జీవన రాగం
శ్రీపురం స్టూడియో ప్రాంతం-
పురోగమిస్తున్న కాలపురుషుడి అడుగుల చప్పుడులా గోడ గడియారం టకటకలాడుతున్నది. నడినెత్తికెక్కిన సూర్యుని విజయచిహ్నంగా అది పన్నెండు గంటలు కొట్టింది.
విసుగు, విరామం లేకుండా అంతవరకు రికార్డింగ్లో పాల్గొన్న సాంకేతిక నిపుణులందరూ భోజనానికి లేచారు. ప్రక్కగదిలో నుంచి అడపాదడపా మద్దెళ్ల మోతలు, ఫిడేలు కూతలు, బిగ్గరగా నవ్వులు, ఏవో కబుర్లు వినిపిస్తున్నాయి.
భోజనశాలలో డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సంగీత దర్శకుడు రఘు రాకకోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు. కంచాలలో భోజ్యాలు వేడివేడిగా పొగలు కక్కుతున్నాయి.
ఉదయం నుంచి కంఠశోషపడి రికార్డింగ్లో పాల్గొన్న రఘు ముఖం చన్నీటితో సేదతీరేలా కడుక్కుని తుడుచుకుంటూ యథాలాపంగా భోజనశాలలోనికి ప్రవేశించాడు.
ఆవేళ అలౌకిక రస నిర్భరానందం కూర్చే ట్యూనులో సంగీత రచన చేసిన రఘును చూడగానే కూర్చున్నవారంతా ముందే నిర్ణయించుకున్న ప్రకారం కరతాళధ్వనులను చేశారు. హార్ధికంగా ఓర నవ్వుతో అభినందన స్వీకరిస్తూ టేబుల్ దగ్గర ఆశీనుడైనాడు రఘు.
'మీరు కూర్చోకపోయారు. నా కోసం చూస్తున్నారా' అన్నాడు రఘు...............
జీవన రాగం శ్రీపురం స్టూడియో ప్రాంతం- పురోగమిస్తున్న కాలపురుషుడి అడుగుల చప్పుడులా గోడ గడియారం టకటకలాడుతున్నది. నడినెత్తికెక్కిన సూర్యుని విజయచిహ్నంగా అది పన్నెండు గంటలు కొట్టింది. విసుగు, విరామం లేకుండా అంతవరకు రికార్డింగ్లో పాల్గొన్న సాంకేతిక నిపుణులందరూ భోజనానికి లేచారు. ప్రక్కగదిలో నుంచి అడపాదడపా మద్దెళ్ల మోతలు, ఫిడేలు కూతలు, బిగ్గరగా నవ్వులు, ఏవో కబుర్లు వినిపిస్తున్నాయి. భోజనశాలలో డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సంగీత దర్శకుడు రఘు రాకకోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు. కంచాలలో భోజ్యాలు వేడివేడిగా పొగలు కక్కుతున్నాయి. ఉదయం నుంచి కంఠశోషపడి రికార్డింగ్లో పాల్గొన్న రఘు ముఖం చన్నీటితో సేదతీరేలా కడుక్కుని తుడుచుకుంటూ యథాలాపంగా భోజనశాలలోనికి ప్రవేశించాడు. ఆవేళ అలౌకిక రస నిర్భరానందం కూర్చే ట్యూనులో సంగీత రచన చేసిన రఘును చూడగానే కూర్చున్నవారంతా ముందే నిర్ణయించుకున్న ప్రకారం కరతాళధ్వనులను చేశారు. హార్ధికంగా ఓర నవ్వుతో అభినందన స్వీకరిస్తూ టేబుల్ దగ్గర ఆశీనుడైనాడు రఘు. 'మీరు కూర్చోకపోయారు. నా కోసం చూస్తున్నారా' అన్నాడు రఘు...............© 2017,www.logili.com All Rights Reserved.