దేవదాసు
వైశాఖ మాసంలో ఒకనాటి మధ్యాహ్నం, ఎండ మహాతీవ్రంగా ఉంది. అంతులేనంత తాపంగా కూడా ఉంది. సరీగ్గా ఆ సమయంలో ముఖర్జీలవారి దేవదాసు ఆ ఊరి వీధిబడిలో ఒక మూల చిరుగుల చాప మీద కూర్చుని, పలక చేత పుచ్చుకుని, కళ్ళు తెరుస్తూ మూస్తూ, కాళ్ళు బారచాచుకుని ఆవలిస్తూ చివరకు హఠాత్తుగా ఏదో మహ ఆలోచనలో పడిపోయాడు. ఇంత చక్కని సమయంలో గాలిపటం ఎగరవేసుకొని పొలాలమీద తిరగటానికి బదులు బళ్ళో కట్టిపడేసినట్లు కూచోవటం మంచిదికాదని ఒక్క నిమిషంలో తేల్చుకున్నాడు. అతడి తెలివైన బుర్రలో ఒక ఉపాయం కూడా మొలకెత్తింది. అతడిహ పలక చేత్తో పుచ్చుకుని లేచి నిలబడ్డాడు.
మధ్యాహ్నం భోజనాలకి బడి వదిలిపెట్టారు. పిల్లలంతా గోలచేస్తూ దగ్గిరలో ఉన్న మర్రిచెట్టు కింద చేరి ఆడుకుంటున్నారు. దేవదాసు అటుకేసి చూశాడొకసారి. మధ్యాహ్నం పూట అందరినీ విడిచిపెట్టినా దేవదాసును మాత్రం విడిచిపెట్టరు. ఎందుచేత అంటే ఒకసారి బడి విడిచిపెట్టి బైటికి వెళ్ళాడంటే మళ్ళీ రావటానికి దేవదాసుకు ఏ మాత్రం ఇష్టం ఉందని గోవిందపంతులు అనుభవం మీద తెలుసుకున్నాడు. దేవదాసు తండ్రి ఆంక్ష కూడా ఉంది పంపవద్దని. ఇలాంటి అనేక కారణాలవల్ల అతడు ఈ సమయంలో బడికి 'మానేటర్' అయిన 'భోలా కస్టడీ'లో ఉండాలని నియమం ఏర్పాటయింది.
బళ్ళో ఇప్పుడు పంతులుగారు ఒక్కరూ మధ్యాహ్నపు బడలికవల్ల కళ్ళు మూసుకుని పడుకొన్నారు. భోలా కూడా ఒక మూల చేతులూ కాళ్ళూ ముడుచుకొని ఒక విరిగిపోయిన బెంచీ మీద చిన్న పంతులు ఠీవితో కూర్చుని, మధ్య మధ్య అతి నిర్లక్ష్యంగా ఒక్కొక్కసారి పిల్లల ఆటలు చూస్తున్నాడు. ఒకోసారి పార్వతీ దేవదాసులకేసి ఒక దృష్టి పారేసి ఉంచు- తున్నాడు. పార్వతి పంతులుగారి ఆజ్ఞలోకివచ్చి ఒక నెల్లాళ్ళయింది. ఈ కొద్ది రోజుల్లోనే పంతులుగారు బహుశః ఆ అమ్మాయి మనస్సును రంజింపచేసి ఉంటారు. అందుచేతనే పార్వతి ఏకాగ్రమైన మనస్సుతోనూ, అతిధైర్యంతోనూ నిద్దరోతున్న పంతులుగారి ఆకారాన్ని బాలశిక్ష చివరిపేజీమీద సిరాతో చిత్రిస్తూ, మధ్య మధ్య మహా నేర్పువున్న చిత్రకారిణిలాగా తాను అతి శ్రద్ధగా వేసిన ఈ చిత్రం తను అనుకున్నట్లు. వచ్చిందా లేదా అని కాబోలు - రకరకాలుగా పెట్టిచూస్తోంది. ఆ చిత్రం, సరీగ్గా ఆమె అనుకున్నంత చక్కగా రాలేదు. కాని, పార్వతి అక్కడికే ఎంతో ఆనందాన్నీ, తృప్తిని పొందింది.................
దేవదాసు వైశాఖ మాసంలో ఒకనాటి మధ్యాహ్నం, ఎండ మహాతీవ్రంగా ఉంది. అంతులేనంత తాపంగా కూడా ఉంది. సరీగ్గా ఆ సమయంలో ముఖర్జీలవారి దేవదాసు ఆ ఊరి వీధిబడిలో ఒక మూల చిరుగుల చాప మీద కూర్చుని, పలక చేత పుచ్చుకుని, కళ్ళు తెరుస్తూ మూస్తూ, కాళ్ళు బారచాచుకుని ఆవలిస్తూ చివరకు హఠాత్తుగా ఏదో మహ ఆలోచనలో పడిపోయాడు. ఇంత చక్కని సమయంలో గాలిపటం ఎగరవేసుకొని పొలాలమీద తిరగటానికి బదులు బళ్ళో కట్టిపడేసినట్లు కూచోవటం మంచిదికాదని ఒక్క నిమిషంలో తేల్చుకున్నాడు. అతడి తెలివైన బుర్రలో ఒక ఉపాయం కూడా మొలకెత్తింది. అతడిహ పలక చేత్తో పుచ్చుకుని లేచి నిలబడ్డాడు. మధ్యాహ్నం భోజనాలకి బడి వదిలిపెట్టారు. పిల్లలంతా గోలచేస్తూ దగ్గిరలో ఉన్న మర్రిచెట్టు కింద చేరి ఆడుకుంటున్నారు. దేవదాసు అటుకేసి చూశాడొకసారి. మధ్యాహ్నం పూట అందరినీ విడిచిపెట్టినా దేవదాసును మాత్రం విడిచిపెట్టరు. ఎందుచేత అంటే ఒకసారి బడి విడిచిపెట్టి బైటికి వెళ్ళాడంటే మళ్ళీ రావటానికి దేవదాసుకు ఏ మాత్రం ఇష్టం ఉందని గోవిందపంతులు అనుభవం మీద తెలుసుకున్నాడు. దేవదాసు తండ్రి ఆంక్ష కూడా ఉంది పంపవద్దని. ఇలాంటి అనేక కారణాలవల్ల అతడు ఈ సమయంలో బడికి 'మానేటర్' అయిన 'భోలా కస్టడీ'లో ఉండాలని నియమం ఏర్పాటయింది. బళ్ళో ఇప్పుడు పంతులుగారు ఒక్కరూ మధ్యాహ్నపు బడలికవల్ల కళ్ళు మూసుకుని పడుకొన్నారు. భోలా కూడా ఒక మూల చేతులూ కాళ్ళూ ముడుచుకొని ఒక విరిగిపోయిన బెంచీ మీద చిన్న పంతులు ఠీవితో కూర్చుని, మధ్య మధ్య అతి నిర్లక్ష్యంగా ఒక్కొక్కసారి పిల్లల ఆటలు చూస్తున్నాడు. ఒకోసారి పార్వతీ దేవదాసులకేసి ఒక దృష్టి పారేసి ఉంచు- తున్నాడు. పార్వతి పంతులుగారి ఆజ్ఞలోకివచ్చి ఒక నెల్లాళ్ళయింది. ఈ కొద్ది రోజుల్లోనే పంతులుగారు బహుశః ఆ అమ్మాయి మనస్సును రంజింపచేసి ఉంటారు. అందుచేతనే పార్వతి ఏకాగ్రమైన మనస్సుతోనూ, అతిధైర్యంతోనూ నిద్దరోతున్న పంతులుగారి ఆకారాన్ని బాలశిక్ష చివరిపేజీమీద సిరాతో చిత్రిస్తూ, మధ్య మధ్య మహా నేర్పువున్న చిత్రకారిణిలాగా తాను అతి శ్రద్ధగా వేసిన ఈ చిత్రం తను అనుకున్నట్లు. వచ్చిందా లేదా అని కాబోలు - రకరకాలుగా పెట్టిచూస్తోంది. ఆ చిత్రం, సరీగ్గా ఆమె అనుకున్నంత చక్కగా రాలేదు. కాని, పార్వతి అక్కడికే ఎంతో ఆనందాన్నీ, తృప్తిని పొందింది.................© 2017,www.logili.com All Rights Reserved.