ప్రేమకీ హద్దు ఉండాలి. కోపతాపాలకీ హద్దు ఉండాలి. మన నోటికీ హద్దు ఉండాలి. అందుకే మనం ఎప్పుడూ మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. అదుపు తప్పిన నోరు, 'హద్దు' మీరితే ఎలా ఉంటుందో, పర్యవసానం ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే కదా. అదేవిధంగా ప్రతి ఇంటికీ, స్థలానికీ, పొలానికీ 'హద్దులు' ఉండాలి. లేకపోతె అన్నీ వివాదాలు, సమస్యలే.
మొత్తం మీద గమనించాల్సింది ఏమిటంటే ప్రపంచంలో ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుంది. హద్దు అనివార్యం. అందుకే హద్దు ఉండాల్సిందే. ఆ క్రమంలో 'హద్దు' అనేది మనం, మనకోసం, మనమే ఏర్పరచుకున్న చట్టాలకు, శాసనాలకు కూడా ఉండాల్సిందే.
ఇంతకూ హద్దు అంటే ఏమిటి? హద్దు అంటే పరిమితి. లేక లిమిట్ అని అర్ధం చెప్పుకోవచ్చు. అయితే చట్టాలు, శాసనాల విషయంలో ఈ పరిమితి లేక లిమిట్ ను కాలం లేక టైం తో ముడిపెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టమే 'లిమిటేషన్ చట్టము' లేక కాలపరిమితి చట్టము. 'హద్దు'కు తరతమ భేదాలు, కులమతభేదాలు, ఆడ, మగ అన్న తేడాలు ఉండవు. ఆ క్రమంలో ఈ చట్టం సివిల్, క్రిమినల్ అనే తారతమ్యం లేకుండా అన్ని రకాల శాసనాలకూ వర్తిస్తుంది. (ఒప్పందాలు, తనఖాలు, కౌలు ఒప్పందాలు, ఆస్తి బదలాయి౦పులు, నష్టపరిహారం, సొమ్ము వసూలుకు సంబంధించిన దావాలతో సహా, అన్ని రకాల దావాలకు, క్రిమినల్ వ్యవహారాలకు ఈ చట్టం అన్వయిస్తుంది.
అన్ని చట్టాలకు అనివార్య అవసరమైన ఈ చట్టాన్ని సులభమైన తెలుగులో, వ్యవహారిక భాషలో అనువదిస్తూనే, అవసరమైన చోట సందర్భోచితమైన వ్యాఖ్యానాన్ని, సుప్రీమ్ కోర్టు తీర్పులను కూడా పొందుపరచడం జరిగింది. అడ్వకేట్ లకు, సామాన్య ప్రజానికానికీ, ఈ అనువాద గ్రంధం కొంతమేరకైనా ఉపకరిస్తుందని ఆశిస్తూ.....
- పెండ్యాల సత్యనారాయణ
ప్రేమకీ హద్దు ఉండాలి. కోపతాపాలకీ హద్దు ఉండాలి. మన నోటికీ హద్దు ఉండాలి. అందుకే మనం ఎప్పుడూ మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. అదుపు తప్పిన నోరు, 'హద్దు' మీరితే ఎలా ఉంటుందో, పర్యవసానం ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే కదా. అదేవిధంగా ప్రతి ఇంటికీ, స్థలానికీ, పొలానికీ 'హద్దులు' ఉండాలి. లేకపోతె అన్నీ వివాదాలు, సమస్యలే. మొత్తం మీద గమనించాల్సింది ఏమిటంటే ప్రపంచంలో ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుంది. హద్దు అనివార్యం. అందుకే హద్దు ఉండాల్సిందే. ఆ క్రమంలో 'హద్దు' అనేది మనం, మనకోసం, మనమే ఏర్పరచుకున్న చట్టాలకు, శాసనాలకు కూడా ఉండాల్సిందే. ఇంతకూ హద్దు అంటే ఏమిటి? హద్దు అంటే పరిమితి. లేక లిమిట్ అని అర్ధం చెప్పుకోవచ్చు. అయితే చట్టాలు, శాసనాల విషయంలో ఈ పరిమితి లేక లిమిట్ ను కాలం లేక టైం తో ముడిపెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టమే 'లిమిటేషన్ చట్టము' లేక కాలపరిమితి చట్టము. 'హద్దు'కు తరతమ భేదాలు, కులమతభేదాలు, ఆడ, మగ అన్న తేడాలు ఉండవు. ఆ క్రమంలో ఈ చట్టం సివిల్, క్రిమినల్ అనే తారతమ్యం లేకుండా అన్ని రకాల శాసనాలకూ వర్తిస్తుంది. (ఒప్పందాలు, తనఖాలు, కౌలు ఒప్పందాలు, ఆస్తి బదలాయి౦పులు, నష్టపరిహారం, సొమ్ము వసూలుకు సంబంధించిన దావాలతో సహా, అన్ని రకాల దావాలకు, క్రిమినల్ వ్యవహారాలకు ఈ చట్టం అన్వయిస్తుంది. అన్ని చట్టాలకు అనివార్య అవసరమైన ఈ చట్టాన్ని సులభమైన తెలుగులో, వ్యవహారిక భాషలో అనువదిస్తూనే, అవసరమైన చోట సందర్భోచితమైన వ్యాఖ్యానాన్ని, సుప్రీమ్ కోర్టు తీర్పులను కూడా పొందుపరచడం జరిగింది. అడ్వకేట్ లకు, సామాన్య ప్రజానికానికీ, ఈ అనువాద గ్రంధం కొంతమేరకైనా ఉపకరిస్తుందని ఆశిస్తూ..... - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.