ఇప్పుడు ఈ పుస్తకంలో చిన్నాపెద్ద నవలలు ఎప్పటివో ఒక బృహత్సంపుటంగా వెలువడుతున్నాయి. ఈ నవలలు అన్నీ ప్రసిద్ద పత్రికలలో వెలువడి పాఠకాదరణ పొందినవే. 1975 - 80కి ముందునాటివే అన్నీ. ఈ నవలలేవి ఒక్కటి అయినా సులభంగా దొరకడం లేదు. 'ద్రువతార' 1961 ప్రాంతాలలో 'ఆంధ్రసచిత్ర వారపత్రిక'లోనూ, 'ముక్తి', 'పంజరం' రెండూ ఆ ప్రాంతాలలోనే 'విశాలాంధ్ర' దినపత్రికలోనూ ధారావాహికంగా వెలువడ్డాయి. 'అంగారతల్పం', 'చేదుమాత్ర' ప్రముఖ సాహిత్య మాసపత్రిక 'భారతి'లో 1965 ప్రాంతాలలో వెలువడ్డాయి. ఇక 'త్రిశంకువర్గం' 'ఇండియా టుడే'లోనూ, 'లావా', 'అర్జునుడు' మరో ప్రసిద్ద వారపత్రికలోను ధారావాహికంగా వెలువడ్డాయి.
వాటిని అప్పటి పాఠకులు ఆసక్తితోనే చదివారు. అవి పునర్ముద్రణలకు కూడా నోచుకున్నాయి. అయితే నాకు 'కథానిక' మీద ఉన్న ప్రీతి, మమకారమూ నవలల మీద అంతగా లేదు. ముఖ్యంగా 'ద్రువతార' ఆనాడు పాఠకాదరణ విరివిగా పొందినా, ఇప్పుడు చదువుతుంటే అమెచ్యూరిష్ గా అనిపిస్తుంది. వీటిని నవలలనవచ్చో లేదో నాకు సరిగా తెలీదు. కానీ 'హెమింగ్వే ఓల్డ్ మాన్ అండ్ ది సీ', నికోలాయ్ గోగోల్ 'ది క్లోక్'లను ప్రపంచవ్యాప్తంగా సాహితీపరులు వీటిని నవలలనే అన్నారు. అందువల్ల ఇవీ నవలలనే అనుకోవచ్చు. ఈ ఎనిమిది నవలల సమాహారంగా ఈ పుస్తకం వెలువడింది. చదివండి! ఆనందించండి!!
- పెద్దిబొట్ల సుబ్బరామయ్య
ఇప్పుడు ఈ పుస్తకంలో చిన్నాపెద్ద నవలలు ఎప్పటివో ఒక బృహత్సంపుటంగా వెలువడుతున్నాయి. ఈ నవలలు అన్నీ ప్రసిద్ద పత్రికలలో వెలువడి పాఠకాదరణ పొందినవే. 1975 - 80కి ముందునాటివే అన్నీ. ఈ నవలలేవి ఒక్కటి అయినా సులభంగా దొరకడం లేదు. 'ద్రువతార' 1961 ప్రాంతాలలో 'ఆంధ్రసచిత్ర వారపత్రిక'లోనూ, 'ముక్తి', 'పంజరం' రెండూ ఆ ప్రాంతాలలోనే 'విశాలాంధ్ర' దినపత్రికలోనూ ధారావాహికంగా వెలువడ్డాయి. 'అంగారతల్పం', 'చేదుమాత్ర' ప్రముఖ సాహిత్య మాసపత్రిక 'భారతి'లో 1965 ప్రాంతాలలో వెలువడ్డాయి. ఇక 'త్రిశంకువర్గం' 'ఇండియా టుడే'లోనూ, 'లావా', 'అర్జునుడు' మరో ప్రసిద్ద వారపత్రికలోను ధారావాహికంగా వెలువడ్డాయి. వాటిని అప్పటి పాఠకులు ఆసక్తితోనే చదివారు. అవి పునర్ముద్రణలకు కూడా నోచుకున్నాయి. అయితే నాకు 'కథానిక' మీద ఉన్న ప్రీతి, మమకారమూ నవలల మీద అంతగా లేదు. ముఖ్యంగా 'ద్రువతార' ఆనాడు పాఠకాదరణ విరివిగా పొందినా, ఇప్పుడు చదువుతుంటే అమెచ్యూరిష్ గా అనిపిస్తుంది. వీటిని నవలలనవచ్చో లేదో నాకు సరిగా తెలీదు. కానీ 'హెమింగ్వే ఓల్డ్ మాన్ అండ్ ది సీ', నికోలాయ్ గోగోల్ 'ది క్లోక్'లను ప్రపంచవ్యాప్తంగా సాహితీపరులు వీటిని నవలలనే అన్నారు. అందువల్ల ఇవీ నవలలనే అనుకోవచ్చు. ఈ ఎనిమిది నవలల సమాహారంగా ఈ పుస్తకం వెలువడింది. చదివండి! ఆనందించండి!! - పెద్దిబొట్ల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.