ఏ రచన చేయడమన్నా ఎంతో కొంత కష్టం, మరెంతో కొంత సులువు ఉంటాయి. అవలీలగా వ్రాశామా, అష్టకష్టాలూ పడి వ్రాశామా అన్నది నిలవదు. బాగా వ్రాయగలిగామా లేదా అన్నదే చివరికి మిగులుతుంది. నవల కష్టమా - కథ, కష్టమా - కవిత్వం - కష్టమా అంటూ ప్రశ్నలు కొకల్లలు. పద్యం వ్రాసినంత మాత్రాన అది కవిత్వంగా చలామణీ అయ్యే సందర్భాలు కూడా చూస్తున్నాం. అలాగే ఏదో కొంత కొల్లేరు చాంతాడులా రాసి పారేసి, దాన్ని కథగా, నవలగా సమర్థించుకుంటున్న పరిస్థితీ ఉంది. నా అభిప్రాయం ఏది వ్రాయడమన్నా సులువే. అలాగే ఏది వ్రాయడమన్నా కష్టమే.
నేను వ్రాసిన మూడు చిన్న నవలలు ఇప్పటికే వివిధ పత్రికల్లో అనుబంధాలుగా వచ్చినవి పుస్తక రూపంలో తెచ్చి మీ ముందు పెట్టాలని ఈ ప్రయత్నం చేస్తున్నా. ఇందులో మొదటి నవల 'దేవకీ, వాళ్ళక్క, అన్నయా' చిత్ర మానసపత్రికలో 2013 నవంబరు అనుబంధ నవలగా వచ్చింది. రెండోది క్షమ 'అంతరంగ తరంగాలు' అనే పేరుతొ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియల్ గా వచ్చింది. మూడోది 'నిజానికీ అబద్ధానికీ మధ్య' చతుర మాసపత్రికలో నవలగా వచ్చింది. విభిన్న ఇతివృత్తాలతో సాగిన ఈ మూడు నవలలు మీరు కాహ్డివి స్పందించగలరనే ఆశతో మీ ముందుంచుతున్నాను.
- జానకీబాల
ఏ రచన చేయడమన్నా ఎంతో కొంత కష్టం, మరెంతో కొంత సులువు ఉంటాయి. అవలీలగా వ్రాశామా, అష్టకష్టాలూ పడి వ్రాశామా అన్నది నిలవదు. బాగా వ్రాయగలిగామా లేదా అన్నదే చివరికి మిగులుతుంది. నవల కష్టమా - కథ, కష్టమా - కవిత్వం - కష్టమా అంటూ ప్రశ్నలు కొకల్లలు. పద్యం వ్రాసినంత మాత్రాన అది కవిత్వంగా చలామణీ అయ్యే సందర్భాలు కూడా చూస్తున్నాం. అలాగే ఏదో కొంత కొల్లేరు చాంతాడులా రాసి పారేసి, దాన్ని కథగా, నవలగా సమర్థించుకుంటున్న పరిస్థితీ ఉంది. నా అభిప్రాయం ఏది వ్రాయడమన్నా సులువే. అలాగే ఏది వ్రాయడమన్నా కష్టమే. నేను వ్రాసిన మూడు చిన్న నవలలు ఇప్పటికే వివిధ పత్రికల్లో అనుబంధాలుగా వచ్చినవి పుస్తక రూపంలో తెచ్చి మీ ముందు పెట్టాలని ఈ ప్రయత్నం చేస్తున్నా. ఇందులో మొదటి నవల 'దేవకీ, వాళ్ళక్క, అన్నయా' చిత్ర మానసపత్రికలో 2013 నవంబరు అనుబంధ నవలగా వచ్చింది. రెండోది క్షమ 'అంతరంగ తరంగాలు' అనే పేరుతొ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియల్ గా వచ్చింది. మూడోది 'నిజానికీ అబద్ధానికీ మధ్య' చతుర మాసపత్రికలో నవలగా వచ్చింది. విభిన్న ఇతివృత్తాలతో సాగిన ఈ మూడు నవలలు మీరు కాహ్డివి స్పందించగలరనే ఆశతో మీ ముందుంచుతున్నాను. - జానకీబాల© 2017,www.logili.com All Rights Reserved.