సగటు తెలుగు రచయిత(త్రి) ఊహాశక్తి గొప్పది. తమకు ఏమీ తెలియని విషయాలను, జన్మలో ఎన్నడూ చూసి ఎరుగని స్థలాలను, బొత్తిగా పరిచయంలేని సందర్భాలను ఊహించి చడామడా రాసిపారేయటంలో ఈకాలపు కథకులు కొందరివి అందెవేసిన చేతులు. గడపదాటని నవలాకారుల, కారిణుల కథారాజాలను చదివి చదివి విసుగుపుట్టిన వారికి రమాదేవి రచనలు చదివితే కడుపు నిండినట్టు సంతుష్టి కలుగుతుంది. ఉన్నత స్థానాల్లో, గొప్ప రాజ్యాంగవ్యవస్థల్లో వ్యవహారాలు ఎలా నడుస్తాయో, ఆయా రంగాల్లో మెసిలేవారి జీవితాలు, పై స్థాయిలో తెర బాగోతాలు ఎలా ఉంటాయో ఈ గ్రంథపరంపరలో రచయిత్రి సమర్థంగా, సాధికారికంగా చిత్రించారు.
తనకు బాగా పరిచయమైనా జీవనరంగాలను, వాటిలో తనకు బాగా తెలిసిన విషయాలను మాత్రమే ఎంచుకుని, ఒడుపుగా కథ అల్లడం రమాదేవిగారి ప్రత్యేకత. ఈ నవలల్లో నిండినజీవితం ఉంది. నికార్సయిన వాస్తవం ఉంది. కావలసినంత వైవిధ్యం ఉంది. తెలుగులో గొప్పనవలలు రాసినవారు ఎందరో ఉన్నారు. కాని రమాదేవిగారు రాసిన నవలల వంటివి మాత్రం మరొకరు రాయలేరు. ఎందుకంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా, గవర్నరుగా ఆమెకుగల అనుభవం, విషయపరిజ్ఞానం ఇతరులకు ఊహిస్తే పట్టుబడేది కాదు.
- ఎం వి ఆర్ శాస్త్రి
సగటు తెలుగు రచయిత(త్రి) ఊహాశక్తి గొప్పది. తమకు ఏమీ తెలియని విషయాలను, జన్మలో ఎన్నడూ చూసి ఎరుగని స్థలాలను, బొత్తిగా పరిచయంలేని సందర్భాలను ఊహించి చడామడా రాసిపారేయటంలో ఈకాలపు కథకులు కొందరివి అందెవేసిన చేతులు. గడపదాటని నవలాకారుల, కారిణుల కథారాజాలను చదివి చదివి విసుగుపుట్టిన వారికి రమాదేవి రచనలు చదివితే కడుపు నిండినట్టు సంతుష్టి కలుగుతుంది. ఉన్నత స్థానాల్లో, గొప్ప రాజ్యాంగవ్యవస్థల్లో వ్యవహారాలు ఎలా నడుస్తాయో, ఆయా రంగాల్లో మెసిలేవారి జీవితాలు, పై స్థాయిలో తెర బాగోతాలు ఎలా ఉంటాయో ఈ గ్రంథపరంపరలో రచయిత్రి సమర్థంగా, సాధికారికంగా చిత్రించారు. తనకు బాగా పరిచయమైనా జీవనరంగాలను, వాటిలో తనకు బాగా తెలిసిన విషయాలను మాత్రమే ఎంచుకుని, ఒడుపుగా కథ అల్లడం రమాదేవిగారి ప్రత్యేకత. ఈ నవలల్లో నిండినజీవితం ఉంది. నికార్సయిన వాస్తవం ఉంది. కావలసినంత వైవిధ్యం ఉంది. తెలుగులో గొప్పనవలలు రాసినవారు ఎందరో ఉన్నారు. కాని రమాదేవిగారు రాసిన నవలల వంటివి మాత్రం మరొకరు రాయలేరు. ఎందుకంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా, గవర్నరుగా ఆమెకుగల అనుభవం, విషయపరిజ్ఞానం ఇతరులకు ఊహిస్తే పట్టుబడేది కాదు. - ఎం వి ఆర్ శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.