ఇందులోని కథ చాలా చిన్నది. రామారావు కు కన్న కూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితంగా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా, నిస్పృహలు అలుముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు. ప్రేమించగల హృదయం. పోయిన తన పాపలాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు చేర్చుకుంటాడు.
ఎండి, మాడై పోయిన తన బ్రతుకుకు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు. ఈ సంఘటనల చుట్టూ తన తాత్విక చింతనను అల్లాడు బైరాగి. కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ ఉంటుందో చూడదలచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్విక రచన. మనిషిని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్ఞులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు.
- ఆవుల సాంబశివరావు
ఇందులోని కథ చాలా చిన్నది. రామారావు కు కన్న కూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితంగా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా, నిస్పృహలు అలుముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు. ప్రేమించగల హృదయం. పోయిన తన పాపలాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు చేర్చుకుంటాడు. ఎండి, మాడై పోయిన తన బ్రతుకుకు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు. ఈ సంఘటనల చుట్టూ తన తాత్విక చింతనను అల్లాడు బైరాగి. కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ ఉంటుందో చూడదలచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్విక రచన. మనిషిని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్ఞులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు. - ఆవుల సాంబశివరావు© 2017,www.logili.com All Rights Reserved.