ఈ కథనంలో, అవసరమైన చోట వ్యవసాయపారిభాషిక పదాలే వాడబడ్డాయి. ఈనాడు మచ్చుకైన వినబడని, ఆనాటి వ్యవసాయ ఒప్పందాలు - "శ్రావణపత్రాలు" లాంటివి - దీనిలో ప్రస్తావించబడ్డాయి. ఆనాటి ద్రవ్యమారకం, ద్రవ్య వినిమయ విధానాలను చెప్పడం జరిగింది. ఈనాటి వారికి, ముందు తరాల వారికి, ఆనాటి పరిస్థితుల గురించి, స్వల్పస్థాయిలోనైనా ఒక చిన్న అవగాహనగా ఇది ఉపయోగపడాలనే ప్రయత్నం జరిగింది. అయితే, చాలా విషయాల్లో అది చిన్న ప్రయత్నం మాత్రమే! పాఠకులకెంతవరకూ ఉపయోగమో వారికే తెలుస్తుంది. సర్. ఆర్ధర్ కాటన్ గోదావరి నదిపై చేసిన ఆనకట్ట నిర్మాణం వరకూ చెప్పబడింది.
ఆంధ్రదేశంలో ఒకపుడు జరిగిన అతి పెద్ద వ్యవసాయ వలస ద్వారా ఏర్పడిన ఆర్ధికాభివృద్ధి, సాంస్కృతిక సమ్మేళనాలను పరిశీలించి వ్రాయబడిన తెలుగువారి కథ! విస్మరింపబడిన సమీపగతంలోని జీవనపరిస్థితులు, పరిభాష, ప్రజా చిత్రాన్ని నేటి తరం వారికి తెలియ చెప్పే నూతన నవల! ఇది చదివితే మీ గతతరాల వారితో సంభాషిస్తారు!
ఈ కథనంలో, అవసరమైన చోట వ్యవసాయపారిభాషిక పదాలే వాడబడ్డాయి. ఈనాడు మచ్చుకైన వినబడని, ఆనాటి వ్యవసాయ ఒప్పందాలు - "శ్రావణపత్రాలు" లాంటివి - దీనిలో ప్రస్తావించబడ్డాయి. ఆనాటి ద్రవ్యమారకం, ద్రవ్య వినిమయ విధానాలను చెప్పడం జరిగింది. ఈనాటి వారికి, ముందు తరాల వారికి, ఆనాటి పరిస్థితుల గురించి, స్వల్పస్థాయిలోనైనా ఒక చిన్న అవగాహనగా ఇది ఉపయోగపడాలనే ప్రయత్నం జరిగింది. అయితే, చాలా విషయాల్లో అది చిన్న ప్రయత్నం మాత్రమే! పాఠకులకెంతవరకూ ఉపయోగమో వారికే తెలుస్తుంది. సర్. ఆర్ధర్ కాటన్ గోదావరి నదిపై చేసిన ఆనకట్ట నిర్మాణం వరకూ చెప్పబడింది. ఆంధ్రదేశంలో ఒకపుడు జరిగిన అతి పెద్ద వ్యవసాయ వలస ద్వారా ఏర్పడిన ఆర్ధికాభివృద్ధి, సాంస్కృతిక సమ్మేళనాలను పరిశీలించి వ్రాయబడిన తెలుగువారి కథ! విస్మరింపబడిన సమీపగతంలోని జీవనపరిస్థితులు, పరిభాష, ప్రజా చిత్రాన్ని నేటి తరం వారికి తెలియ చెప్పే నూతన నవల! ఇది చదివితే మీ గతతరాల వారితో సంభాషిస్తారు!© 2017,www.logili.com All Rights Reserved.