రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ప్రజలు నాటకాలకోసం ఎగబడేవారు. నాటకం మేధావి వర్గం నుంచి పుట్టినా, మేధావి వర్గానికే పరిమితం కాలేదు. సామాన్య ప్రజల హృదయాలకు చేరువైంది. ప్రజలు డబ్బిచ్చి చూసి, ఆనందించగలిగే స్థితిలో నాటకం వర్ధిల్లింది. మహాకవులు వీరేశలింగం పంతులు, ధర్మవరపు రామకృష్ణమాచార్యులు, వేదం వేంకటరాయశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తిరుపతి వేంకటకవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్ళకూరి నారాయణరావు మొదలైనవారు ప్రముఖ నాటక కర్తలుగా గుర్తింపు పొందారు. వారి రచనల్లో మణిపూసలుగా నిలదొక్కుకున్న పద్యనాటకాలు శాకుంతలము, విషాద సారంగధర, బొబ్బిలియుద్ధము, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగము, సత్యహరిశ్చంద్ర, చింతామణి మున్నగునవి. ఆయా నాటకాల్లో అనేక పద్యాలు తెలుగునాట మార్మోగాయి.
ఒకనాడు తెలుగానాట ఇంటింటా, రచ్చలో, గొడ్లు కాసే పిల్లగాడి నోటిలో ఆ పద్యాలు మార్మోగాయి. చక్కని వ్యవహారశైలి, తెలుగుదనం ఉట్టిపడేలా ఆ పద్యాలుండటం ఒక కారణం. ఇంతగా ప్రజాదారణ పొందిన అమూల్యమైన పద్యాలు తరతరాలు మననం చేసుకునేందుకు ఉపయుక్తంగా ఉండేందుకు దోహదపడే విలువైన పుస్తకం. తెలుగువారి ప్రతి ఇంటా ఉండదగిన అలనాటి కమనీయ నాటక పద్యాల సమాహారమిది. తక్షణం మీ సొంతం చేసుకోండి!
రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ప్రజలు నాటకాలకోసం ఎగబడేవారు. నాటకం మేధావి వర్గం నుంచి పుట్టినా, మేధావి వర్గానికే పరిమితం కాలేదు. సామాన్య ప్రజల హృదయాలకు చేరువైంది. ప్రజలు డబ్బిచ్చి చూసి, ఆనందించగలిగే స్థితిలో నాటకం వర్ధిల్లింది. మహాకవులు వీరేశలింగం పంతులు, ధర్మవరపు రామకృష్ణమాచార్యులు, వేదం వేంకటరాయశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తిరుపతి వేంకటకవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్ళకూరి నారాయణరావు మొదలైనవారు ప్రముఖ నాటక కర్తలుగా గుర్తింపు పొందారు. వారి రచనల్లో మణిపూసలుగా నిలదొక్కుకున్న పద్యనాటకాలు శాకుంతలము, విషాద సారంగధర, బొబ్బిలియుద్ధము, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగము, సత్యహరిశ్చంద్ర, చింతామణి మున్నగునవి. ఆయా నాటకాల్లో అనేక పద్యాలు తెలుగునాట మార్మోగాయి. ఒకనాడు తెలుగానాట ఇంటింటా, రచ్చలో, గొడ్లు కాసే పిల్లగాడి నోటిలో ఆ పద్యాలు మార్మోగాయి. చక్కని వ్యవహారశైలి, తెలుగుదనం ఉట్టిపడేలా ఆ పద్యాలుండటం ఒక కారణం. ఇంతగా ప్రజాదారణ పొందిన అమూల్యమైన పద్యాలు తరతరాలు మననం చేసుకునేందుకు ఉపయుక్తంగా ఉండేందుకు దోహదపడే విలువైన పుస్తకం. తెలుగువారి ప్రతి ఇంటా ఉండదగిన అలనాటి కమనీయ నాటక పద్యాల సమాహారమిది. తక్షణం మీ సొంతం చేసుకోండి!© 2017,www.logili.com All Rights Reserved.