న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందటంలో విపరీతమైన ఆలస్యం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినదే. ఇది ఒక వ్యవస్థీకృత రుగ్మత. ప్రస్తుత వ్యవస్థలో దీనికి పరిష్కారం అసాధ్యం. అందుకే న్యాయస్థానాలతో ప్రమేయంలేకుండా, వ్యక్తులు, లేక సంస్థలు తమ మధ్యగల వివాదాలను, పరస్పరం విశ్వాసం ఉన్న వ్యక్తి లేక సంస్థ, లేక ఏజన్సీలకు అప్పగించి, పరిష్కరించుకోవటం ఎంతో మంచిది. దీనినే మధ్యవర్తి పరిష్కారం లేక ఆర్బిట్రేషన్ అంటారు. ఇందువలన త్వరగా, ఎటువంటి ఆలస్యం లేకుండా, అతి తక్కువ వ్యవధిలో వివాదం పరిష్కారం అవుతుంది.
ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో వర్తక, వాణిజ్య, భవననిర్మాణం, భారీ ప్రాజెక్టులు, రోడ్లు తదితర రంగాలలో వివిధ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఒప్పందం సర్వసాధారణం అయిపొయింది. ఒప్పందం అన్న తర్వాత వివాదం సహజం. ఇటువంటి వివాదాలు, సాధారణ న్యాయస్థానాల గడపతొక్కితే, తీర్పు వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది. అభివృద్ధి ఆగిపోతుంది. మొత్తం వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి రాకూడదనుకుంటే ప్రత్యామ్నాయం మధ్యవర్తి పరిష్కారమే.
న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందటంలో విపరీతమైన ఆలస్యం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినదే. ఇది ఒక వ్యవస్థీకృత రుగ్మత. ప్రస్తుత వ్యవస్థలో దీనికి పరిష్కారం అసాధ్యం. అందుకే న్యాయస్థానాలతో ప్రమేయంలేకుండా, వ్యక్తులు, లేక సంస్థలు తమ మధ్యగల వివాదాలను, పరస్పరం విశ్వాసం ఉన్న వ్యక్తి లేక సంస్థ, లేక ఏజన్సీలకు అప్పగించి, పరిష్కరించుకోవటం ఎంతో మంచిది. దీనినే మధ్యవర్తి పరిష్కారం లేక ఆర్బిట్రేషన్ అంటారు. ఇందువలన త్వరగా, ఎటువంటి ఆలస్యం లేకుండా, అతి తక్కువ వ్యవధిలో వివాదం పరిష్కారం అవుతుంది. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో వర్తక, వాణిజ్య, భవననిర్మాణం, భారీ ప్రాజెక్టులు, రోడ్లు తదితర రంగాలలో వివిధ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఒప్పందం సర్వసాధారణం అయిపొయింది. ఒప్పందం అన్న తర్వాత వివాదం సహజం. ఇటువంటి వివాదాలు, సాధారణ న్యాయస్థానాల గడపతొక్కితే, తీర్పు వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది. అభివృద్ధి ఆగిపోతుంది. మొత్తం వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి రాకూడదనుకుంటే ప్రత్యామ్నాయం మధ్యవర్తి పరిష్కారమే.© 2017,www.logili.com All Rights Reserved.