అరచేతిలో స్వర్గం
ఇంద్రభవనం లాంటి నాలుగంతస్తుల భవనం.
దాని మీద 'వస్త్ర స్వర్గం' అని రాసివున్న బంగారు వర్ణపు అక్షరాలు. నలభై ఏళ్ళ కష్టార్జితం కళ్ల ముందు నిలిచి వున్నట్టు అన్పించింది చక్రధరయ్యకి. ఆనందంగా అపురూపంగా చూశారు.
మెల్లగా ఆయన చూపులు కిందికొచ్చాయి. ద్వారానికి అటూ ఇటూ షోకేసుల్లో వున్న అందాలబొమ్మల మీద పడిందాయన దృష్టి. ఒక దానికి కాటన్ చీర, రెండో దానికి కంచి పట్టు చీర, మూడో దానికి జీన్స్ ఫ్యాంటు టీషర్ట్, నాలుగో దానికి లెహెంగా, బ్లౌజు, దుపట్టా ధరింపజేశారు.
ప్రాణమున్న అందాలరాశుల్లా వుండి కనువిందు చేస్తున్నాయి. అందుకే వాటికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అని పేర్లు పెట్టుకుని ఆశగా ఆరాధనగా చూశారు. చిన్నగా నిట్టూర్చి ముందుకు చొచ్చుకొచ్చిన బొజ్జను వెనక్కి లాక్కున్నారు. సఫారీ షర్ట్ సర్దుకుంటూ షోరూంలోకి నడిచారు.
సెక్యూరిటీ గార్డు, సూపర్వైజర్లు, సేల్స్మెన్ వినయంగా నిలబడి విష్ చేశారు. తల పంకిస్తూ లిఫ్టులో నాలుగో ఫ్లోర్లో కెళ్ళారు. అందులో ఈశాన్యం మూలలో వున్న తన ఛాంబర్ లోకి నడిచారు.
గ్లాస్ డోర్ తెరచి పట్టుకున్నాడో అటెండర్. లోపలికెళ్తూనే బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి పూజా మందిరం వైపు అడుగులేశారు.
దేవుళ్ల, స్వామిజీల, బాబాల, అమ్మల ఫోటోలూ విగ్రహాలూ బొమ్మల కొలువులోలా అమర్చి వున్నాయి.
ఒక పక్కన ప్రసాదాలు, కర్పూరం, అగరొత్తులు అన్నీ సిద్ధం చేసి వున్నాయి. వివిధ పండ్లనీ డ్రైఫ్రూట్సునీ పెట్టి, దీపారాధన చేశారు. 'శుక్లాంబరధరం...' అంటూ చేతులు జోడించి ప్రార్థన చేశారు.
"దేవుళ్ళూ నేనేమిటో మీ అందరికీ తెలుసు. నా పూజలూ, పుణ్యాలూ తెలుసు. నా ఏకైక కోరికేమిటో, రోజూ నేను చేసే ప్రార్థన ఏంటో కూడా మీకు తెలుసు. మీకు కంఠోపాఠం అయినా అయ్యుండొచ్చు. అయినా సరే రోజూ గుర్తు చేయడం నా ధర్మం, బాధ్యత. చనిపోయాక నేను స్వర్గానికే వెళ్ళాలి. అసలు దాని గురించే ఎన్నో పుణ్యకార్యాలూ, హెూమాలూ చేస్తున్నాను. ఆ సంగతులు మీకు తెలీవని కాదు. మీ మీ అసిస్టెంట్లూ, అక్కౌంటెంట్లూ వాటిని సరిగ్గా రికార్డు చేస్తున్నారో లేదో ననే సందేహంతో మనవి........................
అరచేతిలో స్వర్గం ఇంద్రభవనం లాంటి నాలుగంతస్తుల భవనం. దాని మీద 'వస్త్ర స్వర్గం' అని రాసివున్న బంగారు వర్ణపు అక్షరాలు. నలభై ఏళ్ళ కష్టార్జితం కళ్ల ముందు నిలిచి వున్నట్టు అన్పించింది చక్రధరయ్యకి. ఆనందంగా అపురూపంగా చూశారు. మెల్లగా ఆయన చూపులు కిందికొచ్చాయి. ద్వారానికి అటూ ఇటూ షోకేసుల్లో వున్న అందాలబొమ్మల మీద పడిందాయన దృష్టి. ఒక దానికి కాటన్ చీర, రెండో దానికి కంచి పట్టు చీర, మూడో దానికి జీన్స్ ఫ్యాంటు టీషర్ట్, నాలుగో దానికి లెహెంగా, బ్లౌజు, దుపట్టా ధరింపజేశారు. ప్రాణమున్న అందాలరాశుల్లా వుండి కనువిందు చేస్తున్నాయి. అందుకే వాటికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అని పేర్లు పెట్టుకుని ఆశగా ఆరాధనగా చూశారు. చిన్నగా నిట్టూర్చి ముందుకు చొచ్చుకొచ్చిన బొజ్జను వెనక్కి లాక్కున్నారు. సఫారీ షర్ట్ సర్దుకుంటూ షోరూంలోకి నడిచారు. సెక్యూరిటీ గార్డు, సూపర్వైజర్లు, సేల్స్మెన్ వినయంగా నిలబడి విష్ చేశారు. తల పంకిస్తూ లిఫ్టులో నాలుగో ఫ్లోర్లో కెళ్ళారు. అందులో ఈశాన్యం మూలలో వున్న తన ఛాంబర్ లోకి నడిచారు. గ్లాస్ డోర్ తెరచి పట్టుకున్నాడో అటెండర్. లోపలికెళ్తూనే బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి పూజా మందిరం వైపు అడుగులేశారు. దేవుళ్ల, స్వామిజీల, బాబాల, అమ్మల ఫోటోలూ విగ్రహాలూ బొమ్మల కొలువులోలా అమర్చి వున్నాయి. ఒక పక్కన ప్రసాదాలు, కర్పూరం, అగరొత్తులు అన్నీ సిద్ధం చేసి వున్నాయి. వివిధ పండ్లనీ డ్రైఫ్రూట్సునీ పెట్టి, దీపారాధన చేశారు. 'శుక్లాంబరధరం...' అంటూ చేతులు జోడించి ప్రార్థన చేశారు. "దేవుళ్ళూ నేనేమిటో మీ అందరికీ తెలుసు. నా పూజలూ, పుణ్యాలూ తెలుసు. నా ఏకైక కోరికేమిటో, రోజూ నేను చేసే ప్రార్థన ఏంటో కూడా మీకు తెలుసు. మీకు కంఠోపాఠం అయినా అయ్యుండొచ్చు. అయినా సరే రోజూ గుర్తు చేయడం నా ధర్మం, బాధ్యత. చనిపోయాక నేను స్వర్గానికే వెళ్ళాలి. అసలు దాని గురించే ఎన్నో పుణ్యకార్యాలూ, హెూమాలూ చేస్తున్నాను. ఆ సంగతులు మీకు తెలీవని కాదు. మీ మీ అసిస్టెంట్లూ, అక్కౌంటెంట్లూ వాటిని సరిగ్గా రికార్డు చేస్తున్నారో లేదో ననే సందేహంతో మనవి........................© 2017,www.logili.com All Rights Reserved.