ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఈ విశాల విశ్వంలో ఎవరి రంగం వారిది. ఎవరి వీరంగం వారిది. అందరూ సరస్వతీ పుత్రులే. అందరికీ 'వంద'నాలు కాదు 'లక్ష'నాలు. వారిలో కొందరు తెలుగు తల్లి ముద్దుబిడ్డల గురించి నేను విన్నదీ, కన్నదీ వ్యాసాల రూపంలో విన్నవించుకొన్నాను. ఇవి కొన్నేళ్ళ కిందట ఈనాడు పత్రికలో అచ్చయ్యాయి. వీటిని ప్రచురించి నాకు 'పెన్ను' దన్నుగా నిలిచిన 'ఈనాడు' యాజమాన్యానికి కృతజ్ఞతాంజలులు. 'ఈనాడు' అంటే నాకు ఉద్యోగం, హృద్యోగం కల్పించిన మహాసంస్థ. పత్రికా కల్పవృక్షం.
భవిష్యత్తులోనూ అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ పుస్తకాన్ని అచ్చు వేస్తున్నాం. గ్రంథ ప్రచురణ భారాన్ని భుజాన వేసుకున్న శ్రీ దిట్టకవి రాఘవేంద్రరావు గారికి, ఎస్ ఆర్ బుక్ లింక్స్ శ్రీ రమేష్ గారికి నమస్సులు. పాఠకులు ఎప్పటికీ నా పాలకులు.. వారికి సదా విధేయుడనే.
- శంకర నారాయణ
ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఈ విశాల విశ్వంలో ఎవరి రంగం వారిది. ఎవరి వీరంగం వారిది. అందరూ సరస్వతీ పుత్రులే. అందరికీ 'వంద'నాలు కాదు 'లక్ష'నాలు. వారిలో కొందరు తెలుగు తల్లి ముద్దుబిడ్డల గురించి నేను విన్నదీ, కన్నదీ వ్యాసాల రూపంలో విన్నవించుకొన్నాను. ఇవి కొన్నేళ్ళ కిందట ఈనాడు పత్రికలో అచ్చయ్యాయి. వీటిని ప్రచురించి నాకు 'పెన్ను' దన్నుగా నిలిచిన 'ఈనాడు' యాజమాన్యానికి కృతజ్ఞతాంజలులు. 'ఈనాడు' అంటే నాకు ఉద్యోగం, హృద్యోగం కల్పించిన మహాసంస్థ. పత్రికా కల్పవృక్షం. భవిష్యత్తులోనూ అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ పుస్తకాన్ని అచ్చు వేస్తున్నాం. గ్రంథ ప్రచురణ భారాన్ని భుజాన వేసుకున్న శ్రీ దిట్టకవి రాఘవేంద్రరావు గారికి, ఎస్ ఆర్ బుక్ లింక్స్ శ్రీ రమేష్ గారికి నమస్సులు. పాఠకులు ఎప్పటికీ నా పాలకులు.. వారికి సదా విధేయుడనే. - శంకర నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.