తడబడుతున్న అడుగుల్లో తడిలేని ఛాయలు ‘కథ 2019' కథల అంతస్సారం
30 సంవత్సరాలు... 186 మంది రచయితలు... 413 కథలు....
అంకెలదేముంది... అంటూ చాలా విషయాల్లో పెదవి విరిచేస్తుంటాం. కానీ, ఈ అంకెల వెనక వందలాది పత్రికల పరిశీలనా పరిశ్రమ ఉంది. 'లక్ష కథల వడపోత ఉంది. సేకరణలో నిరంతర చాకిరీ ఉంది. కథల ఎన్నికలో ఎడతెగని అంతర్మథనం ఉంది. ఏటి కేడాదీ 'ప్రచురణ లోతు' కష్టం ఉంది. ఇన్ని ఇక్కట్లు పడి, పుస్తకం విడుదల చెయ్యగానే ఏయే దిక్కుల నుంచో బండలూ కొండలూ వచ్చి పడతాయి.
ఆ ఇద్దరూ అన్నిటినీ భరించారు. పూలతోపాటు రాళ్లురప్పల్నీ భద్రంగా దాచుకున్నారు.
ఆ సహృదయ సాహితీ సహనానికి ఏకైక కారణం... కథలంటే వారికున్న ప్రేమ. ఆ ప్రేమతోనే ముప్ఫయ్యేళ్లుగా క్రమం తప్పకుండా 'కథ' సంకలనాలు వెలువరిస్తున్నారు. 'కథాసాహితి'కి రెండు నేత్రాల్లాంటి ఆ ఇద్దరూ.. వాసిరెడ్డి నవీన్, డాక్టర్ పాపినేని.......................
తడబడుతున్న అడుగుల్లో తడిలేని ఛాయలు ‘కథ 2019' కథల అంతస్సారం 30 సంవత్సరాలు... 186 మంది రచయితలు... 413 కథలు.... అంకెలదేముంది... అంటూ చాలా విషయాల్లో పెదవి విరిచేస్తుంటాం. కానీ, ఈ అంకెల వెనక వందలాది పత్రికల పరిశీలనా పరిశ్రమ ఉంది. 'లక్ష కథల వడపోత ఉంది. సేకరణలో నిరంతర చాకిరీ ఉంది. కథల ఎన్నికలో ఎడతెగని అంతర్మథనం ఉంది. ఏటి కేడాదీ 'ప్రచురణ లోతు' కష్టం ఉంది. ఇన్ని ఇక్కట్లు పడి, పుస్తకం విడుదల చెయ్యగానే ఏయే దిక్కుల నుంచో బండలూ కొండలూ వచ్చి పడతాయి. ఆ ఇద్దరూ అన్నిటినీ భరించారు. పూలతోపాటు రాళ్లురప్పల్నీ భద్రంగా దాచుకున్నారు. ఆ సహృదయ సాహితీ సహనానికి ఏకైక కారణం... కథలంటే వారికున్న ప్రేమ. ఆ ప్రేమతోనే ముప్ఫయ్యేళ్లుగా క్రమం తప్పకుండా 'కథ' సంకలనాలు వెలువరిస్తున్నారు. 'కథాసాహితి'కి రెండు నేత్రాల్లాంటి ఆ ఇద్దరూ.. వాసిరెడ్డి నవీన్, డాక్టర్ పాపినేని.......................© 2017,www.logili.com All Rights Reserved.