అద్భుత జానపద నవల సింహగడం రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి ఉదయసింహుణ్ణి మాయోపాయంతో ఓడించి, రాజ్య బహిష్కృతుణ్ణి చేసి తానే సింహగడం చక్రవర్తిని అని ప్రకటించుకొని, రాక్షస నిలయం పేరుతో ఒక మాయా భవనాన్ని నిర్మించుకొని, తనకు నచ్చనివారిని, తన శత్రువులను అందులో బంధిస్తుంటాడు సింహగడం సేనాని ప్రచండ సింహుడు.
ప్రచండ సింహుని ఎలాగైనా ఓడించాలని, అతని రాక్షస నిలయ రహస్యాలను కనిపెట్టటానికెళ్ళిన ఉదయసింహుని పెద్ద కుమారుడు సుగుణసింహుని పట్టుకుని రాక్షస నిలయంలో బంధిస్తాడు ప్రచండ సింహుడు.
తన అన్నను కాపాడి, రాక్షస నిలయాన్ని నాశనం చేసి ఎలాగైనా సింహగడం తిరిగి సాధించాలనే లక్ష్యంతో తన స్నేహితుడు శూర సింహునితో కలిసి రాక్షస నిలయంలో ప్రవేశిస్తాడు ఉదయసింహుని చిన్న కుమారుడు విజయసింహుడు.
తరువాత ఏం జరిగింది?
అద్భుత విషయాలతో, అడుగడుగునా జలదరించే సంఘటనలతో ఉర్రూతలూగిస్తూ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే అద్భుత మిస్టరీ నవల ఈ మాయాజాలం..
అలనాటి మేటి రచయిత 'డాక్టర్' కలం పేరుతో అనేక జానపద, డిటెక్టివ్ రచనలు చేసిన డాక్టర్ మల్లిఖార్జునరావు గారి అద్భుత సృష్టి
అద్భుత జానపద నవల సింహగడం రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి ఉదయసింహుణ్ణి మాయోపాయంతో ఓడించి, రాజ్య బహిష్కృతుణ్ణి చేసి తానే సింహగడం చక్రవర్తిని అని ప్రకటించుకొని, రాక్షస నిలయం పేరుతో ఒక మాయా భవనాన్ని నిర్మించుకొని, తనకు నచ్చనివారిని, తన శత్రువులను అందులో బంధిస్తుంటాడు సింహగడం సేనాని ప్రచండ సింహుడు. ప్రచండ సింహుని ఎలాగైనా ఓడించాలని, అతని రాక్షస నిలయ రహస్యాలను కనిపెట్టటానికెళ్ళిన ఉదయసింహుని పెద్ద కుమారుడు సుగుణసింహుని పట్టుకుని రాక్షస నిలయంలో బంధిస్తాడు ప్రచండ సింహుడు. తన అన్నను కాపాడి, రాక్షస నిలయాన్ని నాశనం చేసి ఎలాగైనా సింహగడం తిరిగి సాధించాలనే లక్ష్యంతో తన స్నేహితుడు శూర సింహునితో కలిసి రాక్షస నిలయంలో ప్రవేశిస్తాడు ఉదయసింహుని చిన్న కుమారుడు విజయసింహుడు. తరువాత ఏం జరిగింది? అద్భుత విషయాలతో, అడుగడుగునా జలదరించే సంఘటనలతో ఉర్రూతలూగిస్తూ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే అద్భుత మిస్టరీ నవల ఈ మాయాజాలం.. అలనాటి మేటి రచయిత 'డాక్టర్' కలం పేరుతో అనేక జానపద, డిటెక్టివ్ రచనలు చేసిన డాక్టర్ మల్లిఖార్జునరావు గారి అద్భుత సృష్టి© 2017,www.logili.com All Rights Reserved.