జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస... మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది. సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా! స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. తాను కోల్పోయింది ఏమిటో తనకు కావాల్సింది ఏమిటో తెలుసుకోవాలి...
ఒక సాయంత్రం ఏటి ఒడ్డు కెళ్ళి చంద్రుడు వచ్చేంతవరకు ఓపికతో నిరీక్షిస్తే వెన్నెల మిళితమైన ఏటి నీటిని చూడొచ్చు. అది లేనప్పుడు వట్టి నీటినే చూసి తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. చూడాల్సిన కోణంలో, చూడాల్సిన దృష్టితో చూసినప్పుడే జీవితం కాని, ప్రకృతి కాని అందంగా అనిపిస్తుంది. ఒక రాయికి అందమైన ఆకృతి రావాలంటే ఉలి దెబ్బలు భరిస్తేనే కదా! ముందుగానే ఉలిక్కి పడితే రాయి శిల్పంగా మారుతుందా...?
జీవితాన్ని ఏ కోణంలోంచి చూడాలి అన్నది ప్రశ్న. చూడాల్సిన కోణంలోంచి చూడాలి అన్నది జవాబు. కానీ పరుగే లక్ష్యమైనప్పుడు ఆ పరుగు ప్రశ్న వైపా! జవాబు వైపా అన్నది మీమాంస... మనుషులు నిరంతరం తమను తాము తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు కొన్ని జీవితాలు రాటుదేలతాయి. కొన్ని జీవితాలు రాలిపోతాయి. అందుకే ముగింపు ప్రారంభమై, ప్రారంభం ముగింపు అయి భయపెడుతుంది. సహనం కోల్పోతే సముద్రం కూడా అదుపు తప్పుతుంది కదా! స్వేచ్ఛను కోరుకునే మనిషి తనను తాను తెలుసుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. తాను కోల్పోయింది ఏమిటో తనకు కావాల్సింది ఏమిటో తెలుసుకోవాలి... ఒక సాయంత్రం ఏటి ఒడ్డు కెళ్ళి చంద్రుడు వచ్చేంతవరకు ఓపికతో నిరీక్షిస్తే వెన్నెల మిళితమైన ఏటి నీటిని చూడొచ్చు. అది లేనప్పుడు వట్టి నీటినే చూసి తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. చూడాల్సిన కోణంలో, చూడాల్సిన దృష్టితో చూసినప్పుడే జీవితం కాని, ప్రకృతి కాని అందంగా అనిపిస్తుంది. ఒక రాయికి అందమైన ఆకృతి రావాలంటే ఉలి దెబ్బలు భరిస్తేనే కదా! ముందుగానే ఉలిక్కి పడితే రాయి శిల్పంగా మారుతుందా...?© 2017,www.logili.com All Rights Reserved.