పతివ్రత
హరీశుడు షాబనాలో ప్రఖ్యాతిజెందిన వకీలు. ప్రాక్టీసులోనే కాదు; “మంచితనానికి కూడా దేశంలోవున్న సంస్థలన్నిటితోనూ అతనికి కొద్దో గొప్పో సంబంధం ఉంది. ఇంక సొంతపట్టణంలో అతనులేంది ఏ పనీ జరగదు. అవాళ ఉదయం "దుర్నీతి నాశన సమితి” కార్యవర్గ సమావేశము. హరీశుడు అక్కడ పని చూసుకొని ఇంటికి చేరుకునేసరికి వేళ చాలా మీరింది. ఇప్పుడు రెండు ముద్దలు మింగి కోర్టుకుపోయి పడితేనే కాని అతనికి స్వస్థత చిక్కదు. ఈ తొందరలో సరిగ్గా భోజనం చెయ్యడేమోనని అతని విధవ చెల్లెలు ఉమ, విస్తరి దగ్గర కూర్చుని కావలసినవి అడిగి వడ్డిస్తూ ఉంది.
ఇంతలో వారి భార్య నిర్మల మెల్లగా వచ్చి కొంచెం ఎడంగా కూర్చుని... "నిన్నటి పత్రికలో చూశాను, లావణ్యప్రభను ఈ సర్కిల్కు ఇన్స్పెక్టెస్ వేశారటగా” అన్నది. ఈ మాటలో పైకి ఏమీ కనపడకపోయినా అంతరార్థం చాలా ఉంది.
"నిజమేనా! ఐనా లావణ్యప్రభ అనే పేరుకలవాళ్ళు చాలామంది ఉండవచ్చు వదినా?” అన్నది ఆమె ఆశ్చర్యంతో.
"ఉండవచ్చు, అందుకనే నేను వారిని అడుగుతున్నాను.”
హరీశుడు తలెత్తి “నాకెలా తెలుస్తుంది? గవర్నమెంటు నా సలహా తీసుకుని ఉద్యోగాలు ఇస్తుందా ఏమిటి?” అన్నాడు కటుస్వరంతో.
"అంత కోపమెందుకండి - నేను అలాంటిమాట ఏమన్నాను? ఒకవేళ మీ సిఫార్సువల్ల ఎవరికైనా ఉపకారం జరిగితే సంతోషించాల్సిందేగా" అని ఆమె వచ్చిన విధంగానే వెళ్ళబోయింది.
హరీశుడు విస్తరి దగ్గరనుంచే లేవబోవటం చూచి ఉమ “నన్ను చంపుకు తిన్నట్టు అన్నయ్యా? విస్తరి వదలిపెట్టకు " అని బతిమాలింది.
హరీశుడు చివ్వునలేచి "ఉహుఁ తీరిగ్గా రెండుముద్దలు తినటానికి నోచుకోలేదు. ఆత్మహత్య చేసుకోవటం తప్ప" అంటూ బయటికి వెళ్ళిపోతుంటే, భార్య ఈ అన్నమాటలు అతని చెవిన పడ్డవి. “ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మం మీకేం పట్టింది. ఆరోజు వచ్చినప్పుడు ప్రపంచమే చూస్తుంది ఎవ్వరు చేసుకునేది?”...........
పతివ్రత హరీశుడు షాబనాలో ప్రఖ్యాతిజెందిన వకీలు. ప్రాక్టీసులోనే కాదు; “మంచితనానికి కూడా దేశంలోవున్న సంస్థలన్నిటితోనూ అతనికి కొద్దో గొప్పో సంబంధం ఉంది. ఇంక సొంతపట్టణంలో అతనులేంది ఏ పనీ జరగదు. అవాళ ఉదయం "దుర్నీతి నాశన సమితి” కార్యవర్గ సమావేశము. హరీశుడు అక్కడ పని చూసుకొని ఇంటికి చేరుకునేసరికి వేళ చాలా మీరింది. ఇప్పుడు రెండు ముద్దలు మింగి కోర్టుకుపోయి పడితేనే కాని అతనికి స్వస్థత చిక్కదు. ఈ తొందరలో సరిగ్గా భోజనం చెయ్యడేమోనని అతని విధవ చెల్లెలు ఉమ, విస్తరి దగ్గర కూర్చుని కావలసినవి అడిగి వడ్డిస్తూ ఉంది. ఇంతలో వారి భార్య నిర్మల మెల్లగా వచ్చి కొంచెం ఎడంగా కూర్చుని... "నిన్నటి పత్రికలో చూశాను, లావణ్యప్రభను ఈ సర్కిల్కు ఇన్స్పెక్టెస్ వేశారటగా” అన్నది. ఈ మాటలో పైకి ఏమీ కనపడకపోయినా అంతరార్థం చాలా ఉంది. "నిజమేనా! ఐనా లావణ్యప్రభ అనే పేరుకలవాళ్ళు చాలామంది ఉండవచ్చు వదినా?” అన్నది ఆమె ఆశ్చర్యంతో. "ఉండవచ్చు, అందుకనే నేను వారిని అడుగుతున్నాను.” హరీశుడు తలెత్తి “నాకెలా తెలుస్తుంది? గవర్నమెంటు నా సలహా తీసుకుని ఉద్యోగాలు ఇస్తుందా ఏమిటి?” అన్నాడు కటుస్వరంతో. "అంత కోపమెందుకండి - నేను అలాంటిమాట ఏమన్నాను? ఒకవేళ మీ సిఫార్సువల్ల ఎవరికైనా ఉపకారం జరిగితే సంతోషించాల్సిందేగా" అని ఆమె వచ్చిన విధంగానే వెళ్ళబోయింది. హరీశుడు విస్తరి దగ్గరనుంచే లేవబోవటం చూచి ఉమ “నన్ను చంపుకు తిన్నట్టు అన్నయ్యా? విస్తరి వదలిపెట్టకు " అని బతిమాలింది. హరీశుడు చివ్వునలేచి "ఉహుఁ తీరిగ్గా రెండుముద్దలు తినటానికి నోచుకోలేదు. ఆత్మహత్య చేసుకోవటం తప్ప" అంటూ బయటికి వెళ్ళిపోతుంటే, భార్య ఈ అన్నమాటలు అతని చెవిన పడ్డవి. “ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మం మీకేం పట్టింది. ఆరోజు వచ్చినప్పుడు ప్రపంచమే చూస్తుంది ఎవ్వరు చేసుకునేది?”...........© 2017,www.logili.com All Rights Reserved.