ఒక కవి తన సుదీర్ఘ ప్రయాణంలో ఏం సాధించగలడు?
పదునైన పదాలు, చురుకైన వాక్యాలు, లోతైన అభివ్యక్తులు, భిన్నమైన శీర్షికలు...
అంతేనా?
ఇంకా... సొగసైన నడక, మెలిపెట్టే భావసాంద్రత, గంధకం కూరిన గాఢత, అమాంతం ఆకర్షించే ప్రారంభం, ముట్టించే ముగింపు... ఇంకా ఇలాంటివెన్నో.
మూడున్నర దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న యార్లగడ్డ రాఘవేంద్రరావు వీటన్నిటినీ సొంతం చేసుకున్నారు. జర్నలిస్టుగా సంపాదించుకున్న సరికొత్త చూపుతో సమాజాన్ని మరింత క్షుణ్నంగా పరిశీలించి, తన వస్తుసామగ్రికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకున్నారు. చాలామందికి భిన్నంగా అరుదైన విషయాలను గుండెల మీద మోసుకొచ్చి, కవిత్వంలో కూచోబెట్టారు.
1991లో "బహుముఖం” నుంచి 2021లో "పచ్చికడుపు వాసన" దాకా ప్రతి మజిలీలోనూ నికార్సైన తన కవిత్వాన్నే జెండాలుగా పాతుకుంటూ ప్రయాణించారు......................
పచ్చిగాయాల పలవరింత యార్లగడ్డ రాఘవేంద్రరావు 'పచ్చికడుపు వాసన' ఒక కవి తన సుదీర్ఘ ప్రయాణంలో ఏం సాధించగలడు? పదునైన పదాలు, చురుకైన వాక్యాలు, లోతైన అభివ్యక్తులు, భిన్నమైన శీర్షికలు... అంతేనా? ఇంకా... సొగసైన నడక, మెలిపెట్టే భావసాంద్రత, గంధకం కూరిన గాఢత, అమాంతం ఆకర్షించే ప్రారంభం, ముట్టించే ముగింపు... ఇంకా ఇలాంటివెన్నో. మూడున్నర దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న యార్లగడ్డ రాఘవేంద్రరావు వీటన్నిటినీ సొంతం చేసుకున్నారు. జర్నలిస్టుగా సంపాదించుకున్న సరికొత్త చూపుతో సమాజాన్ని మరింత క్షుణ్నంగా పరిశీలించి, తన వస్తుసామగ్రికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకున్నారు. చాలామందికి భిన్నంగా అరుదైన విషయాలను గుండెల మీద మోసుకొచ్చి, కవిత్వంలో కూచోబెట్టారు. 1991లో "బహుముఖం” నుంచి 2021లో "పచ్చికడుపు వాసన" దాకా ప్రతి మజిలీలోనూ నికార్సైన తన కవిత్వాన్నే జెండాలుగా పాతుకుంటూ ప్రయాణించారు......................© 2017,www.logili.com All Rights Reserved.