ప్రముఖ అంతర్జాల సాహిత్య వారపత్రిక 'సారంగ' లో ధారావాహికగా వెలువడిన నవల.
సమర్ధుడైన రచయిత ఎప్పుడూ దార్శనికుడే. పౌరభాద్యతనేరిగిన రచనాకారుడు తానున్న సమాజాన్ని, తన పరిసరాల్ని, పరిస్థితులను, సంక్షుభిత సందర్భాలనూ, సకల మానవ సంవేదనలనూ తన రచనల్లో ప్రస్పుటపరుస్తూ తను జీవిస్తున్న సమకాలీన స్థితిగతులకు ప్రాతినిధ్యం వహిస్తూనే తన తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ వెళ్తాడు. ఆ క్రమంలో తన సహమానవుల జీవితాలను ఉన్నతీకరిస్తూ, మెరుగుపరుస్తూ వర్తమాన సంక్లిష్టతలను విప్పి చెబుతూ, పాటపరుస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును స్వప్నిస్తాడు. అందువల్ల వాస్తవ దృష్టి గల రచయిత రచనల్లో నుంచి రాబోయే కాలంలో పుట్టబోయే భావి పాత్రలు జీవం పోసుకుని సజీవమై మనముందు ప్రత్యక్షమౌతాయి. అందుకు నిదర్శనం.
నేను 2009 లో కొద్దికాలం అమెరికాలో ఉన్నప్పుడు ఈ నవలను రాశాను. ఆనాటి భారతదేశ సామాజిక పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ సృష్టించిన పాత్రలు. కాలక్రమంలో ఒక అరవింద్ క్రేజివాల్ గా , ఒక నీర రాడియా గా.. ఇంకా ఇంకా ఎన్నో భారత జీవనవ్యవస్థను ఒక కుదుపు కుదిపి ప్రభావపరిచిన వ్యక్తులుగా రూపొంది.. జీవనరంగంలోకి నడుస్తూ వచ్చాయి. నేను ఈ నవల రాసినప్పుడు వీళ్ళు లేరు. తర్వాత వచ్చారు.
ఈ నవలను చదువుతున్నప్పుడు... దీంట్లోని అనేక పాత్రలు ఇప్పుడు ఈ ఐదేళ్ళ తర్వాత మీ ముందే సంచరిస్తూండడం తెలుస్తుంది.
అందువల్ల దార్శనికత కల్గిన రచయిత కాలక్రమంలో ఒక చరిత్రగా మిగిలిపోతాడు. చరిత్ర ఎప్పుడూ కేవలం గతాన్ని మాత్రమే చెప్పాదు. అంతర్లీనంగా భవిష్యత్తు చిత్రపటాన్ని అవిస్కరిస్తుంది.
ప్రముఖ అంతర్జాల సాహిత్య వారపత్రిక 'సారంగ' లో ధారావాహికగా వెలువడిన నవల. సమర్ధుడైన రచయిత ఎప్పుడూ దార్శనికుడే. పౌరభాద్యతనేరిగిన రచనాకారుడు తానున్న సమాజాన్ని, తన పరిసరాల్ని, పరిస్థితులను, సంక్షుభిత సందర్భాలనూ, సకల మానవ సంవేదనలనూ తన రచనల్లో ప్రస్పుటపరుస్తూ తను జీవిస్తున్న సమకాలీన స్థితిగతులకు ప్రాతినిధ్యం వహిస్తూనే తన తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ వెళ్తాడు. ఆ క్రమంలో తన సహమానవుల జీవితాలను ఉన్నతీకరిస్తూ, మెరుగుపరుస్తూ వర్తమాన సంక్లిష్టతలను విప్పి చెబుతూ, పాటపరుస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును స్వప్నిస్తాడు. అందువల్ల వాస్తవ దృష్టి గల రచయిత రచనల్లో నుంచి రాబోయే కాలంలో పుట్టబోయే భావి పాత్రలు జీవం పోసుకుని సజీవమై మనముందు ప్రత్యక్షమౌతాయి. అందుకు నిదర్శనం. నేను 2009 లో కొద్దికాలం అమెరికాలో ఉన్నప్పుడు ఈ నవలను రాశాను. ఆనాటి భారతదేశ సామాజిక పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ సృష్టించిన పాత్రలు. కాలక్రమంలో ఒక అరవింద్ క్రేజివాల్ గా , ఒక నీర రాడియా గా.. ఇంకా ఇంకా ఎన్నో భారత జీవనవ్యవస్థను ఒక కుదుపు కుదిపి ప్రభావపరిచిన వ్యక్తులుగా రూపొంది.. జీవనరంగంలోకి నడుస్తూ వచ్చాయి. నేను ఈ నవల రాసినప్పుడు వీళ్ళు లేరు. తర్వాత వచ్చారు. ఈ నవలను చదువుతున్నప్పుడు... దీంట్లోని అనేక పాత్రలు ఇప్పుడు ఈ ఐదేళ్ళ తర్వాత మీ ముందే సంచరిస్తూండడం తెలుస్తుంది. అందువల్ల దార్శనికత కల్గిన రచయిత కాలక్రమంలో ఒక చరిత్రగా మిగిలిపోతాడు. చరిత్ర ఎప్పుడూ కేవలం గతాన్ని మాత్రమే చెప్పాదు. అంతర్లీనంగా భవిష్యత్తు చిత్రపటాన్ని అవిస్కరిస్తుంది.
© 2017,www.logili.com All Rights Reserved.