Mitturodi Samagra Sahityam

By Dreams Foundation (Author)
Rs.1,000
Rs.1,000

Mitturodi Samagra Sahityam
INR
MANIMN2516
In Stock
1000.0
Rs.1,000


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు. ఆయన కుడి చేతి మణికట్టు మీద ఒక వాత వుండేది. మా పిలకాయ శానా మంది మణికట్లకు అటువంటి వాతలు వుండాయి.

          పిలకాయలు- అని అన్నాక, వాళ్ళు మట్టిలో ఆటలాడుకోకుండా వుండలేరు గదా. మట్టి తినని పసి పిలగాడు- పసి పిలగాడే గాదు గదా. పసితనంలో మట్టి తింటే పసికిర్లు వస్తాయని, అవిట్ని రాకుండా చేసేటందుకు మాకు ఆ వాతల్ని పెట్టిస్తారు మా పెద్దాళ్ళు. మా సిత్తూరు జిల్లా సెంద్రగిరి తాలూకాలో కౌటాల అనే గ్రామం వుండాది. ఇటువంటి వాతలు పెట్టడంలో ఆ వూరు స్కసి పొందింది. సూడబోతే, మా అయ్యోరికి కూడా కొటాల వాత తప్పలా.

            మా ఇస్కూలు పిలకాయలం సాటుమాటుగా అనుకుంటాం: “ఒరే, అయ్యోరు కూడా సిన్నప్పుడు మట్టి తిన్నాడ్రో” అని

             సేతికి గెడారం లేని మా అయ్యోరు - ఒరే గెంట పదకొండున్నర అయిందేమో వూళ్లోకి పోయి చూసేసి రండ్రా - అనేవోడు. ఆ మాట అయ్యోరి నోట ఎప్పుడొస్తాదా - అని మేమంతా కాపెట్టుకుని వుండేటోళ్లం. మా వూర్లో ఒకరిద్దరి సేతికి తెల్లటి కప్పల మాదిర గెడారాలు వుండాయి. కానీ వోళ్లు ఆ సమయానికి ఇంట్లో వుండరు గదా. మా వూళ్లో పెర్మినెట్టు గెడారం ఒకటుండాది. అది మా వూరి వి.ఎల్.డెబుల్యూ ఇల్లు. (ఆయన మా మేనత్త కొడుకే.)

             అయ్యోరు - టైం జూసేసి రండ్రా - అని అన్నాక ఒకటో తరగతోళ్ల నుంచి అయిదో తరగతి వాళ్ల దాకా పది మంది అయినా పైకి లేస్తారు ఆత్రం ఆత్రంగా. ఆ పది మందిలో ఎనిమిది మంది అయ్యోరి సేత దెబ్బలు తింటారు. ఇద్దరు మాత్రం వి.ఎల్.డబ్ల్యూ గోడ గెడారం కాడికి పోతారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు  

         మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు. ఆయన కుడి చేతి మణికట్టు మీద ఒక వాత వుండేది. మా పిలకాయ శానా మంది మణికట్లకు అటువంటి వాతలు వుండాయి.           పిలకాయలు- అని అన్నాక, వాళ్ళు మట్టిలో ఆటలాడుకోకుండా వుండలేరు గదా. మట్టి తినని పసి పిలగాడు- పసి పిలగాడే గాదు గదా. పసితనంలో మట్టి తింటే పసికిర్లు వస్తాయని, అవిట్ని రాకుండా చేసేటందుకు మాకు ఆ వాతల్ని పెట్టిస్తారు మా పెద్దాళ్ళు. మా సిత్తూరు జిల్లా సెంద్రగిరి తాలూకాలో కౌటాల అనే గ్రామం వుండాది. ఇటువంటి వాతలు పెట్టడంలో ఆ వూరు స్కసి పొందింది. సూడబోతే, మా అయ్యోరికి కూడా కొటాల వాత తప్పలా.             మా ఇస్కూలు పిలకాయలం సాటుమాటుగా అనుకుంటాం: “ఒరే, అయ్యోరు కూడా సిన్నప్పుడు మట్టి తిన్నాడ్రో” అని              సేతికి గెడారం లేని మా అయ్యోరు - ఒరే గెంట పదకొండున్నర అయిందేమో వూళ్లోకి పోయి చూసేసి రండ్రా - అనేవోడు. ఆ మాట అయ్యోరి నోట ఎప్పుడొస్తాదా - అని మేమంతా కాపెట్టుకుని వుండేటోళ్లం. మా వూర్లో ఒకరిద్దరి సేతికి తెల్లటి కప్పల మాదిర గెడారాలు వుండాయి. కానీ వోళ్లు ఆ సమయానికి ఇంట్లో వుండరు గదా. మా వూళ్లో పెర్మినెట్టు గెడారం ఒకటుండాది. అది మా వూరి వి.ఎల్.డెబుల్యూ ఇల్లు. (ఆయన మా మేనత్త కొడుకే.)              అయ్యోరు - టైం జూసేసి రండ్రా - అని అన్నాక ఒకటో తరగతోళ్ల నుంచి అయిదో తరగతి వాళ్ల దాకా పది మంది అయినా పైకి లేస్తారు ఆత్రం ఆత్రంగా. ఆ పది మందిలో ఎనిమిది మంది అయ్యోరి సేత దెబ్బలు తింటారు. ఇద్దరు మాత్రం వి.ఎల్.డబ్ల్యూ గోడ గెడారం కాడికి పోతారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు  

Features

  • : Mitturodi Samagra Sahityam
  • : Dreams Foundation
  • : Dreams Foundation
  • : MANIMN2516
  • : Paperback
  • : 2021
  • : 826
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mitturodi Samagra Sahityam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam