డాక్టర్ మంథా భానుమతిగారు లేటు వయసులో రచనలు రాయడం ఆరంభించినా వయసు దృష్ట్యానే కాక, 1993 లో మొదటి కథ ఆంద్రప్రభలో అచ్చయి రచన ఆరంభించి, ఇరవై రెండేళ్ళు అవడమే కాక, 18 నవలలు, 60కి పైగా కథలు రాసిన అనుభవం ఉన్న ఆమెని సీనియర్ రచయిత్రిగానే పరిగణించాం. పెద్ద చదువులు, డాక్టరేటు, కళాశాల ఉద్యోగం, వివాహం, పిల్లలు సంసారబాధ్యతలు అన్నీ తీరాక తీరిగ్గా రచనలు మొదలుపెట్టిన ఈమె, కొత్తరకం కథావస్తువులపై దృష్టి సారించి, విషయసేకరణ పట్ల శ్రద్ధ, విషయపరిజ్ఞానం పట్ల పట్టు ఉంచుకుని, క్షుణ్ణంగా శోధించి రాస్తారని ఆమె 'గ్లేషియర్' నవల, ఇప్పుడీ 'అగ్గిపెట్టెలో ఆరుగజాలు' నవలలు చదివినవారికి అర్థం అవుతుంది.
ఆంద్రభూమిలో సీరియల్ గా వచ్చిన ఈ నవల చాలా కొత్త కథావస్తువుతో ఇప్పటివరకు ఏ రచయిత్రి రాయని కథావస్తువు తీసుకుని రాసినందుకు ముందుగా ఆమెని అభినందించాలి. చేనేత చీరలు కట్టుకోని అతివలుండరు. వాటి అందం చూసి మురిసిపోవడం తెలుసు కాని, ఓ చీర నేయడం వెనక ఎంత శ్రమ, ఎన్నెన్ని వెతలు ఉన్నాయో మనకి తెలియదు. మొత్తం చేనేత పరిశ్రమని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు ఈమె. అందరు తప్పక చదవగలరు.
డాక్టర్ మంథా భానుమతిగారు లేటు వయసులో రచనలు రాయడం ఆరంభించినా వయసు దృష్ట్యానే కాక, 1993 లో మొదటి కథ ఆంద్రప్రభలో అచ్చయి రచన ఆరంభించి, ఇరవై రెండేళ్ళు అవడమే కాక, 18 నవలలు, 60కి పైగా కథలు రాసిన అనుభవం ఉన్న ఆమెని సీనియర్ రచయిత్రిగానే పరిగణించాం. పెద్ద చదువులు, డాక్టరేటు, కళాశాల ఉద్యోగం, వివాహం, పిల్లలు సంసారబాధ్యతలు అన్నీ తీరాక తీరిగ్గా రచనలు మొదలుపెట్టిన ఈమె, కొత్తరకం కథావస్తువులపై దృష్టి సారించి, విషయసేకరణ పట్ల శ్రద్ధ, విషయపరిజ్ఞానం పట్ల పట్టు ఉంచుకుని, క్షుణ్ణంగా శోధించి రాస్తారని ఆమె 'గ్లేషియర్' నవల, ఇప్పుడీ 'అగ్గిపెట్టెలో ఆరుగజాలు' నవలలు చదివినవారికి అర్థం అవుతుంది. ఆంద్రభూమిలో సీరియల్ గా వచ్చిన ఈ నవల చాలా కొత్త కథావస్తువుతో ఇప్పటివరకు ఏ రచయిత్రి రాయని కథావస్తువు తీసుకుని రాసినందుకు ముందుగా ఆమెని అభినందించాలి. చేనేత చీరలు కట్టుకోని అతివలుండరు. వాటి అందం చూసి మురిసిపోవడం తెలుసు కాని, ఓ చీర నేయడం వెనక ఎంత శ్రమ, ఎన్నెన్ని వెతలు ఉన్నాయో మనకి తెలియదు. మొత్తం చేనేత పరిశ్రమని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు ఈమె. అందరు తప్పక చదవగలరు.© 2017,www.logili.com All Rights Reserved.