ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకం పేరు ఏ విధంగా ఉన్నప్పటికి, వాస్తవంలో నిర్మాణ రంగానికి, ప్రత్యేకించి డవలపర్లు, బిల్డర్లు, తదితరులచే లాభాపెక్షే లక్ష్యంగా, వ్యాపారపరంగా నిర్మించబడే అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, డూప్లెక్సు గృహాలు, విల్లాల నిర్మాణ రంగానికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. సామాన్యుడికి పెద్ద పెద్ద కోరికలు ఉండవు. అతనికి ఉండే అతికొద్ది కోరికలలో అత్యంత ముఖ్యమైనది తనకంటూ ఒక స్వంత గూడు ఉండాలనేది ఒకటి. వర్తమాన ధరలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, స్వంతంగా ఇల్లు కొట్టుకోవటం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షపండే. అందుకే ఈ మధ్యకాలంలో బహుళ అపార్టుమెంట్ల నిర్మాణం ఊపందుకున్నది. దానితోబాటే బిల్డర్లు, డవలపర్ల మోసాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో సామాన్యుడి ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ చట్టం ప్రవేశపెట్టబడింది.
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకం పేరు ఏ విధంగా ఉన్నప్పటికి, వాస్తవంలో నిర్మాణ రంగానికి, ప్రత్యేకించి డవలపర్లు, బిల్డర్లు, తదితరులచే లాభాపెక్షే లక్ష్యంగా, వ్యాపారపరంగా నిర్మించబడే అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, డూప్లెక్సు గృహాలు, విల్లాల నిర్మాణ రంగానికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. సామాన్యుడికి పెద్ద పెద్ద కోరికలు ఉండవు. అతనికి ఉండే అతికొద్ది కోరికలలో అత్యంత ముఖ్యమైనది తనకంటూ ఒక స్వంత గూడు ఉండాలనేది ఒకటి. వర్తమాన ధరలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, స్వంతంగా ఇల్లు కొట్టుకోవటం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షపండే. అందుకే ఈ మధ్యకాలంలో బహుళ అపార్టుమెంట్ల నిర్మాణం ఊపందుకున్నది. దానితోబాటే బిల్డర్లు, డవలపర్ల మోసాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో సామాన్యుడి ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ చట్టం ప్రవేశపెట్టబడింది.© 2017,www.logili.com All Rights Reserved.