ఆధునిక కాలంలో పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక ప్రభావంతో భారతదేశంలోని మిగతా భాషల మాదిరిగానే మన తెలుగు భాషలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే భాష ప్రవహించే ఒక నదివంటిదన్నారు. పాత నీరు కొట్టుకొని పోయి, కొత్త నీరు వచ్చి చేరినట్లుగా, భాషలో పాత పదాలు మార్పుకు లోని, కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి. ఇది ఒక రకంగా భాషాపదజాలాన్ని సుసంపన్నం చేస్తుంది.
ఆకాశవాణి వారు ఒక సంవత్సరం పాటు 'మన తెలుగు' అనే శీర్షికతో ధారావాహిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో తెలుగు భాష పరిణామ వికాసాల గురించి వివరించే వివిధ అంశాలపై లఘు ప్రసంగాలను ప్రసారం చేశారు. ఈ ప్రసంగాలన్నింటిని 'మన తెలుగు' అనే పేరుతో వెలుగులోకి తీసుకొని రావడం ముదావహం. ఈ వ్యాసాలు ముద్రించుకోవటానికి అంగీకరించిన ఆయా ప్రసంగా కర్తలకు, ఆకాశవాణి సంబంధిత అధికారులకు కృతఙ్ఞతలు. ఇది తెలుగు భాషా వినిమయాన్ని విస్తృత పరచడానికి తగినదిగా, తెలుగు భాషాభిమానులకు అవశ్య పఠనీయమైనదిగా భావిస్తున్నాను.
- మండలి బుద్ధప్రసాద్
ఆధునిక కాలంలో పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక ప్రభావంతో భారతదేశంలోని మిగతా భాషల మాదిరిగానే మన తెలుగు భాషలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే భాష ప్రవహించే ఒక నదివంటిదన్నారు. పాత నీరు కొట్టుకొని పోయి, కొత్త నీరు వచ్చి చేరినట్లుగా, భాషలో పాత పదాలు మార్పుకు లోని, కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి. ఇది ఒక రకంగా భాషాపదజాలాన్ని సుసంపన్నం చేస్తుంది. ఆకాశవాణి వారు ఒక సంవత్సరం పాటు 'మన తెలుగు' అనే శీర్షికతో ధారావాహిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో తెలుగు భాష పరిణామ వికాసాల గురించి వివరించే వివిధ అంశాలపై లఘు ప్రసంగాలను ప్రసారం చేశారు. ఈ ప్రసంగాలన్నింటిని 'మన తెలుగు' అనే పేరుతో వెలుగులోకి తీసుకొని రావడం ముదావహం. ఈ వ్యాసాలు ముద్రించుకోవటానికి అంగీకరించిన ఆయా ప్రసంగా కర్తలకు, ఆకాశవాణి సంబంధిత అధికారులకు కృతఙ్ఞతలు. ఇది తెలుగు భాషా వినిమయాన్ని విస్తృత పరచడానికి తగినదిగా, తెలుగు భాషాభిమానులకు అవశ్య పఠనీయమైనదిగా భావిస్తున్నాను. - మండలి బుద్ధప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.