నా జీవితమంతా తిరుగుళ్ళతోనే గడచిపోయింది. ఈ దేశ దిమ్మరి జీవితంలో మూడవ ఝామున నిలబడి దానిలో ఒక అధ్యాయాన్ని వినిపిస్తూ వుంటే, ఇవ్వాళ నాకు ఎన్నో సంగతులు జ్ఞాపకమొస్తున్నాయి.
ఈ దిమ్మరితనంతోనే నేను బాల్యావస్థనుండి వృద్ధాప్యానికి వచ్చాను. తనవాళ్ళు - పరాయివాళ్ళ నోటితోనే గాక - అడ్డమైన వాళ్ళ నోటితోనూ 'ఛీ!' అనిపించుకుంటూ - నా జీవితాన్ని ఒక మహా క్షుద్రపురుగుకన్న మిన్నగా భావించలేకపోయాను. కాని ఎంతోకాలానికి ఈనాడు కొంత జ్ఞప్తి వుండి, మరికొంత మరచిపోయిన కథామాల నల్లటానికి కూర్చుని - జీవిత ప్రభాతంలోనే అంకితమైన ఆ సుదీర్ఘ క్షుద్రత్వాన్ని గురించి ఆలోచిస్తూ వుంటే అది లోకులనుకున్నంత పెద్దది కాదేమోనని సంశయం కూడా కలుగుతూ వుంటుంది. భగవంతుడు తన సృష్టి మధ్యన బలవంతాన నెట్టిన వానిని మంచి పిల్లవాడనిపించి పరీక్ష పాసయ్యే అవకాశం ఇవ్వడు. బండ్ల మీద, పల్లకీల మీద తిప్పించి - 'కథ' పేరు పెట్టి అచ్చొత్తించే అభిరుచి కలిగించడు. అతనికి తెలివితేటలైతే యిస్తాడు; కాని లోకులు వాటిని పనికివచ్చే తెలివితేటలుగా భావించరు. అందుచేతే అతని ప్రవృత్తి అతివిచిత్రంగానూ వింతగానూ వుంటుంది. అతను చూసే వస్తువులు, తెలుసుకోవాలనుకున్న తృష్ణను గురించి వర్ణిస్తే సుగుణవంతులు విరగపడి చస్తారు. తర్వాత - ఆ మొద్దబ్బాయి అనాదరణ, అవహేళనలవల్ల చెడు స్నేహం పట్టి మరింత చెడిపోయి డక్కా మొక్కీలు తింటూ - తనకు తెలియకుండానే ఏదో ఒక రోజున అపకీర్తి జోలె మెడను వేసుకు - ఎటుపోతాడో చాలాకాలంవరకు మరి అతని అంతు వుండదు.
అందుచేత ఈ సంగతులన్నీ అలావుంచి చెప్పదలచుకున్నది చెబుతున్నాను. చెప్పినంత మాత్రాన చెప్పటమనిపించుకోదు. తిరగటం వేరు. దాన్ని గురించి వర్ణించటం వేరు. కాళ్ళున్న ప్రతివాడూ తిరగగలడు. కాని చేతులున్న ప్రతివాడూ రాయలేడు. రాయటం చాలా కష్టం. అదీగాక భగవంతుడు నాలో కల్పనగాని, కవిత్వంగాని ఇసుమంత కూడా పెట్టలేదు. యీ దౌర్భాగ్యపు కళ్ళతో ఏది చూస్తానో అదే కనబడుతుంది. వృక్షాన్ని వృక్షంలాగానే చూస్తాను. పర్వతాలు పర్వతాలులాగానే కనపడతాయి. నీరు నీరుగా తప్ప మరొక విధంగా కనబడదు. ఆకాశంలో మేఘాలకేసి చూస్తే - నా హృదయంలో ఏదో వేదన కలిగినా - అవి మేఘాలుగానే కనిపిస్తాయి. వాటిని చూస్తూ వుంటే నాకు ఎవరి కేశరాశీ జ్ఞప్తికి రాదు. ఆఖరికి ఒక వెంట్రుక...............
నా జీవితమంతా తిరుగుళ్ళతోనే గడచిపోయింది. ఈ దేశ దిమ్మరి జీవితంలో మూడవ ఝామున నిలబడి దానిలో ఒక అధ్యాయాన్ని వినిపిస్తూ వుంటే, ఇవ్వాళ నాకు ఎన్నో సంగతులు జ్ఞాపకమొస్తున్నాయి. ఈ దిమ్మరితనంతోనే నేను బాల్యావస్థనుండి వృద్ధాప్యానికి వచ్చాను. తనవాళ్ళు - పరాయివాళ్ళ నోటితోనే గాక - అడ్డమైన వాళ్ళ నోటితోనూ 'ఛీ!' అనిపించుకుంటూ - నా జీవితాన్ని ఒక మహా క్షుద్రపురుగుకన్న మిన్నగా భావించలేకపోయాను. కాని ఎంతోకాలానికి ఈనాడు కొంత జ్ఞప్తి వుండి, మరికొంత మరచిపోయిన కథామాల నల్లటానికి కూర్చుని - జీవిత ప్రభాతంలోనే అంకితమైన ఆ సుదీర్ఘ క్షుద్రత్వాన్ని గురించి ఆలోచిస్తూ వుంటే అది లోకులనుకున్నంత పెద్దది కాదేమోనని సంశయం కూడా కలుగుతూ వుంటుంది. భగవంతుడు తన సృష్టి మధ్యన బలవంతాన నెట్టిన వానిని మంచి పిల్లవాడనిపించి పరీక్ష పాసయ్యే అవకాశం ఇవ్వడు. బండ్ల మీద, పల్లకీల మీద తిప్పించి - 'కథ' పేరు పెట్టి అచ్చొత్తించే అభిరుచి కలిగించడు. అతనికి తెలివితేటలైతే యిస్తాడు; కాని లోకులు వాటిని పనికివచ్చే తెలివితేటలుగా భావించరు. అందుచేతే అతని ప్రవృత్తి అతివిచిత్రంగానూ వింతగానూ వుంటుంది. అతను చూసే వస్తువులు, తెలుసుకోవాలనుకున్న తృష్ణను గురించి వర్ణిస్తే సుగుణవంతులు విరగపడి చస్తారు. తర్వాత - ఆ మొద్దబ్బాయి అనాదరణ, అవహేళనలవల్ల చెడు స్నేహం పట్టి మరింత చెడిపోయి డక్కా మొక్కీలు తింటూ - తనకు తెలియకుండానే ఏదో ఒక రోజున అపకీర్తి జోలె మెడను వేసుకు - ఎటుపోతాడో చాలాకాలంవరకు మరి అతని అంతు వుండదు. అందుచేత ఈ సంగతులన్నీ అలావుంచి చెప్పదలచుకున్నది చెబుతున్నాను. చెప్పినంత మాత్రాన చెప్పటమనిపించుకోదు. తిరగటం వేరు. దాన్ని గురించి వర్ణించటం వేరు. కాళ్ళున్న ప్రతివాడూ తిరగగలడు. కాని చేతులున్న ప్రతివాడూ రాయలేడు. రాయటం చాలా కష్టం. అదీగాక భగవంతుడు నాలో కల్పనగాని, కవిత్వంగాని ఇసుమంత కూడా పెట్టలేదు. యీ దౌర్భాగ్యపు కళ్ళతో ఏది చూస్తానో అదే కనబడుతుంది. వృక్షాన్ని వృక్షంలాగానే చూస్తాను. పర్వతాలు పర్వతాలులాగానే కనపడతాయి. నీరు నీరుగా తప్ప మరొక విధంగా కనబడదు. ఆకాశంలో మేఘాలకేసి చూస్తే - నా హృదయంలో ఏదో వేదన కలిగినా - అవి మేఘాలుగానే కనిపిస్తాయి. వాటిని చూస్తూ వుంటే నాకు ఎవరి కేశరాశీ జ్ఞప్తికి రాదు. ఆఖరికి ఒక వెంట్రుక...............© 2017,www.logili.com All Rights Reserved.