శాస్త్రీయ కర్నాటక సంగీతంలో విద్వత్తు. గాన ఫణితిలో పరిణితి గల వ్యక్తిత్వం. రేడియో కళాకారిణిగా లలిత సంగీతానికి, ధ్వని మాధ్యమంలో నాటకాభినయానికి, అపురూపంగా వన్నె తెచ్చిన విదుషి పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం. ప్రశస్తగానం అర్థంతరంగా నిలిచిపొయినట్టు నడి నింగిని అస్తమించిన సంగీత చూడామణి జీవితం, సంగీత యాత్ర, ఎలా నడిచాయి? ఎక్కడ ప్రారంభం? ఎక్కడ ముగింపు? ఆసక్తికరంగా శ్రీరంగం గోపాలరత్నం వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే ఈ చిన్న పుస్తకం.
ఈ పుస్తకానికి అనుబంధంగా శ్రీరంగం గోపాలరత్నం పాడగా అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని లలితగీతాల రచనలను జతపరుస్తున్నాను. ఆమె పాడిన పాటలు పాడుకోవాలనే ఔత్సాహిక కళాకారులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారని నమ్ముతూ, ఆశిస్తూ...
- ఇంద్రగంటి జానకీబాల
శాస్త్రీయ కర్నాటక సంగీతంలో విద్వత్తు. గాన ఫణితిలో పరిణితి గల వ్యక్తిత్వం. రేడియో కళాకారిణిగా లలిత సంగీతానికి, ధ్వని మాధ్యమంలో నాటకాభినయానికి, అపురూపంగా వన్నె తెచ్చిన విదుషి పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం. ప్రశస్తగానం అర్థంతరంగా నిలిచిపొయినట్టు నడి నింగిని అస్తమించిన సంగీత చూడామణి జీవితం, సంగీత యాత్ర, ఎలా నడిచాయి? ఎక్కడ ప్రారంభం? ఎక్కడ ముగింపు? ఆసక్తికరంగా శ్రీరంగం గోపాలరత్నం వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకానికి అనుబంధంగా శ్రీరంగం గోపాలరత్నం పాడగా అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని లలితగీతాల రచనలను జతపరుస్తున్నాను. ఆమె పాడిన పాటలు పాడుకోవాలనే ఔత్సాహిక కళాకారులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారని నమ్ముతూ, ఆశిస్తూ... - ఇంద్రగంటి జానకీబాల© 2017,www.logili.com All Rights Reserved.