఆలోచనలను చదవలేము" అంటూ రకరకాల అపవాదులతో స్త్రీ మనస్సుపైన తెర వేసింది ఈ సమాజం. స్వంత వ్యక్తిత్వం లేక మగవాడి నీడగా, అతని కోర్కెలకు బలయి పోతోంది స్త్రీ. తన తల్లి స్త్రీ, తన చెల్లి స్త్రీ అని తెలిసినా ఆమెను అర్థం చేసుకోక, ఆమె సమస్యల పట్ల జాలిచూపక తొక్కి పట్టేస్తున్న సమాజంలో మహిళల మానసిక సమస్యలను పరిశీలించి వాటికి పరిహారం చూపడానికి... ఈ ప్రయత్నం. - డా సి ఆర్ చంద్రశేఖర్© 2017,www.logili.com All Rights Reserved.